Telangana Schools Holiday on July 24:తెలంగాణలో జూలై 24న పాఠశాలలు, కళాశాలలు ఉంటాయా లేదా అనే అంశంపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌కు పలు విద్యార్థి సంఘాలు పిలుపునివ్వడంతో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. అయితే ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి అన్ని పాఠశాలలకు వర్తించేలా అధికారికంగా సెలవు ప్రకటించిన సమాచారం లేదు.
Telangana Panchayat: తెలంగాణలోని 12,760 గ్రామ పంచాయతీల ఆర్థిక బలోపేతమే లక్ష్యంగా.. ప్రభుత్వం చారిత్రాత్మక ఆర్డినెన్స్‌ను తీసుకురాబోతోంది. ప్రత్యేకమైన నినాదంతో గ్రామాల్లో వసూలయ్యే ఇంటి పన్ను, నల్లా పన్ను వంటి నిధులను ప్రభుత్వ ట్రెజరీలలో జమ చేయకుండా.. స్థానికంగానే తక్షణ అవసరాలకు వాడుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది.
New Ration Cards Telangana Latest News: అర్హులైన పేదలకు అందరికీ 48 గంటల్లోనే కొత్త రేషన్ కార్డులు అందిస్తామని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన ప్రకటన చేశారు. నాంపల్లి, చాంద్రాయణగుట్ట లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ ప్రకటన చేశారు.
Telangana Schools Bandh: జూన్ 23న తెలంగాణలో స్కూల్స్ బంద్‌కు సంబంధించిన వార్తలు చర్చనీయాంశంగా మారాయి. పాఠశాలలకు సెలవు ప్రకటించారా? ఏ జిల్లాల్లో స్కూళ్లు మూసివేయనున్నారు? విద్యార్థులు, తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
Allu Arjun Stampede Case News: 2024 డిసెంబరు 4న 'పుష్ప 2' సినిమా ప్రీమియర్ షో సమయంలో జరిగిన తొక్కిసలాట కేసులో తాజాగా హీరో అల్లు అర్జున్‌కు కోర్టు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈరోజు (జూన్ 22) కోర్టుకు హాజరవుతారా లేదా అన్నది సినీ, రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది. హైదరాబాద్‌లోని నాంపల్లి క్రిమినల్ కోర్టు ఈ కేసులో అల్లు అర్జున్‌తో పాటు ఇతరులకు వ్యక్తిగతంగా హాజరుకావాలని సమన్లు జారీ చేసింది. వర్చువల్ (ఆన్లైన్) హాజరుకు కోర్టు నిరాకరించడంతో ఆయన నేరుగా వస్తారా, లేక క్వాష్ పిటిషన్ దాఖలు చేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.
Allu Arjun Stampede Case News: హైదరాబాదులోని సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించిన ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. రాబోయే సోమవారం నాడు కోర్టు ముందు వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని న్యాయస్థానం ఆయనను ఆదేశించింది.ఈ ఘోర ప్రమాదానికి సంబంధించి చిక్కడపల్లి పోలీసులు ఇప్పటికే 23 మందిని నిందితులుగా చేర్చుతూ కోర్టులో ఛార్జ్‌షీటు దాఖలు చేశారు. వీరిలో 19 మంది నిందితులకు నాంపల్లి కోర్టు తాజాగా సమన్లు జారీ చేసింది.
Tgsrtc Free Bus Travel: నీట్ (NEET) పరీక్ష రాసే విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం అద్బుతమైన శుభవార్తను అందించింది. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఉచితంగా టీజీఎస్ఆర్టీసీకి సంబంధించిన బస్సులు ప్రయాణించవచ్చని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
Rythu Bima Scheme Telangana: రాష్ట్ర ప్రభుత్వం LICకి రైతు బీమా పథకం కింద చెల్లించాల్సిన 400 కోట్లకు పైగా ప్రీమియం బకాయాలను చెల్లించకపోవడంతో.. సంస్థ క్లైమ్లను తాత్కాలికంగా ఆపేసినట్లు తెలుస్తోంది. దీని కారణంగా అకాలంగా మరణించిన రైతులకు అందాల్సిన ఐదు లక్షలు అందలేకపోతున్నాయని రైతుల కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి..
Advocate Sharath: అడ్వకేట్ శరత్ తెలంగాణ రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా బీఆర్ఎస్ రాజకీయ వ్యూహాలు, పార్టీ భవిష్యత్ పరిస్థితులపై తన అభిప్రాయాలను వెల్లడించారు. రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలను ప్రస్తావిస్తూ పలు కీలక అంశాలపై స్పందించారు. ఆయన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీస్తుండగా, బీఆర్ఎస్ శ్రేణుల్లో కూడా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
Ponnam Prabhakar fires on Pawan kalyan press meet: పవన్ కల్యాణ్ ఒక పెయిడ్ ఆర్టిస్ట్ అని, ఆయననుఎవరో వెనుకుండి నడిపిస్తున్నారని, కానీ స్క్రిప్ట్ మాత్రం సరిగ్గా ఇవ్వడంలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతే కాకుండా.. తెలంగాణపై పవన్ కళ్యాణ్ మరోసారి తన అక్కసును వెళ్లగక్కారంటూ మండిపడ్డారు.
Telangana Latest News: రాష్ట్రంలో దాన్యం కొనుగోలు చుట్టూ.. బిజెపితో పాటు కాంగ్రెస్ రాజకీయాలు చేస్తున్నాయి. అయితే, కొనుగోల చుట్టూ సాగుతున్న రాజకీయ రగడ సామాన్య రైతులకు పెద్ద శాపంగా మారుతూ వస్తోంది. ఆదుకోవాల్సిన అధికారులే.. ఇలా రైతులపై రాజకీయాలు చేయడం సరికాదని వారంటున్నారు..
CM Revanth: ఉద్యోగుల హెల్త్ స్కీమ్‌పై తెలంగాణలో మరోసారి అసంతృప్తి వ్యక్తమవుతోంది. హెల్త్ కార్డులు అందించకుండానే ఉద్యోగుల వేతనాల నుంచి డబ్బులు కట్ చేస్తున్నారంటూ పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశం ఇప్పుడు రేవంత్ దృష్టికి వెళ్లింది. హెల్త్ స్కీమ్ అమలు, కార్డుల జారీపై స్పష్టత ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ఈ వ్యవహారం ప్రస్తుతం తెలంగాణ ఉద్యోగుల్లో చర్చనీయాంశంగా మారింది.
Ponguleti Srinivas Reddy: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జీహెచ్ఎంసీ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక ప్రకటన చేశారు. పట్టణ పేదలకు జీవనోపాధికి ఇబ్బంది లేకుండా వారు నివసిస్తున్న ప్రాంతాల పరిధిలోనే ఆధునిక ఇళ్లు నిర్మించి అందిస్తామని స్పష్టం చేశారు. తొలివిడతగా లక్ష ఇళ్లకు త్వరలోనే శంకుస్థాపన జరగనుందని, వాటిని ఏడాదిలోపు పూర్తి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. అనంతరం మరో లక్ష ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఈ ప్రకటనతో హైదరాబాద్ నగరంలోని అర్హులైన పేద కుటుంబాల్లో ఆశలు పెరిగాయి.
Cm Revanth Reddy Big Boost To Gram Panchayats: గ్రామపంచాయతీలకు ఏం రేవంత్ రెడ్డి ఒక అద్భుతమైన శుభవార్తను తీసుకువచ్చారు. సొంత నిధులు నేరుగా గ్రామపంచాయతీలకు సంబంధించిన బ్యాంకు ఖాతాల్లోకి జమ అయ్యేవిధంగా పంచాయతీరాజ్ శాఖలో ఉన్న వివిధ చట్టాలను సవరించబోతున్నట్లు తెలుస్తోంది.. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..
