అక్బరుద్దీన్ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ కేసీఆర్ వ్యూహాన్ని బయటపెట్టిన చంద్రబాబు

కోదాడ సభలో అక్బరుద్దీన్ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ టీఆర్ఎస్ - బీజేపీకి లింక్ పెడుతూ చంద్రబాబు విమర్శలు సంధించారు

Last Updated : Dec 5, 2018, 02:49 PM IST
అక్బరుద్దీన్ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ కేసీఆర్ వ్యూహాన్ని బయటపెట్టిన చంద్రబాబు

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు కోదాడ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ బీజేపీతో కేసీఆర్ సంబంధాలు నెరపుతున్నారని విమర్శించారు. అవసరాన్ని బట్టి ఆయన బీజేపీతో కలుస్తారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా అక్బరుద్దీన్ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ... కేసీఆర్ మిత్రపక్షమైన ఎంఐఎం పార్టీ నేత అక్బరుద్దీన్ నిన్న చెప్పారు...తాము  కేసీఆర్ తో క్లోజ్ గా లేకపోతే వాళ్లు బీజేపీతో కలిసి వెళ్లిపోతారని ..అందుకే తాము కేసీఆర్ కు బీజేపీతో దోస్తీ చేస్తున్నామని ని  అక్బరుద్దీన్ చెప్పారు..కాబట్టి కేసీఆర్ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు హెచ్చరించారు.

దేశంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే మహాకూటమి పార్టీ అభ్యర్ధులను గెలిచించాలని ఈ సందర్భంగా చంద్రబాబు కోరారు. ప్రజలకు మంచి జరగాలంటే రాష్ట్రంలో కేసీఆర్ ను ..దేశంలో మోడీని ఓడించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా చంద్రబాబు వెల్లడించారు. కాగా కోదాడలో జరుగున్నబహిరంగ సభలో ఏఐసీసీ చీఫ్ రాహుల్ గాంధీతో పాటు టి పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, టీజేఎస్ చీఫ్ కోదండరాం తదితరులు పాల్గొన్నారు.
 

Trending News