Kishan Reddy And Bandi Sanjay Counter To CM KCR: ఫామ్‌హౌజ్ ఘటనపై సీఎం కేసీఆర్ బయటపెట్టిన వీడియోలపై బీజేపీ కౌంటర్ ఎటాక్ స్టార్ట్ చేసింది. కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కొట్టిపారేశారు. తన పార్టీ ఎమ్మెల్యేలపై కేసీఆర్‌కు నమ్మకం లేదని.. రోహిత్ రెడ్డి పెద్ద నీతిమంతుడా..? అంటూ ప్రశ్నించారు. ఆ నలుగురు ఎమ్మెల్యేల్లో ముగ్గురు ఏ పార్టీ నుంచి వచ్చారని అడిగారు. కేసీఆర్ వీడియోల్లో ఏం ఉందో తమకు అర్థకావడం లేదని.. ఆయన చెప్పినవన్నీ అబద్దాలేనని కొట్టిపారేశారు. స్వామిజీలతో ఎక్కడైనా ప్రభుత్వం కూలిపోతుందా..? అని అడిగారు.
తమకు టీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోవాలని లేదన్నారు కిషన్ రెడ్డి. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరిగి.. అందులో తమ పార్టీ విజయం సాధించాలని అన్నారు.
బ్రోకర్లను పెట్టుకునే కర్మ లేదని.. ఆ వీడియోల్లో అంతా డ్రామా ఆర్టిస్టులేనని అన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని.. అందమైన అబద్దాల వీడియోలను పెడితే ప్రజలు నమ్మేపరిస్థితి లేదన్నారు. కేటీఆర్ ముఖ్యమంత్రి కాలేడేమోనని కేసీఆర్ జిమ్మిక్కులు చేస్తున్నారని విమర్శించారు.
ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసింది టీఆర్ఎస్ నేతలేనని.. నలుగురు ఆర్టిస్టులను పెట్టి అబద్దాలు ఆడించారని మండిపడ్డారు.
కేసీఆర్ బయటపెట్టిన వీడియోలపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ట్విట్టర్‌లో కౌంటర్ ఇచ్చారు. జబర్దస్త్ కామెడీ షోతో ప్రగతి భవన్‌లో బయటపెట్టిన వీడియోలను పోల్చారు. కాపీ కొట్టేందుకు కొంచెమైనా బుద్ది ఉండాలన్నారు.
ఫామ్‌హౌజ్ డ్రామా..
యాక్టర్స్-టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
రైటర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్- కేసీఆర్
మీడియా పార్ట్‌నర్స్- పింక్ మీడియా అని బండి సంజయ్ ట్వీట్ చేశారు.
Do take a note of recently viewed videos at Pragathi Bhavan - Jabardasth Comedy Show...
Nakal karne ke liye bhi akal hona chahiye!
Farm House Drama:
Actors - TRS MLAs
Writer, Director, Producer - KCR
Media Partners - Pink Media pic.twitter.com/U4izDN7fkS— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) November 4, 2022
సీఎం కేసీఆర్ గురువారం రాత్రి బయటపెట్టిన ఫామ్‌హౌజ్ వీడియోలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. తెలంగాణతో పాటు ఏపీ, రాజస్థాన్, ఢిల్లీ ప్రభుత్వాలు కూడా కూల్చేందుకు కుట్ర జరుగుతోందని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆయా రాష్ట్రల్లో కూడా చర్చించుంటున్నారు. నిజంగా బీజేపీ ప్రభుత్వాలను కూల్చేందుకు కుట్ర చేస్తోందా..? అని ఎమ్మెల్యేల లెక్కలు వేసుకుంటున్నారు. మరోవైపు బీజేపీ అధిష్టానం రాష్ట్ర నేతలతో వీడియో గురించి ఆరా తీస్తోంది. సీఎం కేసీఆర్‌కు గట్టిగా కౌంటర్ ఇవ్వాలని రాష్ట్ర నేతలకు ఆదేశాలు జారీ చేసింది. వీడియోలన్నీ ఫేక్ అని కొట్టిపారేసింది.
Also Read: Komatireddy Venkat Reddy: కాంగ్రెస్ నుంచి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సస్పెండ్?
Also Read: TRS mlas Poaching Case: ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం.. నేడే హైకోర్టులో విచారణ.. అందరిలోనూ ఉత్కంఠ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి