Hyderabad Drug Case Update: హైదరాబాద్‌ పుడింగ్ పబ్‌ కేసులో నిందితుల కస్టడీ.. 17 వరకు విచారణ!

Hyderabad Drug Case Update: హైదరాబాద్‌ పుడింగ్ పబ్‌ కేసులో విచారణను పోలీసులు వేగవంతం చేశారు. ఈకేసుకు ఈ కేసుకు సంబంధించిన నిందితులను కస్టడీలోకి తీసుకోనున్నారు పోలీసులు. అయితే వారిని చంచల్‌గూడ జైలు నుంచి కస్టడీలోకి తీసుకుంటారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 14, 2022, 04:14 PM IST
  • హైదరాబాద్‌ పుడింగ్ పబ్‌ కేసు
  • నిందితులను కస్టడీలోకి తీసుకోనున్న పోలీసులు
  • కీలక విషయాలను రాబట్టనున్న పోలీసులు
Hyderabad Drug Case Update: హైదరాబాద్‌ పుడింగ్ పబ్‌ కేసులో నిందితుల కస్టడీ.. 17 వరకు విచారణ!

Hyderabad Drug Case Update: గత కొన్ని రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన హైదరాబాద్‌ పుడింగ్ పబ్‌ కేసులో విచారణను పోలీసులు వేగవంతం చేశారు. ఈకేసుకు ఈ కేసుకు సంబంధించిన నిందితులను కస్టడీలోకి తీసుకోనున్నారు పోలీసులు. అయితే వారిని చంచల్‌గూడ జైలు నుంచి కస్టడీలోకి తీసుకుంటారు. పోలీసులు వారిని నేటి నుంచి ఈనెల 17 వరకు విచారించనున్నారు. డ్రగ్స్‌ కేసులో కీలక విషయాలను, డ్రగ్స్‌ సరఫరాపై అంశాలను నిందితుల నుంచి రాబట్టనున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితులుగా అనిల్, అభిషేక్‌లు ఉన్నారు. పబ్‌లోకి డ్రగ్స్‌ తీసుకురావడంతో ఎన్డీపీఎస్‌ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రన్తుతం తెలంగాణలో ఈ కేసుపై పలు రాజకీయ పార్టీలు కూడా స్పందించాయి.

ఇప్పటికే ఈ కేసులో పలు ఆధారాలను పోలీసులు సేకరించారు. నిందితుల మొబైల్‌ ఫోన్లను పరిశీలిస్తున్నారు. వాట్సాప్‌ చాటింగ్‌లో కేసు సంబంధించిన విషయాలున్నాయ అన్న దానిపై ఆరా తీస్తున్నారు. ఇద్దరి ఫోన్లో పలువురు డ్రగ్స్ వినియోగదారుల నెంబర్లు ఉన్నట్లు గుర్తించారు. గోవా, ముంబై నుంచి కొకైన్ తీసుకొచ్చి పబ్‌లో విక్రయిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.  ఇంకా ఎవరికైనా డ్రగ్స్‌ను విక్రయించారా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల కస్టడీలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. 

ఇటీవల నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న పబ్‌పై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. ఈక్రమంలో పలువురు ప్రముఖుల పిల్లలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పబ్‌లో డ్రగ్స్‌ వినియోగం జరిగినట్లు గుర్తించారు. ఈ ఘటన తెలుగురాష్ట్రాల్లో సంచలనంగా మారింది. పోలీసులకు పట్టుబడ్డ వారిలో మెగా కుటుంబానికి చెందిన నిహారిక, సింగర్ రాహుల్‌తోపాటు పలువురు ఉన్నారు. వీరికి నోటీసులు ఇచ్చి పంపించారు.

Also Read: Fastest ODI Fifty: ఏడో స్థానంలో బ్యాటింగ్‌.. వన్డేల్లో ఫాస్టెస్ట్‌ హాఫ్ సెంచరీ! స్కాట్లాండ్‌ బ్యాటర్ రికార్డు

Also Read: Rahu Ketu: మేష రాశిలోకి రాహు కేతు.. ఆ రాశులపై తీవ్ర ప్రభావం... ఇలా చేస్తే గండం గట్టెక్కవచ్చు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News