సీఎం, మంత్రులపై బీజేపి ఎంపీ ఘాటు వ్యాఖ్యలు

సీఎం, మంత్రులపై బీజేపి ఎంపీ ఘాటు వ్యాఖ్యలు

Updated: Oct 31, 2019, 11:50 AM IST
సీఎం, మంత్రులపై బీజేపి ఎంపీ ఘాటు వ్యాఖ్యలు

కరీంనగర్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుతో పాటు రాష్ట్ర కేబినెట్ మంత్రులపై ఎంపీ బండి సంజయ్ పలు ఘాటు వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె, ఉద్యమాల వల్లే ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడటమే కాకుండా కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారని అన్నారు. ఆర్టీసీ కార్మికుల చావులు కేసీఆర్ చేసిన హత్యలేనని సంజయ్ ఆరోపించారు. 

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌పై ఘాటైన పదజాలంతో విరుచుకుపడిన ఎంపీ సంజయ్.. కేసీఆర్ ఓ రాక్షసుడని.. మానవత్వం లేని మృగమని మండిపడ్డారు. అదే సమయంలో రాష్ట్ర మంత్రులను సైతం టార్గెట్ చేసుకున్న ఎంపీ సంజయ్.. వారిని బ్రోకర్లు.. జోకర్లు అని సంభోదించారు.