Khammam Trs War: ఖమ్మం జిల్లా అధికార పార్టీలో ముసలం మరింత ముదిరింది.కొంత కాలంగా జిల్లాలో నేతలు ఇరువర్గాలుగా విడిపోయారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఓ వర్గంగా.. ఎంపీ నామా నాగేశ్వరరావు మరో వర్గంగా ఉన్నారు.
ఇరు వర్గాలు పోటాపోటీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఓపెన్ గానే విమర్శలు చేసుకుంటున్నారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి కూడా మంత్రితో పొసగడం లేదు. ఆయన పార్టీ మారుతారనే ప్రచారం చాలా కాలంగా సాగుతోంది. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతోను మంత్రికి సయోధ్య లేదని అంటున్నారు. తుమ్మల కూడా పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనడం లేదు. ఖమ్మం జిల్లా పార్టీలో నెలకొన్న అసమ్మతిని చల్లార్చేందుకు కేటీఆర్ ప్రయత్నాలు చేసినా ఆశించిన ఫలితం కనిపించ లేదు.
తాజాగా మరోసారి ఖమ్మం జిల్లా నేతల మధ్య వర్గ పోరు బహిర్గతమైంది. పాలేరు జలాశయంలో చేప పిల్లల విడుదల కార్యక్రమం రగడకు కారణమైంది. ఈ కార్యక్రమానికి మంత్రి పువ్వాడ అజయ్ , స్థానిక ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డితో పాటు ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యుడు రవిచంద్ర వద్దిరాజు, ఎమ్మెల్సీ తాతా మధును ఆహ్వానించారు. అయితే పాలేరు జలాశయం దగ్గర మత్స్సశాఖ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో మంత్రి, ఎమ్మెల్యే ఫోటోలు మాత్రమే వేశారు. దీంతో కార్యక్రమానికి వచ్చిన ఎంపీలు నామా నాగేశ్వరరావు, రవిచంద్ర, ఎమ్మెల్సీ తాత మధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులపై మండిపడ్డారు.
అధికారులు అధికారుల లెక్క ఉండాలని మత్స్సశాఖ జిల్లా డైరెక్టర్ ను మందలించారు ఎమ్మెల్సీ తాత మధు. ఉద్యోగం చేయండి… ఎవరికీ ఊడిగం చేయెద్దని హెచ్చరించారు. ప్రోటోకాల్ పాటించరా.. ఫ్లెక్సీలో తమ ఫోటోలు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. తమకు లేని ఫ్లెక్సీలు మిగతావాళ్ళ కెందుకు…ఎమ్మెల్యే మంత్రికే ఫెక్సీలెందుకని నిలదీశారు తాతా మధు. అలా చేయమని ప్రభుత్వం చెప్పిందా అన్నారు. కమిషనర్ తో మాట్లాడతానని హెచ్చరించారు.చేయండి కార్యక్రమం ఎలా చేస్తారో చూస్తామంటూ ఖమ్మం జిల్లా మత్స్యసహాకార అధికారి పై విరుచుక పడ్డారు ఎమ్మెల్యె తాతా మధు. చేపల విడుదల కార్యక్రమంలో పాల్గొనకుండానే వెనుదిరిగారు లీడర్లు.
Also Read: China Accident: చైనాలో మరోసారి రోడ్‌టెర్రర్..27 మంది మృతి, మరో 20 మందికి గాయాలు..!
Also Read: పెదనాన్న చనిపోయిన బాధలో ప్రభాస్.. కృతితో ప్రేమాయణమంటున్న బాలీవుడ్ మీడియా!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebok