Anti Modi Flexi: హైదరాబాద్ లో కలకలం.. ప్రధాని మోడీకి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు

Anti Modi Flexi:  భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జూలై2న హైదరాబాద్ వస్తున్నారు.ప్రధాని మోడీ హైదరాబాద్ వస్తున్న సమయంలో నగరంలో ఆయనకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు వెలిశాయి. ఇదే ఇప్పుడు కలకలం రేపుతోంది.

Written by - Srisailam | Last Updated : Jun 29, 2022, 11:31 AM IST
  • టీఆర్ఎస్, బీజేపీ మధ్య ముదిరిన వార్
  • ప్రధాని మోడీకి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు
  • సికింద్రాబాద్ లో రాత్రికి రాత్రే ఫ్లెక్సీలు
Anti Modi Flexi: హైదరాబాద్ లో కలకలం.. ప్రధాని మోడీకి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు

Anti Modi Flexi:  భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జూలై2న హైదరాబాద్ వస్తున్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం మోడీ వస్తున్నారు. జూలై 2,3 తేదీల్లో మాదాపూర్ లో హెచ్ఐసీసీలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. సమావేశాల సందర్భంగా రెండు రోజులు హైదరాబాద్ లోనే ఉండనున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. అయితే ప్రధాని మోడీ హైదరాబాద్ వస్తున్న సమయంలో నగరంలో ఆయనకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు వెలిశాయి. ఇదే ఇప్పుడు కలకలం రేపుతోంది. బీజేపీ జాతీయ సమావేశాల్లో భాగంగా జూలై3న సాయంత్రం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. దాదాపు 10 లక్షల మందిని సమీకిరంచడానికి తెలంగాణ కమలనాథులు ప్రయత్నిస్తున్నారు. మోడీకి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు కూడా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ చుట్టే దర్శనమిస్తున్నాయి. సాలు మోడీ సంపకు మోడీ అని దానిపై రాసి ఉంది. రాత్రికి రాత్రే ఈ ఫ్లెక్సీలు పెట్టారని తెలుస్తోంది. ఎవరు వేశారో తెలియకుండా ప్రధాని మోడీకి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు కట్టడం తీవ్ర కలకలం రేపుతోంది. 

తెలంగాణలో కొన్ని రోజులుగా అధికార టీఆర్ఎస్, బీజేపీ మధ్య యుద్దం సాగుతోంది. నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇరు పార్టీల నేతలు, కార్యకర్తల మధ్య సోషల్ వార్ కూడా ఓ రేంజ్ లో  నడుస్తోంది. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హైదరాబాద్ వేదిక కావడంతో వార్ మరింత ముదిరింది. బీజేపీ కార్యాలయం దగ్గర ఏర్పాటు చేసిన డిజిటల్ బోర్డు వివాదం కాక రాజేస్తోంది.  సీఎం కేసీఆర్ పతనం మొదలైందంటూ "సాలు దొర.. సెలవు దొర" పేరుతో నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం దగ్గర డిజిటల్ బోర్డు ఏర్పాటు చేశారు. అదే పేరుతో వెబ్ సైట్ కూడా ప్రారంభించారు. డిజిటల్ బోర్డు ఏర్పాటుపై గులాబీ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. మోడీకి వ్యతిరేకంగా తాము కూడా బోర్డులు పెడతామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ దగ్గర ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు కట్టడం చర్చగా మారింది. ఫ్లెక్సీ ఏర్పాటు చేసింది ఎవరో ఇంకా తెలియనప్పటికి.. ఇదే టీఆర్ఎస్ నేతల పనేనని తెలంగాణ బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.

మరోవైపు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం నగరమంతా బీజేపీ కటౌట్లు, భారీ హోర్డింగులు, బ్యానర్లు కడుతోంది. అదే సమయంలో బీజేపీకి ధీటుగా  హైదరాబాద్ ను గులాబీమయం చేస్తోంది టీఆర్ఎస్. హైదరాబాద్ లోని మూడు మార్గాల్లో ఉన్న మెట్రో పిల్లర్లను తెలంగాణ సర్కార్ బుక్ చేసుకుంది. వాటిపై ప్రభుత్వ పథకాలకు సంబంధించిన బోర్డులు పెట్టేసింది. మెట్రో పిల్లర్లే కాదు బస్ షెల్టర్లను ప్రకటనలతో ముంచేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం.  

Read ALSO: TS Inter Results 2022: ఇతర సబ్జెక్టుల్లో టాప్ మార్కులు.. ఒక సబ్జెక్టులో జీరో! షాకవుతున్న విద్యార్థులు..

Read ALSO: Hemachandra Sravana Bhargavi Divorce: ఎట్టకేలకు నోరు విప్పిన హేమచంద్ర-శ్రావణ భార్గవి 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News