Konda Surekha: కొండా సురేఖపై గుర్రుగా ఉన్న కాంగ్రెస్ హైకమాండ్.. కేబినెట్ నుంచి అవుట్..?..

Konda Surekha controversy: అక్కినేని కుటుంబంపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయంగా పెనుదుమారంగా మారాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికి కూడా ఈవివాదంపై ట్విట్ల వార్ నడుస్తోందని చెప్పుకొవచ్చు.

Written by - Inamdar Paresh | Last Updated : Oct 5, 2024, 06:49 PM IST
  • ఇంకా చల్లారని కొండా సురేఖ వివాదం..
  • సీరియస్ అయిన కాంగ్రెస్ అధిష్టానం..
Konda Surekha: కొండా సురేఖపై గుర్రుగా ఉన్న కాంగ్రెస్ హైకమాండ్.. కేబినెట్ నుంచి అవుట్..?..

Congress high command serious on Konda Surekha: కాంగ్రెస్ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం పెనుదుమారంగా మారాయని చెప్పుకొవచ్చు. అక్కినేని నాగార్జున ఫ్యామిలీ గురించి మంత్రి చేసిన వ్యాఖ్యల్ని టాలీవుడ్  ఏకతాటిపైకి వచ్చి మరీ ఖండించినట్లు తెలుస్తోంది. నాగార్జున, అమల, నాగచైతన్యలు, సమంతా, అఖిల్ తమ కుటుంబంపై చేసిన వ్యాఖ్యల్ని ఎక్స్ వేదికగా ఖండించారు. అదే విధంగా..  చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, నాని, వెంకటేష్, చిన్న, పెద్దాఅని తేడాలేకుండా.. సినిమా ఇండస్ట్రీ అంతా కలసి ఈ విషయంలో నాగార్జునకు సపోర్టుగా, మంత్రి కొండాసురేఖకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టారు.

ఒక మంత్రి హోదాలో ఉండి, అది కూడా.. సాటి మహిళ పట్ల ఇంత నీచంగా ఎలా మాట్లాడుతారని కూడా సినిమా లోకం భగ్గుమంది. దీనిపై కేంద్ర రైల్వే మంత్రి అశ్వని వైష్ణవ్ సైతం స్పందించారు. ఈ నేపథ్యంలో కొండా సురేఖ మరల ఎక్స్ వేదికంగా సమంతాకు సారీ చెప్పారు. కానీ నాగార్జున మాత్రం... దీనిపై నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా వేశారు. కొండా సురేఖపై కఠిన చర్యలు తీసుకొవాలంటూ కూడా పిటిషన్ ను దాఖలు చేశారు. మరోవైపు ఈ ఘటన వల్ల తెలంగాణ కాంగ్రెస్ లో రాజకీయంగా కూడా దుమారంగా మారిందని చెప్పుకొవచ్చు.

మంత్రి కోండా సురేఖ, కేటీఆర్ ను విమర్శించే క్రమంలో.. నాగార్జున కుటుంబాన్ని మధ్యలో తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. గతంలో కేటీఆర్ నాగార్జున ఎన్ కన్వెన్షన్ ను కూల్చేయకూడదంటే.. కేటీఆర్ తన దగ్గరకు సమంతాకు పంపమన్నారని కొండా సురేఖ వ్యాఖ్యలు చేశారు. దానికి ఒప్పుకొక పోవడంతోనే.. సమంతా డైవర్స్ ఇచ్చిందని కూడా బాంబు పేల్చారు. కేటీఆర్ కు డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉందని,అతని వల్లనే చాలా మంది హీరోయిన్ లు, రకుల్ ప్రీత్ సింగ్ లాంటి వాళ్లు తొందరగా పెళ్లిళ్లు చేసుకున్నారని కూడా అన్నారు. దీంతో ఈ వివాదం పీక్స్ కు వెళ్లింది.

దీనిపై ఒక వైపు సినిమా రంగం నుంచి మరోవైపు రాజకీయ రంగం నుంచి వ్యతిరేకత రావడంతో కొండా సురేఖ సమంతాకు సారీ చెప్పారు. ఈ ఘటన కాస్త ప్రస్తుతం కాంగ్రెస్ హైకమాండ్ వరకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఎంపీ రాహుల్ గాంధీ.. సైతం దీనిపై కొండా సురేఖకు వివరణ కోరినట్లుగా తెలుస్తోంది. మరోవైపు అక్కినేని అమలకు, ప్రియాంకగాంధీకి సన్నిహిత సంబంధాలు ఉన్న నేపథ్యంలో... అమల జరిగిన విషయాన్ని ప్రియాంకతో చెప్పినట్లుగా సమాచారం.

Read more: RGV :కొండా సురేఖకు మరిచిపోలేని గుణపాఠం నేర్పాలి.. ? ఆర్జీవి సంచలన కామెంట్స్..

ఇదిలా ఉండగా.. దీనిపై కాంగ్రెస్ హైకమాండ్ సైతం సీరియస్ గా ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది.  తెలంగాణలో మంత్రి వర్గ విస్తరణ కూడా ఉన్న నేపథ్యంలో.. మంత్రి కొండా సురేఖను ఉద్వాసన పలుకుతారని కూడా ప్రచారం జరుగుతుంది. ఈ ఘటన దేశ వ్యాప్తంగా వార్తలలో నిలవడంతో.. డామేజ్ కంట్రోల్ కోసం.. కాంగ్రెస్ అధిష్టానం మాత్రం సీరియస్ గా దీనిపై చర్యలు తీసుకొవచ్చని కూడా జోరుగా ప్రచారం జరుగుతుంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News