Will KCR Be in More Trouble: కేసీఆర్‌కి అమిత్ షా ఉచ్చు బిగిస్తున్నారా ? హైదరాబాద్ ఇన్‌కమ్ ట్యాక్స్ DGIT మార్పు అందుకేనా ?

KCR in More Trouble: తెలంగాణ సీఎం కేసీఆర్‌కి కేంద్రం చిన్నచిన్నగా ఉచ్చు బిగిస్తోందా అంటే అవుననే టాక్ బలంగా వినిపిస్తోంది. అందుకు కారణం ఇటీవల తెలంగాణలో చోటుచేసుకుంటున్న వరుస పరిణామాలే అని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. హైదరాబాద్‌లో ఇన్‌కమ్ ట్యాక్స్ దర్యాప్తు విభాగం డీజీగా కొత్త ఆఫీసర్ వస్తున్నారా ? ఈ మొత్తం కథా కమా మిషు తెలియాలంటే ఇదిగో ఈ డేటీల్డ్ స్టోరీ తెలుసుకోవాల్సిందే.

Written by - Pavan | Last Updated : Sep 20, 2022, 02:49 AM IST
  • ఐఆర్ఎస్ వసుంధరా సిన్హా మరెవరో కాదు..
  • సంజయ్ బహదూర్‌ని కేంద్రం హైదరాబాద్‌కి ఎందుకు పంపిస్తున్నట్టు ?
  • ఇన్‌కమ్ టాక్స్ అధికారులతో అమిత్ షా మీటింగ్ ఇదేనా ?
  • అభిషేక్ రావు, రామచంద్ర పిళ్లై, వెన్నమనేని శ్రీనివాస్ రావు.... హూ ఈజ్ నెక్ట్స్ ?
  • ముప్పేట దాడికి రంగం సిద్ధమైందా ?
Will KCR Be in More Trouble: కేసీఆర్‌కి అమిత్ షా ఉచ్చు బిగిస్తున్నారా ? హైదరాబాద్ ఇన్‌కమ్ ట్యాక్స్ DGIT మార్పు అందుకేనా ?

Sanjay Bahadur, Vasundhara Sinha's transfers in News : తెలంగాణ సీఎం కేసీఆర్‌కి కేంద్రం చిన్నచిన్నగా ఉచ్చు బిగిస్తోందా అంటే అవుననే టాక్ బలంగా వినిపిస్తోంది. అందుకు కారణం ఇటీవల తెలంగాణలో చోటుచేసుకుంటున్న వరుస పరిణామాలే అని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. తాజాగా హైదరాబాద్‌కి ఇన్‌కమ్ ట్యాక్ ఇన్వెస్టిగేషన్ వింగ్ డీజీగా ఉన్న వసుంధర సిన్హాను ఇక్కడి నుంచి ట్రాన్స్‌ఫర్ చేసిన కేంద్రం.. ఆమె స్థానంలో ప్రస్తుతం ముంబైలో ఇన్‌కమ్ ట్యాక్స్ విభాగంలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న సంజయ్ బహదూర్‌ని హైదరాబాద్‌లో ఇన్‌కమ్ ట్యాక్ దర్యాప్తు విభాగం డీజీగా బదిలీ చేసినట్టు తెలుస్తోంది. దీంతో ఇన్‌కమ్ ట్యాక్స్ విభాగం తీసుకున్న ఈ నిర్ణయం ప్రస్తుతం రాజకీయ వర్గాలు, బ్యూరోక్రాట్లలో ఆసక్తికరమైన చర్చకు తెరతీసినట్టయింది. 

ఐఆర్ఎస్ వసుంధరా సిన్హా మరెవరో కాదు.. 
వసుంధర సిన్హా గతేడాది జులైలోనే హైదరాబాద్‌లో ఇన్‌కమ్ ట్యాక్స్ దర్యాప్తు విభాగం డీజీగా ఛార్జ్ తీసుకున్నారు. అంతకు ముందు ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌లో అనేక కీలక బాధ్యతలు నిర్వర్తించిన వసుంధర సిన్హా హైదరాబాద్‌లో చార్జ్ తీసుకుని ఇటీవలే ఏడాది పూర్తి చేసుకున్నారు. వసుంధర సిన్హా నిర్వర్తించిన కీలకమైన విధుల్లో ఇన్‌కమ్ ట్యాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్‌లో అప్పీలేట్ అధారిటీ కూడా ఒకటి. కార్పొరేట్, నాన్-కార్పొరేట్ సెక్టార్లపై ఆమెకు మంచి పట్టుంది. 1988 బ్యాచ్‌కి చెందిన ఇండియన్ రెవిన్యూ సర్వీస్ ఆఫీసర్ వసుంధర సిన్హా గురించి ఇంకా చెప్పాలంటే.. ఆమె మరెవరో కాదు.. ప్రస్తుతం తెలంగాణ ఏసీబీ డైరెక్టర్ జనరల్‌గా కొనసాగుతున్న హైదరాబాద్ మాజీ పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ సతీమణి కావడం మరో ఆసక్తికరమైన అంశం. 

