Kumar Ammiresh Death: విషాదం.. శిల్ప కళా వేదికలో గాయపడిన డీఎస్పీ ర్యాంక్ అధికారి మృతి

DSP Rank Officer Kumar Ammiresh Death: శిల్ప కళా వేదికలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పాల్గొనబోయే ఓ కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించేందుకు వెళ్లిన డీఎస్పీ ర్యాంక్ అధికారి ఒకరు ప్రమాదవశాత్తు మృతి చెందారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : May 18, 2022, 11:00 PM IST
  • హైదరాబాద్ శిల్ప కళా వేదికలో గాయపడిన డీఎస్పీ ర్యాంక్ అధికారి కుమార్ అమ్మిరేశ్
  • గుంతలో పడటంతో అమ్మిరేశ్ తలకు తీవ్ర గాయాలు
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన కుమార్ అమ్మిరేశ్
Kumar Ammiresh Death: విషాదం.. శిల్ప కళా వేదికలో గాయపడిన డీఎస్పీ ర్యాంక్ అధికారి మృతి

DSP Rank Officer Kumar Ammiresh Death: హైదరాబాద్‌లోని మాదాపూర్‌ శిల్పా కళా వేదికలో ప్రమాదవశాత్తు జరిగిన ఓ ఘటనలో డీఎస్పీ ర్యాంక్ అధికారి కుమార్ అమ్మిరేశ్ మృతి చెందారు. దివంగత తెలుగు సినీ కవి సిరివెన్నెల సీతారామ శాస్త్రి పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం (మే 19) శిల్ప కళా వేదికలో జరగనుంది. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పాల్గొననుండటంతో... అక్కడి ఏర్పాట్లపై కుమార్ అమ్మిరేశ్ నివేదిక సమర్పించాల్సి ఉంది. ఇందుకోసం శిల్పా కళా వేదికకు వెళ్లిన కుమార్ అమ్మిరేశ్.. లోపల స్టేజీపై నిలుచుని ఆ హాల్‌ను ఫోటోలు తీశారు. 

ఈ క్రమంలో అమ్మిరేశ్ ప్రమాదవశాత్తు స్టేజీ సమీపంలోని గుంతలో పడిపోయాడు. దీంతో అమ్మిరేశ్‌కు తీవ్ర గాయాలవగా.. ఆయన్ను మెడికర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అమ్మిరేశ్ బుధవారం (మే 18) కన్నుమూశారు. అమ్మిరేశ్ మృతిపై పలువురు ఉన్నతాధికారులు సంతాపం ప్రకటించినట్లు తెలుస్తోంది. అమ్మిరేశ్ ప్రస్తుతం ఇంటెలిజెన్స్ బ్యూరోలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. బీహార్‌లోని పాట్నాకు చెందిన అమ్మిరేశ్ ప్రస్తుతం జూబ్లీహిల్స్‌లోని ఐబీ క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అమ్మిరేశ్ మృతిపై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

Also Read: Samantha Ruth Prabhu: సమంత ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్... త్వరలో సామ్ నుంచి బిగ్ అనౌన్స్‌మెంట్...

Also Read : Venus Transit 2022: మేష రాశిలోకి శుక్రుడు... ఎవరికి శుభం, ఎవరికి అశుభం.. ఏయే రాశులపై దాని ప్రభావం ఎలా ఉంటుందంటే..   

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News