BJP Madhavi latha: బీజేపీ ఫైర్ బ్రాండ్ మాధవీలత జోరుకు హై కమాండ్ బ్రేకులు వేసిందా..!

BJP Madhavi latha: భారతీయ జనతా పార్టీ ఫైర్ బ్రాండ్ గా గత లోక్ సభ ఎన్నికల్లో హైదరాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసారు. అంతేకాదు ఒవైసీకి ఓ రకంగా చుక్కులు చూపించింది. అంతేకాదు జాతీయ స్థాయిలో కూడా ఈమె పేరు మారు మ్రోగిపోయింది. అయితే లోక్ సభ ఎన్నికల తర్వాత మాధవీ లతా జోరు తగ్గిందా.. లేకపోతే.. మాధవీ లత జోరుకు బీజేపీ హై కమాండ్ బ్రేకులు వేసిందా..

Written by - TA Kiran Kumar | Last Updated : Sep 15, 2024, 01:36 PM IST
BJP Madhavi latha: బీజేపీ ఫైర్ బ్రాండ్ మాధవీలత జోరుకు హై కమాండ్ బ్రేకులు వేసిందా..!

BJP Madhavi latha: హైదరాబాద్ పార్లమెంట్ కు స్థానం నుంచి భారతీయ జనతా పార్టీ  (BJP) అభ్యర్థిగా పోటీ చేసిన మాధవీలత ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు. తాజాగా ఖైరతాబాద్ వినాయక మండపం దగ్గర కాసేపు అలా కనిపించింది. కానీ పెద్దగా హడావుడి కూడా లేదు. అయితే ఎన్నికల ముందు వరకు తన ప్రసంగాలతో హోరెత్తించిన ఈమె ఇపుడు సడెన్ సైలెంట్ అయిపోయింది. మాధవీ లత జోరుకు బీజేపీ హై కమాండే బ్రేకులు వేసిందా.. ?  ఆమెను ప్రస్తుతం మౌనాన్ని ఆశ్రయించిందా..! ప్రస్తుతం తెలుగు రాష్ట్రమైన  తెలంగాణలో ఇదే హాట్ టాపిక్ గా మారింది. అంతేకాదు  రాజకీయంగా కాక పుట్టిస్తోంది.

ఎప్పుడు హడావుడి చేస్తూ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచే మాధవీలత.. గణేష్ నవరాత్రోత్సవాల్లో మాత్రం ఎలాంటి హడావుడి చేయడం లేదు. తను పోటి చేసిన  హైదరాబాద్  పార్లమెంట్ పరిధిలోనే ఎక్కువ వినాయక విగ్రహాలను ఏర్పాటు చేయడం ఎప్పటి నుంచో జరగుతుంది. చంద్రాయణ గుట్ట నుంచి మొదలు పెడితే.. మెహిదీపట్నం, కార్వాన్, గోషా మహల్, ధూల్ పేట, చార్మినార్, శాలిబండ, చార్మినార్, సుధా టాకీస్, గౌలి పురా, ఉప్పుగూడ, సంతోష్ నగర్, మాదన్న పేట తదితర ప్రాంతాల్లో ఎక్కువగా గణేష్ మండపాలున్నా.. ఎక్కడా మాధవీ లతా ఎక్కడా కనపడలేదు. ప్రస్తుతం ఎలాంటి ఎలక్షన్స్ లేనందున అనవసరంగా గణేష్ మండపాలు తిరిగినా.. లాభం లేదనుకుందా.. ! హై కమాండ్ ఆదేశాలతో దూరంగా ఉందా అనేది తెలియాల్సి ఉంది.

మరోవైపు వినాయక్ సాగర్ (ట్యాంక్ బండ్) లో నిమజ్జనంపై పోలీసులు ఆంక్షలు పెట్టినా మాధవీలత స్పందించలేదు. ఎమ్మెల్యే రాజాసింగ్ వంటి నేతలు వెంటనే రియాక్ట్ అయినా.. మాధవీలత మాట్లాడకపోవడం చర్చనీయాంశంగా మారింది. మాధవీలత దూకుడుకు హైకమాండ్ బ్రేకులు వేసిందనే టాక్ వస్తోంది. పార్టీ పెద్దల ఆదేశాలతోనే మాధవీలత సైలెంట్ అయ్యారనే ప్రచారం రాజకీయ వర్గాలతో పాటు  బీజేపీ సర్కిళ్లలోనూ సాగుతోంది.

ఇదీ చదవండి: ‘భోళా శంకర్’సహా చిరు కెరీర్ లో రాడ్ రంబోలా మూవీస్ ఇవే..

ఇదీ చదవండి:  పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లెజ్నెవా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తెలుసా..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News