India Monsoon Reaches Kerala: నైరుతి రుతుపవనాలు ఎంట్రీ.. వాతావరణ సూచనలు ఇలా..!

Telangana Weather Updates: నైరుతి రుతు పవనాలు కేరళ తీరాన్ని గురువారం తాకాయి. దీంతో దేశంలో వర్షాలు సీజన్ మొదలైంది. రానున్న మూడు రోజులు తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. 

Last Updated : Jun 8, 2023, 02:10 PM IST
India Monsoon Reaches Kerala: నైరుతి రుతుపవనాలు ఎంట్రీ.. వాతావరణ సూచనలు ఇలా..!

Telangana Weather Updates: ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాలు దేశంలో ఎంట్రీ ఇచ్చాయి. గురువారం కేరళ తీరాన్ని తాకాయి. గతేడాది కంటే ఈ సంవత్సరం ఏడు రోజులు ఆలస్యంగా తీరాన్ని తాకినట్లు ఐఎండీ అధికారులు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో  రానున్న మూడు రోజులు అక్కడక్కడ వర్షాలు కురవనున్నాయి. బుధవారం  ఉత్తర చత్తీస్‌గడ్  నుంచి  తెలంగాణ మీదుగా ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక వరకు ఉన్న ద్రోణి గురువారం బలహీన పడింది. దిగువ స్థాయిలోని గాలులు ముఖ్యంగా వాయువ్య, పశ్చిమ దిశల నుంచి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయి.

నైరుతి రుతుపవనాలు ఈ రోజు కేరళలో ప్రవేశించడంతో రాగల 48 గంటల్లో కేరళ అంతటా.. తమిళనాడు, కర్ణాటకలోని కొన్ని భాగాలకు ప్రవేశించే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు, రేపు  అక్కడక్కడ, ఎల్లుండి  కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు  వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. 

Also Read: Ind vs Aus WTC Final Highlights: ఫైనల్ టెస్ట్‌లో ఆసీస్ జోరు.. తొలి రోజు రోహిత్ శర్మ చేసిన మూడు తప్పులు ఇవే..!

ఈ రోజు, రేపు తెలంగాణ రాష్ట్రంలో ఉరుములు , మెరుపులు, ఈదురు గాలులుతో (గాలి  గంటకు 30 నుండి 40 కి మీ వేగం) కూడిన వర్షాలు  అక్కడక్కడ వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఎల్లుండి ఉరుములు, మెరుపులుతో కూడిన వర్షాలు  అక్కడక్కడ వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ రోజు, రేపు రాష్ట్రంలో  వడగాలులు అక్కడక్కడ వీచే అవకాశం ఉందన్నారు. ఖమ్మం, నల్గొండ, సూర్యపేట , కొత్తగూడెం, ఆదిలాబాద్, కొమరం భీం, మంచిర్యాల్, నిర్మల్ జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. 

Also Read: RBI Repo Rates 2023: గుడ్‌న్యూస్ చెప్పిన ఆర్‌బీఐ.. రెపో రేటుపై కీలక ప్రకటన  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News