KCR Jharkhand tour: మాది బీజేపీ, కాంగ్రెస్​ల వ్యతిరేక కూటమి కాదు: కేసీఆర్​

KCR Jharkhand tour: దేశ రాజకీయాల్లో ప్రత్యామ్నాయ కూటమికోసం కేసీఆర్​ ప్రయత్నాల్లో మరో ముందడుకు వేశారు. తాజాగా ఝార్ఖండ్​ సీఎంతో కేసీఆర్​ భేటీ అయ్యారు.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 4, 2022, 09:17 PM IST
  • ఝార్ఖండ్​లో సీఎం కేసీఆర్​ టూర్​
  • ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో భేటీ
  • దేశ రాజకీయాల్లో ప్రత్యామ్నాయంపై చర్చ
KCR Jharkhand tour: మాది బీజేపీ, కాంగ్రెస్​ల వ్యతిరేక కూటమి కాదు: కేసీఆర్​

KCR Jharkhand tour: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్​ దేశ జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయం కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇటీవలే మహారాష్ట్ర ముఖ్య మంత్రిని కలిసి చర్చలు జరిపిన కేసీఆర్​ తాజాగా.. ఝార్ఖండ్​కు వెళ్లారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి  హేమంత్ సోరెన్​తో భేటీ అయ్యారు. ముఖ్య మంత్రి అధికారిక నివాసంలోనే కేసీఆర్​ హేమంత్ సోరెన్​ల మధ్య సమావేశం జరిగింది.

చర్చల తర్వాత మీడియాతో మాట్లాడారు ఇద్దరు సీఎంలు. ఈ సందర్భంగా మెరుగైన భవిష్యత్​ కోసం మొదటి అడుగు పడిందని కేసీఆర్​ వ్యాఖ్యానించారు. ఒకే విధమైన భావాజాలం ఉన్న శక్తులను ఒక్క చోటకు చేర్చేప్రయత్నాలు ప్రారంభమయ్యాయని చెప్పారు.

తమది బీజేపీ వ్యతిరేక, కాంగ్రెస్ వ్యతిరేక కూటమో లేకా థార్ట్​ ఫ్రంటో కాదని వెల్లడించారు కేసీఆర్​. దేశ ప్రజలందరికీ మేలు చేసే ఆలోచన మాత్రమేనని స్పష్టం చేశారు.

దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు దాటినప్పటికీ.. ఇంకా సంపూర్ణంగా అభివృద్ధి చెందలేదన్నారు కేసీఆర్​. దేశంలో ప్రతీ పౌరుడిపై దీనిని సరిదిద్ధాల్సిన అవసరముందని పేర్రకొన్నారు. దేశాన్ని కొత దిశగా, కొత్త మార్కంలో తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని వివరించారు. ఆ దిశగా తాము చర్చలు జరుపుతున్నట్లు చెప్పుకొచ్చారు.

Also read: Emotional Video: భర్త సమాధి వద్ద మహిళ పెళ్లిరోజు వేడుక.. కంటతడి పెట్టిస్తున్న వీడియో!

Also read: TS Inter Exams Schedule: తెలంగాణలో ఇంటర్ పరీక్షల రీషెడ్యూల్.. కొత్త తేదీలు ఇవే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News