MLA Raja Singh: ఎమ్మెల్యే రాజాసింగ్‌పై పీడీ యాక్ట్..చర్లపల్లికి తరలింపు..!

MLA Raja Singh: ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. మరో కేసులో ఆయనను అరెస్ట్ చేశారు.

Written by - Alla Swamy | Last Updated : Aug 25, 2022, 05:21 PM IST
MLA Raja Singh: ఎమ్మెల్యే రాజాసింగ్‌పై పీడీ యాక్ట్..చర్లపల్లికి తరలింపు..!
Live Blog

MLA Raja Singh: ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి అరెస్ట్ అయ్యారు. రాజాసింగ్‌కు 41ఏ సీఆర్‌పీసీ కింద పోలీసులు నోటీసులు జారీ చేశారు. షామినాయత్ గంజ్, మంగళ్‌హాట్ కేసులకు సంబంధించి నోటీసులు జారీ చేశారు. 24 గంటల్లో వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. 

25 August, 2022

  • 16:57 PM

    ఎమ్మెల్యే రాజాసింగ్‌పై పీడీ యాక్ట్
    చర్లపల్లి జైలుకు రాజాసింగ్ తరలింపు
    ఎమ్మెల్యేపై పీడీ యాక్ట్ తెలుగు రాష్ట్రాల్లో ఇదే తొలిసారి
    మతాన్ని, వర్గాన్ని కించపరిచేలా రాజాసింగ్ వ్యాఖ్యలు: సీపీ
    యూట్యూట్ చానల్‌లో రాజాసింగ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు
    రాజాసింగ్‌పై రౌడీ షీట్‌: సీపీ సీవీ ఆనంద్
    పీడీ యాక్ట్ నమోదుపై రాజాసింగ్‌కు నోటీసులు
    అరెస్ట్ చేయడానికి ముందే ఆయనకు పీడీ యాక్ట్ నోటీసులు
    పీడీయాక్ట్ నమోదుపై బోర్డు ముందు పెట్టనున్న పోలీసులు
    ప్రతి మూడు నెలలకు ఒకసారి పీడీ యాక్ట్ బోర్డు సమావేశం
    పీడీ యాక్ట్ నమోదుతో బెయిల్ వచ్చే అవకాశం లేదంటున్న న్యాయ నిపుణులు

  • 16:32 PM

    ఎమ్మెల్యే రాజాసింగ్‌పై పీడీ యాక్ట్
    రాజాసింగ్‌ను రౌడీ షీటర్‌గా పేర్కొన్న పోలీసులు
    పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేసినట్లు ప్రకటన
    చర్లపల్లి జైలుకు రాజాసింగ్ తరలింపు
    ఉద్దేశపూర్వకంగా రాజాసింగ్‌ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు
    రెచ్చగొట్టే వ్యాఖ్యలు విధ్వంసానికి దారి తీస్తాయి: పోలీసులు
    మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టారు

    ఎమ్మెల్యే రాజాసింగ్‌పై పీడీ యాక్ట్
    రాజాసింగ్‌పై 2004 నుంచి 101 క్రిమినల్ కేసులు
    ఇందులో 18 మత ఘర్షణల కేసులు

  • 16:21 PM

    ఎమ్మెల్యే రాజాసింగ్‌పై పీడీ యాక్ట్
    చర్లపల్లి జైలుకు రాజాసింగ్‌ తరలింపు

     

  • 16:08 PM

    బీజేపీపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఫైర్
    బీజేపీ ఒక ఉప ఎన్నిక కోసం ఇంత బరితెగించాలా
    ఇప్పుడే బీజేపీ తీరు ఇలా ఉంటే సార్వత్రిక ఎన్నికల పరిస్థితి ఏంటి
    రాష్ట్రాన్ని అగ్నికి అహుతి చేద్దాం అనుకుంటున్నారా: ఓవైసీ
    కర్ఫ్యూ సృష్టించాలనుకుంటున్నారా: అసదుద్దీన్ ఓవైసీ 

     

  • 16:00 PM

    నాంపల్లి కోర్టుకు రాజాసింగ్ తరలింపు
    భారీ భద్రత నడుమ రాజాసింగ్ తరలింపు
    రెచ్చగొట్టే వ్యాఖ్యల కేసులో రాజాసింగ్ అరెస్ట్
    రాజాసింగ్‌పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు

    గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు
    అనంతరం నాంపల్లి కోర్టుకు తరలించనున్న పోలీసులు

  • 15:56 PM

    ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి అరెస్ట్ 
    రాజాసింగ్‌కు 41ఏ సీఆర్‌పీసీ కింద పోలీసుల నోటీసులు
    యూపీ ఎన్నికల సమయంలో అనుచిత వ్యాఖ్యలపై కేసు
    శ్రీరామనవమి శోభాయాత్ర సమయంలో మరో కేసు
    రెండు కేసుల్లో ఇవాళ అరెస్ట్

     

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x