cv anand took charge as hyderabad cp: తెలంగాణలో రేవంత్ రెడ్డిముఖ్యమంత్రి పగ్గాలు తీసుకున్నప్పటి నుంచి పాలనలో తనదైన మార్కు చూపిస్తున్నారు. గత ప్రభుత్వ హాయాంలో అక్రమాలకు పాల్పడిన అధికారులకు చుక్కలు చూపిస్తున్నారు. ప్రజలకు మెరుగైన పాలన అందించడంతో అధికారుల పాత్ర కూడా కీలకంగా ఉంటుంది. ఈ క్రమంలో రేవంత్ గతంలో అనేక ఏళ్లపాటు.. ఒకే చోట ఉన్న వారికి స్థాన భ్రంశం కల్పించారు. ఎప్పటికప్పుడు.. డైనమిక్ అధికారులను కీలకమైన శాఖలకు కేటాయిస్తున్నారు.
హైదరాబాద్ సీపీగా భాద్యతలు స్వీకరించిన సీవీ ఆనంద్
హైదరాబాద్ కమిషనర్‌గా రెండోసారి బాధ్యతలు స్వీకరించిన అనంతరం సీవీ ఆనంద్ వ్యాఖ్యలు
వినాయకచవితి, మిలాద్ ఉన్ నబీ ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూస్తా. రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్‌పై సీరియస్‌గా ఉంది. డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు కృషి చేస్తా. https://t.co/uWgpfTxJqL pic.twitter.com/JKA8Onqlkj
— Telugu Scribe (@TeluguScribe) September 9, 2024
ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల హైదరాబాద్ కమిషనర్ గా సీపీ ఆనంద్ కు మరోసారి నియమించారు. ఈ నేపథ్యంలో.. కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి స్థానంలో.. సీవీ ఆనంద్ కు సీఎం రేవంత్ బాధ్యతలు అప్పగించారు. ఈ క్రమంలో ఈరోజు (సోమవారం) సీవీ ఆనంద్ హైదరబాద్ కోత్వాల్ గా బాధ్యతలు స్వీకరించారు. సీవీ ఆనంద్.. ప్రస్తుతం వినాయక నిమజ్జనం, అలాగే మిల్ దున్ నబీ పండగల నేపథ్యంలో అనేక ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్‌లో లా అండ్ ఆర్డర్‌ను మరింత మెరుగుపరుస్తామని సీవీ ఆనంద్ అన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ఒక భాగం అని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. ప్రజలతో ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉంటుందని.. తప్పులు చేసినవారి పాలిట మాత్రం.. స్ట్రాంగ్ పోలీసింగ్ ఉంటుందని కూడకా సీపీ సీవీ ఆనంద్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
ప్రస్తుతం భాగ్యనగరంలో.. వినాయక నిమజ్జనం చాలా కీలకమైన అంశం అని, నిమజ్జన ఘట్టం ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. నిమజ్జనం ఫైనల్స్ ఎగ్జామ్ లాంటి వని అన్నారు. అలాగే.. మిలాదున్ నబీ ఫెస్టివల్ కూడా జాగ్రత్తగా నిర్వహించుకునేలా చూస్తామన్నారు. ఈ నేపథ్యంలో.. ఫోటో ట్యాపింగ్ వ్యహారంపై కూడా అధికారులతో కలిసి సమీక్ష నిర్వహిస్తామన్నారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారినట్లు కన్పిస్తుందని,దీనిపై వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు.
అలాగే.. కొన్నిరోజులుగా హైదరాబాద్ లో క్రైమ్ రేటు బాగా పెరిగిపోయిందని బహిరంగంగానే.. హత్యలు, అత్యాచారాలుచోటు చేసుకున్న ఘటనలు వెలుగులోకి వచ్చాయన్నారు. ముఖ్యంగా.. లా అండ్ ఆర్డర్‌పై కఠినంగా వ్యవహరిస్తామని సీపీ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు. అదే విధంగా తనకు సీపీగా మరోసారి బాధ్యతలు అప్పగించినందుకుకూడా సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.