BJP MLA Alleti Maheshwar Reddy Comments On Komatireddy Venkatreddy: తెలంగాణలో రాజకీయాలు ఒక రేంజ్ లో హీట్ ను పుట్టిస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణలో ఒకవైపు ఎమ్మెల్సీ కవిత అరెస్టు, మరోవైపు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మరోవైపు బీఆర్ఎస్ కు సొంతపార్టీ నేతలు వరుసగా షాక్ ల మీద షాక్ లు ఇస్తున్నారు. పదేళ్లపాటు, అధికారం,హోదా అనుభవించి తీరా ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆపార్టీలోకి క్యూకడుతున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి వంద రోజులు కాంగ్రెస్ పాలన తర్వాత, నిజమైన కాంగ్రెస్ పొలిటిషయన్స్ గా పావులు కదుపుతానంటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ గేట్లు ఎత్తితే బీఆర్ఎస్ నాయకులు వరదగా వచ్చి చేరుతారన్నారు. ఆయన అన్నవిధంగానే.. బీఆర్ఎస్ కు షాకుల మీద షాకులిస్తు.. ఎంపీలు, ఎమ్మెల్యేలు, మేయర్ లు, కార్పోరేటర్ లు అందరు కాంగ్రెస్ కండువ కప్పుకుంటున్నారు.
Read More: Mongoose Vs Snake: వామ్మో.. ముంగీస, పాము ఫైటింగ్.. వీడియో చూస్తే గుండెలు జారీపోతాయ్..
తాజాగా, బీఆర్ఎస్ సీనియర్ నేతలు.. కడియం శ్రీహారి, కే కేశవరావులు సైతం కాంగ్రెస్ పార్టీలోకి చేరడం ప్రస్తుతం పెను సంచలనంగా మారింది.ఈ క్రమంలోనే కాంగ్రెస్ సీనియర్ నేత.. కోమటిరెడ్డి మాట్లాడుతూ.. తమపార్టీలోకి రావడానికి బీజేపీ ఎమ్మెల్యేలు ఆసక్తి చూపిస్తున్నారని, 8 మంది రెడీ గాఉన్నారంటూ వ్యాఖ్యలు చేశారు. దీనిపైకౌంటర్ గా బీజేపీ ఎమ్మెల్యే మాస్ వార్నింగ్ ఇచ్చారు. బీజేపీ ఎమ్మెల్యేలను టచ్ చేసే ధైర్యం చేయోద్దని కాంగ్రెస్ నేతలకు వార్నింగ్ ఇచ్చారు.
తాము తల్చుకుంటే 48 గంటల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వంను కూలగొడతామంటూ వ్యాఖ్యలు చేశారు. కోమటి రెడ్డికి, ఆయన తమ్ముడు టచ్ లో లేరంట.తమ్ముడి భార్యకు ఎంపీ టికెట్ రాకుండా... కోమటి రెడ్డిఅడ్డుకున్నాడంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఎమ్మెల్యేదు దేశం కోసం, ధర్మం కోసం ఉన్నవాళ్లని అన్నారు. తాము ప్రజల ఎన్నుకున్న ప్రభుత్వంను గౌరవిస్తున్నాం.. అందుకే హుందాగా ఉన్నామని ఎమ్మెల్యే ఏలేటీ మహేశ్వర్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు.
ఇక మరోవైపు బీజేపీ నేత..ఈటల రాజేందర్ కూడా ఈ వ్యాఖ్యలను ఖండించారు. తెలంగాణలో ప్రస్తుతం త్రిముఖ పోటీ నడుస్తుందని చెప్పుకొవచ్చు. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నువ్వా.. నేనా.. అన్న రీతిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఇక రాజకీయ పార్టీల నేతల డైలాగ్ వార్ మాత్రం.. సమ్మర్ లో మరింత హీట్ ను పుట్టిస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook