ఈటల రాజేందర్‌కు అస్వస్థత.. పాదయాత్ర చేపట్టనున్న జమున ?

Etela Rajender health condition: హైదరాబాద్: హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో ప్రజా దీవెన యాత్ర చేస్తోన్న మాజీ మంత్రి ఈటల రాజేందర్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం వీణవంక మండలంలో ప్రజాదీవెన యాత్ర చేస్తున్న సమయంలోనే ఈటల రాజేందర్ స్వల్ప అనారోగ్యం బారినపడ్డారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 31, 2021, 08:33 AM IST

Trending Photos

ఈటల రాజేందర్‌కు అస్వస్థత.. పాదయాత్ర చేపట్టనున్న జమున ?

Etela Rajender health condition: హైదరాబాద్: హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో ప్రజా దీవెన యాత్ర చేస్తోన్న మాజీ మంత్రి ఈటల రాజేందర్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం వీణవంక మండలంలో ప్రజాదీవెన యాత్ర చేస్తున్న సమయంలోనే ఈటల రాజేందర్ స్వల్ప అనారోగ్యం బారినపడ్డారు. ఈటల రాజేందర్‌కు వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు.. ఆయనకు ఆక్సిజన్‌, బీపీ స్థాయిలు పడిపోయినట్లు తెలిపారు. దీంతో మెరుగైన చికిత్స కోసం వెంటనే ఈటల రాజేందర్‌ను హైదరాబాద్ తరలించినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.

Also read : దళిత బంధు పథకంపై హై కోర్టులో పిల్ దాఖలు

ప్రస్తుతం ఈటల ఆరోగ్యం నిలకడగానే ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈటల రాజేందర్‌కి అస్వస్థతకు గురైన నేపథ్యంలో ప్రజా దీవెన యాత్ర (Praja deevena yatra) పేరిట ఆయన చేపట్టిన పాదయాత్ర వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, అదే సమయంలో ఈటల రాజేందర్‌ (Etela Rajender) కోలుకునే వరకు ఈటల స్థానంలో ఆయన సతీమణి జమున (Etela Rajender's wife Jamuna) పాదయాత్ర నిర్వహించే అవకాశాలు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.

Also read : పెద్దిరెడ్డికి టీఆర్ఎస్ కండువా కప్పిన కేసీఆర్.. టీఆర్ఎస్‌లో చేరిన పెద్ది రెడ్డి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

More Stories

Trending News