TRS VS BJP: కేంద్రానికి కేటీఆర్ థాంక్స్‌.. హరీష్ రావు సెటైర్స్ .. అసలు ఏంటీ మేటర్!

TRS VS BJP: బీజేపీ, టీఆర్ఎస్ మధ్య కొంత కాలంగా ఓ రేంజ్ లో వార్ సాగుతోంది. కేంద్ర ప్రభుత్వ విధానాలపై టీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తుండగా.. కేసీఆర్ సర్కార్ పై కమలనాథులు ఫైరవుతున్నారు. తాజాగా మోడీ సర్కార్ కు థ్యాంక్స్ చెప్పారు మంత్రి కేటీఆర్.

Written by - Srisailam | Last Updated : Sep 29, 2022, 03:07 PM IST
  • మిషన్ భగీరథకు కేంద్రం అవార్డు
  • కేంద్రానికి కేటీఆర్ థ్యాంక్స్
  • నిధులు ఇవ్వాలని హరీష్ డిమాండ్
TRS VS BJP: కేంద్రానికి కేటీఆర్ థాంక్స్‌.. హరీష్ రావు సెటైర్స్ .. అసలు ఏంటీ మేటర్!

TRS VS BJP: బీజేపీ, టీఆర్ఎస్ మధ్య కొంత కాలంగా ఓ రేంజ్ లో వార్ సాగుతోంది. కేంద్ర ప్రభుత్వ విధానాలపై టీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తుండగా.. కేసీఆర్ సర్కార్ పై కమలనాథులు ఫైరవుతున్నారు. ఇరు పార్టీల నేతల మధ్య డైలాగ్ వార్ సాగుతోంది. అయితే తాజాగా మోడీ సర్కార్ కు థ్యాంక్స్ చెప్పారు మంత్రి కేటీఆర్. తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకానికి కేంద్ర ప్రభుత్వం అవార్డు ప్రకటించింది. అవార్డు ఇవ్వడంపై మంత్రి కేటీఆర్ సంతోషం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. తెలంగాణలోని ఇంటింటికి సురక్షిత తాగు నీరు సరఫరా చేస్తున్న విషయాన్ని గుర్తించినందుకు కేంద్ర సర్కార్ కు ధన్యవాదాలు తెలిపారు కేటీఆర్. అయితే థ్యాంక్స్ చెబుతూనే..
మిషన్‌ భగీరథకు 19వేల కోట్ల రూపాయలు ఇవ్వాలన్న నీతి ఆయోగ్‌ సిఫార్సులను  గౌరవిస్తే ఇంకా బాగుంటుందని అన్నారు.

అటు తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు మాత్రం కేంద్ర సర్కార్ పై మరోసారి ఫైరయ్యారు. మోడీ ప్రభుత్వం తెలంగాణ పథకాలను ఢిల్లీలో ప్రశంసిస్తూ.. గల్లీలో విమర్శలు చేస్తుందని అన్నారు. కేసీఆర్ పాలనపై విమర్శలు చేస్తున్న కేంద్రమంత్రులు.. దమ్ముంటే రాష్ట్రానికి నిధులిచ్చి వాటా గురించి మాట్లాడాలని సూచించారు.  ఓ వైపు అవార్డులు ఇస్తూనే మరోవైపు ప్రభుత్వ పనితీరు బాగోలేదంటూ రాజకీయ విమర్శలు చేయడం విడ్డూరమన్నారు. తెలంగాణలో అమలవుతున్న నాలుగు పథకాలను మోడీ సర్కార్ కాపీ కొట్టిందన్నారు హరీష్ రావు. ఉచిత విద్యుత్‌, రైతుబంధు స్కీములను కాపీ కొట్టి దేశ వ్యాప్తంగా అమలు చేస్తే ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. రోజుకొకరుగా వస్తున్న కేంద్ర మంత్రుుల.. తెలంగాణ పథకాలను చూసి నేర్చుకోవాలని హరీష్ రావు హితవు పలికారు. మిషన్‌ భగీరథకు నిధులు ఇవ్వాలన్న నీతి ఆయోగ్‌ సిఫార్సులను మోడీ ప్రభుత్వం తుంగలో తొక్కిందని మండిపడ్డారు.

మిషన్ భగీరథ పథకం జల్ జీవన్ మిషన్‌కు బూస్ట్‌లా పనిచేస్తోందని కేంద్ర సర్కార్ ఇచ్చిన కితాబు కేసీఆర్ సంక్షేమ పాలనకు నిదర్శనమన్నారు హరీష్ రావు. సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తున్న నాయకుడు కేసీఆర్ అన్నారు.పాదయాత్రలు, సైకిల్ యాత్రలు, మోకాళ్ల యాత్రలు చేస్తున్న నాయకులు ఎక్కడైనా నీళ్లు, విద్యుత్‌ గురించి మాట్లాడుతున్నారా అంటూ పరోక్షంగా బండి సంజయ్ ను ప్రశ్నించారు హరీష్ రావు.

Read also: TS Govt: తెలంగాణలో వైద్య విద్యార్థులకు గుడ్‌న్యూస్..ప్రభుత్వం కీలక నిర్ణయం..!

Read also: MP Santosh Rao: కేసీఆర్ వెంటే ఉన్నా.. కేసీఆర్ సేవే  జీవితం! పారిపోయాడన్న వార్తలపై ఎంపీ సంతోష్ క్లారిటీ...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News