Telangana Rains On Sankranti: సంక్రాంతి పండుగ వేళ తెలంగాణలో వర్షం కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‍నగర్‌లో దాదాపుగా 65 రోజుల తర్వాత వానజల్లు కురిసినట్లు పేర్కొన్నారు. అయితే పండుగ రోజున హైదరాబాద్‌లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని తెలుస్తోంది.
Telangana Corp Loss: మొంథా తుపాను కారణంగా తెలంగాణలో లక్షా 17 వేల 757 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖ నివేదికను సమర్పించింది. తుఫాన్ కారణంగా నష్టం వాటిల్లిన జిల్లాలలో పర్యటించిన వ్యవసాయశాఖ అధికారుల బృందం, దెబ్బతిన్న పంటల వివరాలను, సర్వే చేసి నివేదికను సిద్ధం చేసినట్లు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
Telangana Rains: తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో వాతావరణ శాఖ 10 జిల్లాలకు అలర్ట్ ప్రకటించింది. ఇప్పటికే ఉమ్మడి వరంగల్, ఖమ్మం, హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ పలు సూచనలు చేసింది.
Telangana Rains: తెలంగాణలో మళ్లీ వానలు దంచి కొడుతున్నాయి.మొంథా తుపాను శాంతించి అనుకునేలోపు బంగాళాఖాతంలో మరో అల్ప పీడనంతో మళ్లీ వర్షాలు పడుతున్నాయి. తాజాగా నవంబర్ వంటి అన్ సీజన్ లో వర్షాలు రైతులకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. అంతేకాదు వరంగల్ సహా పలు ప్రాంతాల్లో కురుస్తోన్న వర్షాలతో కాపుకు వచ్చిన పంటలు తడిసి ముద్దవుతున్నాయి.
Imd Rains fall alert for Telangana: రానున్న మూడు రోజుల పాటు తెలికపాటి నుంచి మోస్తరుగా వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరికల్ని జారీ చేసింది. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తండా ఉండాలని పలు సూచలను చేసింది.
Telugu States Rain Updates: మొంథా తుపాను సృష్టించిన విధ్వంసం నుంచి రైతులు ఇంకా కోలుకోకముందే, వాతావరణ శాఖ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. మళ్లీ బంగాళాఖాతంలో మరో అల్ప పీడనం ఏర్పడబోతుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
Telangana Floods:వరంగల్ లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. ముంపు ప్రాంతాలను పరిశీలించారు. వరదలో మునిగిపోయిన సమ్మయ్య నగర్, నయీం నగర్ ను పరిశీలించి బాధితులతో మాట్లాడారు.
Telangana Paddy Loss: మొంథా తుపాను బాధితులకు తెలంగాణ ప్రభుత్వం అండగా వుండనుంది. ఈ క్రమంలోనే ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఉదయం వరంగల్, హుస్నాబాద్ వరద ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేపట్టనున్నారు. గురువారమే వెళ్లేందుకు ఆయన సిద్ధపడగా.. వాతావరణం అనుకూలించకపోవటంతో హెలికాప్టర్ ప్రయాణం వీలు కాదని పేర్కొంటూ ఏరియల్ సర్వేకు అధికారులు అనుమతించలేదు. దీంతో ఇవాళ ఏరియల్ సర్వే నిర్వహించి నష్టాన్ని స్వయంగా పరిశీలిస్తారు.
గత మూడు రోజులుగా ఏపీతో పాటు తెలంగాణను అతలాకుతలం మొంథా తుపాను బలహీన పడింది. దీంతో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. తీరం దాటిన తర్వాత బలహీనపడిన మొంథా తుఫాన్, ప్రస్తుతం తూర్పు విదర్భ, దక్షిణ చత్తీస్ ఘడ్ ప్రాంతాలపై వాయుగుండంగా కేంద్రీక్రుతమై ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ వాయుగుండం ప్రభావంతో వర్షపాతం తీవ్రత గణనీయంగా తగ్గిపోయింది. వాయుగుండం తూర్పు విదర్భ, దక్షిణ చత్తీస్ ఘడ్ ప్రాంతాల వైపు కదులుతోంది.
Montha Cyclone Live Updates: ఉరుము వచ్చి మంగళం మీద పడ్డట్టు మొంథా తుపానుతో ఆంధ్ర ప్రదేశ్ మొత్తంగా ఆగమాగం అయింది. మరోవైపు మొంథా తుపాను దిశ మార్చుకొని తెలంగాణపై విరుచుపడుతుంది. దీంతో ఏపీతో పాటు.. వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి.
Cyclone montha Effect on Warangal: వరంగల్ నగరం అంతా కుండపోత వానకు అతలాకుతలం అయిపోయింది. రహదారులన్ని జలమయం అయిపోయాయి. ఎక్కడ చూసిన కాలనీలు చెరువుల్ని తలపిస్తున్నాయి. దీంతో భారీగా వదరనీరు చేరడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
Montha Cyclone Effect On Telangana : తెలంగాణపై మొంథా తుపాను దిశ మార్చుకుని విరుచుకుపడింది. దీని ప్రభావంతో తెలంగాణలో మరో రెండు రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
Cyclone Montha Effect on Telangana: మొంథా తుఫాన్ ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆరు జిల్లాలకు అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ముందస్తు జాగ్రత్తగా రేపు పలు జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. తెలంగాణ వెదర్ లైవ్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Red alert for Warangal and hanamkonda: వరంగల్, హన్మకొండలలో భారీగా వర్షం కురుస్తుంది. ఈ క్రమంలో కలెక్టర్ మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్ ను జారీ చేశారు. ప్రజలు బైటకు రావొద్దని తెలిపారు. రోడ్లంతా జలమయం అయిపోయాయి.
Telananga Rains Due To Montha Cyclone Effct 2025: ఆంధ్ర ప్రదేశ్ (Andhra Pradesh) వణికిస్తున్న 'మొంథా' తుఫాను ఇప్పుడు తన పూర్తి ప్రభావాన్ని తెలంగాణపై చూపిస్తోంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి.
Telangana Toofan Effect: మొంథా తుపాను ఎఫెక్ట్ తో తెలంగాణలోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం హెచ్చరించింది. దీంతో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది.
Telugu States Rain Alert Live: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడన ప్రభావంతో ఏపీతో పాటు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అల్ప పీడన ప్రభావంతో ఏపీకి మంతా తుపాను దూసుకువస్తోంది. ఈ యేడాది అత్యంత బలమైన తుపానుగా మారబోతుందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో నాలుగు రోజులు పాటు ఏపీలో భీకరమైన వర్షాలు కురిసే అవకాశం ఉంది.అటు తెలంగాణను వర్షాలు ముంచెత్తనున్నాయి.
Heavy Rains Lashed At Yadadri Lakshmi Narasimha Swamy Temple: యాదాద్రిలో భారీ వర్షం కురిసింది. వర్షం కారణంగా లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు తడిసి ముద్దయ్యారు.. కొండపై భారీ వర్షం కురవడంతో భక్తులు ఇబ్బందులకు గురయ్యారు. అయితే కొండపై వర్షం పడితే తలదాచుకునే కూడా ఎలాంటి సౌకర్యాలు లేకుండా పోయాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.