Whatsapp New Features 2023: త్వరలోనే వాట్సాప్ నుంచి మరో సరికొత్త ఫీచర్.. ఇక నుంచి స్క్రీన్ షాట్స్ ఆప్షన్ బంద్!

Whatsapp New Features 2023: వాట్సాప్ వినియోగదారులకు కంపెనీ గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే వాట్సాప్ లో కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు కంపెనీ తెలిపింది. ఆ ఫీచర్ ఏంటో.. ఆ ఫీచర్ కి సంబంధించిన మరిన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jun 12, 2023, 04:16 PM IST
 Whatsapp New Features 2023: త్వరలోనే వాట్సాప్ నుంచి మరో సరికొత్త ఫీచర్.. ఇక నుంచి స్క్రీన్ షాట్స్ ఆప్షన్ బంద్!

Whatsapp New Features 2023: ప్రస్తుతం వాట్సాప్ వినియోగించని వారంటూ ఉండరు.. ప్రస్తుతం చిన్న పెద్ద తేడా లేకుండా స్మార్ట్ ఫోన్లను వినియోగిస్తూ వాట్సాప్ లోని అన్ని రకాల విషయాలను తెలుసుకుంటున్నారు. ముఖ్యంగా కోవిడ్ కాలం నుంచి వాట్సాప్ వినియోగం రెట్టింపు అయ్యింది. అన్ని రకాల విషయాలను సెకండ్ల వ్యవధిలోనే వాట్సాప్ ద్వారా తెలుసుకుంటున్నారు. అయితే వాట్సప్ తన వినియోగదారులను దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను అందిస్తూనే ఉంది. త్వరలోనే వాట్సప్ తమ వినియోగదారులందరికీ మరో గుడ్ న్యూస్ చెప్పబోతోందని సమాచారం. ఈ గుడ్ న్యూస్ కి సంబంధించిన మరిన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.

వాట్సప్ ఆధునిక జీవనశైలిని దృష్టిలో పెట్టుకొని వినియోగదారులకు కొత్త ఫీచర్లు అందించే దిశగా మరోసారి ముందడు వేసింది. భారత కంపెనీకి చెందిన టెలిగ్రామ్ కు వాట్సప్ ఛానల్స్ ఫీచర్ ద్వారా పోటీగా రాబోతోంది. ఈ చానల్స్ ఫ్యూచర్ ద్వారా వ్యక్తులు వారికి సంబంధించిన పర్సనల్ డేటాను ఛానల్ లో ఉన్న ప్రతి ఒక్కరికి షేర్ చేయవచ్చు. అంతేకాకుండా సబ్స్క్రైబ్ అనే బటన్ కూడా పెట్టబోతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన సమాచారాన్ని వాట్సప్ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. 

Also read: Hair Mask: డేండ్రఫ్ సమస్యను సమూలంగా తొలగించే హోమ్ మేడ్ హెయిర్ మాస్క్ ఇదే

మీడియా నివేదికల ప్రకారం.. వాట్సాప్ ను అన్ని రకాల వినియోగదారులు వినియోగించుకునే విధంగా ఛానల్ ఫీచర్ను విడుదల చేయబోతున్నట్లు తెలిపింది. అంతేకాకుండా ఈ ఫీచర్ కు సంబంధించిన టెస్టింగ్ ఇప్పటికే మొదలైందని వచ్చే ఫిబ్రవరిలోపు ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని సమాచారం.

ఈ ఫీచర్ ద్వారా ఛానల్ అడ్మిన్ అన్ని రకాల డేటాను షేర్ చేయవచ్చని వాట్సప్ పేర్కొంది. అంతేకాకుండా ఈ ఛానల్ క్రియేట్ చేసేందుకు ముందుగా మీ వ్యక్తిగత సమాచారాన్ని వాట్సప్ పరిశీలిస్తుందని సమాచారం. మీరు ఈ ఛానల్ లో వీడియో, ఆడియో, ఫోటోలు షేర్ చేసుకునే విధంగా రూపొందించినట్లు తెలుస్తోంది. కాకపోతే ఈ ఛానల్ ను మీరు స్క్రీన్ షాట్ తీసుకో లేకుండా ఆప్షన్ తొలగించినట్లు వాట్సప్ కంపెనీ పేర్కొంది.

Also read: Hair Mask: డేండ్రఫ్ సమస్యను సమూలంగా తొలగించే హోమ్ మేడ్ హెయిర్ మాస్క్ ఇదే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News