Disney Hotstar OTT: వీఐ నుంచి అద్భుత ఆఫర్, 151 రూపాయలకే హై స్పీడ్ డేటా, ఉచిత ఓటీటీ సభ్యత్వం

Disney Hotstar OTT: వోడాఫోన్ ఐడియా యూజర్లకు గుడ్‌న్యూస్. కేవలం 151 రూపాయల అతి తక్కువ ధరకు ఉచిత ఓటీటీ సహా చాలా ప్రయోజనాలున్నాయి. ఆ వివరాలు తెలుసుకుందాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 24, 2022, 11:43 PM IST
Disney Hotstar OTT: వీఐ నుంచి అద్భుత ఆఫర్, 151 రూపాయలకే హై స్పీడ్ డేటా, ఉచిత ఓటీటీ సభ్యత్వం

Disney Hotstar OTT: వోడాఫోన్ ఐడియా యూజర్లకు గుడ్‌న్యూస్. కేవలం 151 రూపాయల అతి తక్కువ ధరకు ఉచిత ఓటీటీ సహా చాలా ప్రయోజనాలున్నాయి. ఆ వివరాలు తెలుసుకుందాం..

ఇటీవలి కాలంలో ఓటీటీ వేదికలకు ఆదరణ పెరుగుతోంది. అయితే చాలా ఓటీటీలు ఉండటం వల్ల సబ్‌స్క్రిప్షన్ సమస్యగా మారుతోంది. అన్ని ఓటీటీల సబ్‌స్క్రిప్షన్ తీసుకోవడమంటే కష్టమైన పనే. ఈ నేపధ్యంలో వోడాఫోన్ ఐడియా అందిస్తున్న ఆఫర్ గురించి తెలిస్తే ఎగిరి గంతేస్తారు. కేవలం 151 రూపాయలకు హై స్పీడ్ నెట్, ఇతర ప్రయోజనాలు, ఓటీటీ సేవలు లభించనున్నాయి. ఆశ్చర్యంగా ఉందా..

ఈ ఆఫర్ వోడాఫోన్ ఐడియా అందిస్తోంది. ఈ ప్లాన్ ధర 151 రూపాయలు. ఇందులో హై స్పీడ్ డేటాతో పాటు ఇతర చాలా ప్రయోజనాలున్నాయి. ఈ ప్లాన్‌లో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా అందనుంది. అది కూడా మూడు నెలల సభ్యత్వం. 

151 రూపాయలతో కలిగే లాభాలు

ఉచిత ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌తో పాటు ఈ ప్లాన్‌లో ఇంకా చాలా ప్రయోజనాలున్నాయి. 30 రోజుల్లో ఈ ప్లాన్ కింద 8 జీబీ డేటా లభిస్తుంది. ఈ ప్లాన్‌లో యూజర్లకు ఎస్ఎంఎస్ లేదా అన్‌లిమిటెడ్ కాలింగ్ సౌకర్యం కలుగుతుంది. మరోవైపు వోడాఫోన్ ఐడియా ప్రకారం..399 రూపాయల ప్లాన్ కూడా ఉంది. ఇందులో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌తో పాటు రోజువారీ డేటా, ఉచిత ఎస్ఎంఎస్, అన్‌లిమిటెడ్ కాలింగ్ సౌకర్యం ఉంటుంది. 

Also read: Bank Holidays October 2022: అక్టోబర్ నెలలో బ్యాంకుల సెలవు రోజులు ఇవే..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News