Rahu Ketu Effects: అశుభానికి సంకేతంగా భావించే రాహు, కేతువులు ఏప్రిల్ 12న రాశులు మారారు. దాదాపు 18 నెలల తర్వాత రాహు, కేతు సంచారంలో మార్పు చోటు చేసుకుంది. రాహువు మేష రాశిలోకి ప్రవేశించాడు. దీని ప్రభావం కొన్ని రాశులపై పడనుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వచ్చే ఏడాదిన్నర కాలం మేషం, మీనం, మకరం, ధనుస్సు, తులారాశి వారు చాలా జాగ్రత్తగా నడవాల్సిన సమయం. వారి జాతకంలో రాహువు స్థానం బాగా లేనందునా.. ఈ సమయంలో వారు చాలా జాగ్రత్తగా ఉండాలి.
రాహువు ప్రభావం :
రాహువు ప్రభావంతో దురదృష్టం, అశుభం వెంటాడుతుంది. చెడు పనులకు ఇది కారణమవుతుంది. ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయి. రాహువు ప్రభావంతో కాలేయ, కిడ్నీ ఆరోగ్య సమస్యలు రావొచ్చు. అలాగే అలెర్జీ, ఇన్ఫెక్షన్, మెదడు వ్యాధి, మలబద్ధకం, అతిసారం, మశూచి, కుష్టు వ్యాధి, క్యాన్సర్, గుండె జబ్బులు, చర్మ వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంది. ఎముకల బలహీనత, కీళ్లనొప్పులు, ఎముకలు విరగడం... ఇవన్నీ రాహువు ప్రభావం వల్లేనని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.
ఇవిగాక, ఆ వ్యక్తిపై కూడా రాహువు ప్రభావం చూపిస్తుంది. చిన్న చిన్న విషయాలకే కోపం తెచ్చుకోవడం, కటువుగా మాట్లాడటం చేస్తారు. మానసిక ఒత్తిడికి లోనవడం, అపార్థాలతో సన్నిహితులతో విభేదాలు కొని తెచ్చుకోవడం జరుగుతుంది. విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో నష్టాలు, కష్టాలు ఎదురవుతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం ఆందోళన కలిగించవచ్చు.
రాహువు ప్రభావం తొలగాలంటే:
రాహువు ప్రభావం తొలగాలంటే శాంతి పూజ చేయాలి. ఇది గొప్ప ఉపశమనం కలిగిస్తుంది. ఇందుకోసం ప్రతీ అమావాస్య రోజు 5 ఎండు కొబ్బరికాయలను కాలువలో వేయాలి. ఇది కాకుండా భగవతి, కాలభైరవ పూజలు చేస్తే మంచిది. 'ఓం భ్రం భృన్ భ్రోన్ స: రహ్వే నమః' అనే మంత్రాన్ని జపిస్తే మంచి ప్రయోజనం కలుగుతుంది. ప్రతి శనివారం నల్లని దుస్తులు ధరిస్తే మంచి జరుగుతుంది.
Also Read: Also Read: Krithi Shetty: చందమామలా మెరిసిపోతున్న కృతి శెట్టి.. బేబమ్మ అందాలకు కుర్రాళ్లు ఫిదా!
Also Read: Renault April Offers: కొత్త కారు కొనుగోలు చేయాలనుకుంటున్నారా... రెనాల్ట్‌లో భారీ ఆఫర్స్...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook