Ganesha idols makers: గణపతినే నమ్ముకున్నాం.. ఇలా అవుతుందనుకోలేదు

వినాయక చవితి ( Vinayaka Chavithi ) పండగ వస్తుందంటే చాలు వివిధ రూపాల్లో ఉన్న వినాయకుడి విగ్రహాలను కొనుక్కుని వెళ్లి అందంగా అలంకరించిన మండపంలో ఆ గణపయ్యను ప్రతిష్టించి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించి తరించడం గణేష్ భక్తులకు ఆనవాయితీగా వస్తోంది.

Last Updated : Aug 22, 2020, 10:45 PM IST
Ganesha idols makers: గణపతినే నమ్ముకున్నాం.. ఇలా అవుతుందనుకోలేదు

వినాయక చవితి ( Vinayaka Chavithi ) పండగ వస్తుందంటే చాలు వివిధ రూపాల్లో ఉన్న వినాయకుడి విగ్రహాలను కొనుక్కుని వెళ్లి అందంగా అలంకరించిన మండపంలో ఆ గణపయ్యను ప్రతిష్టించి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించి తరించడం గణేష్ భక్తులకు ఆనవాయితీగా వస్తోంది. కానీ కరోనావైరస్ ( Coronavirus ) వ్యాప్తి నేపథ్యంలో ఈసారి వినాయక చవితి అందుకు భిన్నంగా తయారైంది అని వాపోతున్నారు విగ్రహాల తయారీదారులు ( Ganesha idol makers ). ఎంతో శ్రమకోర్చి గణేష్ విగ్రహాలు తయారు చేస్తే.. వాటిని కొనేవారు కరువయ్యారని విగ్రహాల తయారీదారులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. Also read : జైజై గణేశా: వినాయకుడి పూజలో Celebrities

గణేష్ చతుర్థి వచ్చిందంటే హైదరాబాద్ నగరం నలువైపులా ఉన్న శివార్లలోని ప్రధాన రహదారులకు ఇరువైపులా అందమైన గణపతి విగ్రహాలు అమ్మకానికి సిద్ధంగా ఉంటాయి. అలాగే విగ్రహాలు కొనేందుకు వచ్చే వారితో రహదారులన్నీ కిక్కిరిసిపోయి ఉంటాయి. కానీ ఈసారి పరిస్థితి అలా లేదని.. లాభాల సంగతి దేవుడెరుగు.. పెట్టిన పెట్టుబడి తిరిగి వస్తే అంతే చాలని విగ్రహాలను తయారు చేసి అమ్ముకుంటున్న కళాకారులు చెబుతున్నారు. Also read : Ganesh Photos: కరోనాను ఖతం చేసే కరోనా వినాయకుడు

గణేష్ విగ్రహాలను తయారు చేసిన వారి నుంచి భారీ సంఖ్యలో విగ్రహాలను కొనుగోలు చేసి అమ్ముకునే ( Ganesha idol sellers ) వారి పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. వినాయక చవితిరోజు వరకు ఎన్ని విగ్రహాలు అమ్ముడు పోతే... అంతే వారి అమ్మకాలు. ఆ తర్వాత విగ్రహాలను ప్రతిష్టించే వారు ఉండరు కనుక విగ్రహాల అమ్మకాలు కూడా ఉండవు. దీంతో ఈసారి తమకు నష్టాలు తప్పేలా లేవని తయారీదారులు, అమ్మకందారులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. Also read : Ganesh Chaturthi: వ్యక్తిగత నిమజ్జనాలకు ఓకే..ఊరేగింపులకు నో

 Also read : Sanitizer Ganesha idols: గణేష్ విగ్రహాలు కొంటున్నారా ? ఈ శానిటైజర్ గణేషాను చూడండి

Trending News