అంజనీ కుమార్ హైదరాబాద్ పోలీసు కమిషనర్‌గా ఉన్న సమయంలోనే వసుంధర సిన్హా హైదరాబాద్‌లో ఇన్‌కమ్ ట్యాక్స్ ఇన్వెస్టిగేషన్ డీజీగా వచ్చారు. వీళ్లిద్దరి ప్రస్తుత హోదాలను పోల్చి చూసుకున్నా... అవినీతిని వెలికి తీసే రెండు కీలకమైన పదవుల్లో.. అంటే తెలంగాణ ఏసీబీ డైరెక్టర్ జనరల్‌గా అంజని కుమార్, ఆదాయ పన్నుతో ముడిపడిన అంశాల్లో అవినీతికి పాల్పడిన వారిని బయటికి లాగే పోస్టులో వసుంధర సిన్హా బాధ్యతలు నిర్వర్తిస్తుండటం గమనార్హం.

IPS-Anjani-kumar-family-photo-ips-anjani-kumar-wife-irs-vasundhara-sinha-photos.jpg

ఏ దర్యాప్తు కోసం సంజయ్ బహదూర్‌ని కేంద్రం హైదరాబాద్‌కి పంపిస్తున్నట్టు ? 
ఇక ఇదిలా ఉంటే.. ఆదాయపన్ను శాఖలో కీలక బాధ్యతలు నిర్వర్తించి హైదరాబాద్ వచ్చిన వసుంధర సిన్హాను.. ఏడాది కాలంలోనే మరో చోటికి బదిలీ చేసి.. ఆమె స్థానంలో ముంబై నుండి సంజయ్ బహదూర్ అనే మరో పవర్‌ఫుల్ ఆఫీసర్‌ను గ్రౌండ్‌లోకి దింపుతున్నట్టు తెలుస్తోంది. అకస్మాత్తుగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడానికి వెనుకున్న కారణం ఏంటి ? వసుంధర సిన్హా వల్ల కాని పని ఏదైనా సంజయ్ బహదూర్ చేత చేయించడానికే ఆయన్ను రంగంలోకి దింపుతున్నారా ? ఇప్పటికే ఇటీవల హైదరాబాద్‌లో ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులు కొన్ని వ్యాపార సంస్థలపై ఆకస్మిక దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ఐటి దాడుల్లో ఫీనిక్స్, వాసవి రియల్ ఎస్టేట్ సంస్థ పేర్లు ప్రముఖంగా బయటికొచ్చాయి. ఐటి అధికారులు ఇంకా సోదాలు జరపాల్సిన సంస్థల జాబితా ఇంకా చాలానే ఉందని.. అందులో సాఫ్ట్‌వేర్ కంపెనీల ఏర్పాటు పేరుతో జరిగిన రియల్ ఎస్టేట్ దోపిడి, ఇతర సూట్‌కేసు కంపెనీలతో పాటు తెలంగాణ సర్కారు వద్ద వివిధ విభాగాల్లో భారీ ప్రాజెక్టులు పొందిన కాంట్రాక్ట్, ఇంజనీరింగ్ సంస్థలు కూడా ఉన్నాయనే టాక్ బలంగా వినిపించింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుత ఇన్‌కమ్ ట్యాక్స్ డీజీ స్థానంలో మరొకరు వస్తున్నారనే వార్త భారీ ప్రాధాన్యతను సంతరించుకుంది. అన్నట్టు సంజయ్ బహదూర్ ఇండియన్ రెవిన్యూ సర్వీస్ ఆఫీసర్ మాత్రమే కాదు.. నలుగురు మెచ్చిన రయిచత కూడా. అస్సాంకి చెందిన సంజయ్ బహదూర్‌కి ఇన్‌కమ్ టాక్స్ పాలసీల రూపకల్పనపై మంచి పట్టుంది.