Karimnagar Liquor News: తాజాగా కేశవపట్నంలోని ఓ మందు బాబుకు వింత అనుభవం ఎదురయింది.. అయితే సదరు వ్యక్తి కింగ్ ఫిషర్ బీర్ కొనుగోలు చేయగా.. అతనికి వేరే బ్రాండ్ సీసపై కింగ్ ఫిషర్ బీర్ స్టిక్కర్ వేసి విక్రయించారు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది..
తెలంగాణ CM రేవంత్ రెడ్డి సీఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలకు క్లాస్ పీకినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని పలువురు ఎమ్మెల్యేల తీరుపై ఆయన మండిపడినట్లు తెలుస్తోంది. సభకు వచ్చే ముందు అన్నింటికీ ముందుగా సిద్ధమై రావాలని ఆయన సూచించారు.
Telangana IAS Officers Transfers :మున్సిపల్ ఎన్నికల రోజే రాష్ట్రంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణలో భారీగా ఐఏఎస్ ల బదిలీ జరిగింది. ప్రధానంగా పరిపాలన విభాగంలో ఈ కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. పది మంది ఐఏఎస్ అధికారులు బదిలీ చేస్తూ బుధవారం ఉదయం ఉత్తర్వులు కూడా జారీ చేశారు. సింగరేణి క్యాలరీస్ కంపెనీ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ను కూడా మార్పు చేశారు. ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం.
Women Business Opportunity: మహిళలు ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా.. తమ గ్రామంలోనే స్థిరమైన ఆదాయం పొందేలా రూపొందించిన ఒక బలమైన బిజినెస్ మోడల్‌గా తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఇందిరా డెయిరీ ప్రాజెక్టు నిలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మహిళల ఆర్థిక స్వావలంబన లక్ష్యంగా రూపొందిన ఈ పథకం.. మహిళా సంఘాల సభ్యులకు ఒక పూర్తి స్థాయి వ్యాపార అవకాశాన్ని అందిస్తోంది. ఇది కేవలం సబ్సిడీ పథకం మాత్రమే కాదు… సరిగ్గా అమలు చేస్తే దీర్ఘకాలిక లాభాలు ఇచ్చే డెయిరీ బిజినెస్ ఐడియాగా మారనుంది.
kalvakuntla kavitha on hyderabad development : హైదరాబాద్ లో కల్వకుంట్ల కవిత జనంబాట నేపథ్యంలొ గత కొన్నిరోజులుగా పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు హైదరాబాద్ గుండెకాయ వంటిదన్నారు.
Harish Rao Slams To Revanth Reddy: విద్యార్థులకు సక్రమంగా భోజనం పెట్టడం రాదు కానీ మెస్సీతో ఫుట్‌బాల్ కోసం రూ.వందల కోట్లు వెచ్చించడానికి డబ్బులు ఎక్కడివి? అని రేవంత్ రెడ్డిని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. కలుషిత ఆహారం తిని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పరామర్శించారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన కేకే సర్వే.. ఇప్పుడు తెలంగాణ జూబ్లీహిల్స్ ఉపఎన్నిక రిజల్ట్ గురించి సర్వే వెల్లడించారు. జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్ మరోసారి వస్తుందా? అధికార పార్టీ కాంగ్రెస్ గెలుస్తుందో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూసేయండి.
Annadata Sukhibhava PM Kisan Status: ఏపీలో అన్నదాత సుఖీభవ స్కీమ్ ప్రారంభం, ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన, నేడు బంగారం ధరలు ఎలా ఉన్నాయి..? ఆంధ్రప్రదేశ్, తెలంగాణతోపాటు ఇతర లేటెస్ట్ తెలుగు న్యూస్ లైవ్ అప్డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.