Redmi 14C: చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీ షియోమి కొత్తగా Redmi 14C 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేసింది. ఇది ఆధునిక ఫీచర్లతో అత్యంత చౌక దరకు అందుబాటులో ఉన్న ఫోన్. ప్రస్తుతం ఈ ఫోన్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సహా ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో జనవరి 10 నుంచి అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ ధర, ఫీచర్ల గురంచి తెలుసుకుందాం.
Redmi 14C 5G ఫోన్ 6.88 ఇంచెస్ హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లే కలిగి ఉంటుంది. 600 నిట్స్ బ్రైట్‌నెస్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో పనిచేస్తుంది. ఈ ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 4 జనరేషన్ 2 ప్రోసెసర్‌తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 14 ఆధారంగా పనిచేస్తుంది. యాంటీ డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ విషయంలో ఐపీ 52 రేటింగ్ కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌తో పనిచేస్తుంది. ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమేరా, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమేరా ఉన్నాయి. ఇక బ్యాటరీ అయితే ఏకంగా 5160 ఎంఏహెచ్ సామర్ధ్యం కలిగి ఉంటుంది. 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది.
50 మెగాపిక్సెల్ కెమేరా 4జీబీ ర్యామ్, 6జీబీ ర్యామ్ కలిగిన ఫోన్లు మార్కెట్లో 15 వేల వరకూ ధర పలుకుతున్నాయి. కానీ Redmi 14C 5Gలో 4జీబీ ర్యామ్ 64 జీబీ స్టోరేజ్ వెర్షన్ ఫోన్ కేవలం 9,999 రూపాయలకు లభిస్తుంది. ఇందులోనే 128 జీబీ స్టోరేజ్ అయితే 10,999 రూపాయలకు అందుబాటులో ఉంటుంది. ఇక 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ధర 11,999 రూపాయలకు లభిస్తుంది.
Also read: Reliance Jio Recharge Plans: డేటా అవసరం లేకుండా కేవలం వాయిస్ కాలింగ్ ఇచ్చే బెస్ట్ ప్లాన్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.