Sanjay-Bahadur-to-replace-Vasundhara-Sinha-as-Hyderabad-DGIT-investigation.jpg

ఇన్‌కమ్ టాక్స్ అధికారులతో అమిత్ షా మీటింగ్ ఇదేనా ?
ఇటీవల.. సెప్టెంబర్ 17న జరిగిన తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన అమిత్ షా.. ఇదే పర్యటనలో భాగంగా సిటీలోని నేషనల్ పోలీస్ అకాడమిని సందర్శించిన సంగతి తెలిసిందే. నేషనల్ పోలీసు అకాడమిలో అక్కడి అధికారులతో భేటీ అయిన అనంతరం.. అక్కడే ఇన్‌కమ్ టాక్స్ అధికారులతో భేటీ అయినట్టుగా వార్తలొచ్చాయి. కాకపోతే ఈ భేటీని ధృవీకరిస్తూ నేషనల్ పోలీసు అకాడమి నుంచి కానీ లేదా ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ నుంచి కానీ ఎలాంటి ప్రకటన రాలేదు. ఈ క్రమంలోనే కీలకమైన హోదాల్లో ఉన్న అధికారుల బదిలీ జరగడాన్ని బట్టి చూస్తే.. ఐటి అధికారులతో అమిత్ షా మీటింగ్‌కి, ఈ ట్రాన్స్‌ఫర్లకు ఏమైనా సంబంధం ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అభిషేక్ రావు, రామచంద్ర పిళ్లై, వెన్నమనేని శ్రీనివాస్ రావు.... తర్వాత ఆమేనా ? 
ఇప్పటికే ఓవైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుతో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కుమార్తె, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సంబంధం ఉన్నట్టుగా పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ కేసులో రామచంద్ర పిళ్లై, అభిషేక్ రావు పేర్లు ప్రముఖంగా వినిపిస్తుండగా.. ఆ ఇద్దరితో కలిసే కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో పాల్పంచుకున్నారనేదే ప్రస్తుతం ఆమెపై వినిపిస్తున్న ప్రధానమైన ఆరోపణ. ఇది నిరాధారమైన ఆరోపణ మాత్రమే కానీ ఇందులో వాస్తవం లేదని కవిత ఖండిస్తున్నప్పటికీ.. ఇటీవల అభిషేక్ రావు డైరెక్టర్‌గా ఉన్న అనూస్ బ్యూటీ క్లినిక్ హెడ్ క్వార్టర్స్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోదాలు నిర్వహించడంతో కవిత పేరు మరోసారి వార్తల్లోకెక్కింది. అభిషేక్ రావుకి చెందిన రాబిన్ డిస్టిలరీస్ సంస్థ అడ్రస్ కూడా మాదాపూర్‌లోని ఇదే అనూస్ హెడ్ క్వార్టర్స్ పేరిట ఉండటం ఈ దాడులకు మరో కారణమైంది. 

ఆదివారం రామచంద్ర పిళ్లైని విచారించిన ఈడి అధికారులు, సోమవారం వెన్నమనేని శ్రీనివాస్ రావుకి సంబంధించిన వ్యాపార సంస్థల కార్యాలయాలు, నివాసాల్లో సోదాలు నిర్వహించారు. ఈ వెన్నమనేని శ్రీనివాస్ రావుకు టీఆర్ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్ రావు, బోయినపల్లి అభిషేక్ రావు, కల్వకుంట్ల కవిత, కేటీఆర్‌లతో సత్సంబంధాలు కలిగి ఉన్నట్టు ఓ ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే వెన్నమనేని శ్రీనివాస్ రావు, జోగినపల్లి సంతోష్ కుమార్ కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తీగ లాగితే డొంక కదిలిన చందంగా.. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఎవ్వరిని కదిలించినా.. ఆ దారులన్నీ మళ్లీ కల్వకుంట్ల కుటుంబం వైపే వస్తుండటం గమనార్హం. మొదట అభిషేక్ రావు, రామచంద్ర పిళ్లై, తర్వాత వెన్నమనేని శ్రీనివాస్ రావులు ఈడీ రాడార్‌లోకి రాగా... వీరిలో ఎవ్వరు పెదవి విప్పినా.. ఈడి అధికారుల తర్వాతి అడుగులు కల్వకుంట్ల కవిత, సంతోష్ రావు వంటి ప్రముఖుల ఇల్లు, కార్యాలయాలవైపే అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. 

ముప్పేట దాడికి రంగం సిద్ధమైందా ?
తెలంగాణలో అసలైన ఆట ఇప్పుడే మొదలైందా ? ఓవైపు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు దాడులు (ED Raids in Hyderabad) జరుపుతుండగా.. మరోవైపు ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులు సైతం తనిఖీల్లో వేగం పెంచనున్నారా ? తాము ఈడీ అధికారులకే ఏం సమాధానం చెప్పాలా అని వెతుక్కునే లోగా మరోవైపు నుండి ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులు ఆకస్మిక దాడులతో విరుచుకుపడనున్నారా ? కేంద్రం టార్గెట్‌ని పక్కాగా గురిపెట్టినట్టేనా ? తెలంగాణలో ముప్పేట దాడికి రంగం సిద్ధమైందా ? పబ్లిక్‌లో వినిపిస్తున్న ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం రావడానికి ఇంకెంతో సమయం పట్టేలా లేదు. అప్పటివరకు లెట్స్ వెయిట్ అండ్ సీ ద గేమ్.

Also Read : Delhi Liquor Scam: లిక్కర్ స్కాంలో మరో సంచలనం.. రామచంద్రన్ ను ప్రశ్నించిన ఈడీ.. నెక్స్ట్ కవితేనా?

Also Read : Hyderabad Liberation day Live Updates : ఎంఐఎం రజాకార్ల పార్టీనే.. బీజేపీ అసలు మిత్రుడు అసదుద్దీన్ ఓవైసీనే! సీపీఐ నారాయణ హాట్ కామెంట్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News