MUSTI PUB: కూకట్ పల్లి క్లబ్ మస్తీ పబ్ లో అశ్లీల నృత్యాలు.. పోలీసుల అండతోనే గబ్బు?

CLUB MUSTI PUB: జూబ్లీహిల్స్ పబ్ కు వచ్చిన మైనర్ బాలికను కారులో తీసుకెళ్లి గ్యాంగ్ రేప్ చేసిన ఘటన తెలంగాణతో పాటు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. మైనర్ బాలికను పబ్ లోకి ఎలా అనుమతి ఇచ్చారన్నది ప్రశ్నగా మారింది.  గ్యాంగ్ రేప్ ఘటనపై రచ్చ సాగుతుండగానే.. హైదరాబాద్ లో మరో పబ్ బాగోతం బయటపడింది. అశ్లీల నృత్యాలకు అడ్డాగా మారింది సదరు పబ్.  పబ్ పై పోలీసుల దాడిలో విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి.

Written by - Srisailam | Last Updated : Jun 4, 2022, 10:14 AM IST
  • కేపీహెచ్బీ క్లబ్ మస్తీ పబ్ లో సోదాలు
  • అశ్లీల నృత్యాలు చేస్తున్న యువతులు
  • 9 మంది డ్యాన్సింగ్ యువతులు అరెస్ట్
MUSTI PUB: కూకట్ పల్లి క్లబ్ మస్తీ పబ్ లో అశ్లీల నృత్యాలు.. పోలీసుల అండతోనే గబ్బు?

CLUB MUSTI PUB: జూబ్లీహిల్స్ పబ్ కు వచ్చిన మైనర్ బాలికను కారులో తీసుకెళ్లి గ్యాంగ్ రేప్ చేసిన ఘటన తెలంగాణతో పాటు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. మైనర్ బాలికను పబ్ లోకి ఎలా అనుమతి ఇచ్చారన్నది ప్రశ్నగా మారింది.  గ్యాంగ్ రేప్ ఘటనపై రచ్చ సాగుతుండగానే.. హైదరాబాద్ లో మరో పబ్ బాగోతం బయటపడింది. అశ్లీల నృత్యాలకు అడ్డాగా మారింది సదరు పబ్.  పబ్ పై పోలీసుల దాడిలో విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి.

కేపిహెచ్ బి మంజీరా మెజెస్టిక్ కమర్షియల్ లోని క్లబ్ మస్తీ పబ్ పై మాదాపూర్ ఎస్ఓటీ పోలీసుల దాడులు చేశారు. అశ్లీల నృత్యాలతో గబ్బు రేపుతున్నారంటూ వచ్చిన పక్కా సమాచారంతో ఎస్వోటీ పోలీసులు శుక్రవారం అర్ధరాత్రి పబ్ పై ఒక్కసారిగా దాడి చేశారు. పబ్ లోపలికి వెళ్లిన పోలీసులు అక్కడ కనిపిస్తున్నది చూసి షాకయ్యారు. యువతులతో అర్థనగ్నంగా నృత్యాలు చేయిస్తూ కస్టమర్లను ఆకట్టుకునే విధంగా పబ్ లో  ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు నిర్వాహకులు. పరిమితికు మించి డిజె సౌండ్ తో పబ్ నడుపుతోంది క్లబ్ మస్తీ. 9 మంది డ్యాన్సింగ్ యువతులు, మేనేజర్ ప్రదీప్ కుమార్, డేజె ఆపరేటర్ దనరాజగ్, కస్టమర్ సాయి సంతోష్ ను స్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. డిజే మిక్సర్, హుక్కా ప్లేవర్లు స్వాధీనం చేసుకున్నారు.

పబ్ లో పట్టుబడిన వాళ్లను  కేపీహెచ్బీ పోలీసులకు అప్పగించారు మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు.  క్లబ్ మస్తీ పబ్ ఓనర్ శివ ప్రసాద్ రెడ్డి, మేనేజర్లు విష్ణు, కృష్ణ పరారీలో ఉన్నారు. వాళ్ల కోసం పోలీసులు గాలిస్తున్నారు.పోలీస్ కనుసన్నల్లోనే క్లబ్ మస్తీ పబ్ నిర్వహిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అర్ధరాత్రి దాటినా  పబ్ లో పార్టీలు కొనసాగుతాయని. అయినా పోలీసులు పట్టించుకోరని స్థానికులు చెబుతున్నారు. రాత్రి పూట తూతుూ మంత్రంగా పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారని ఆరోపిస్తున్నారు. డీజే  సౌండ్ తో  ఇబ్బంది పడుతున్నామని పోలీసులకు చెప్పినా ఎవరూ స్పందించలేదని స్థానికులు మండిపడుతున్నారు.

కేపిహెచ్ బి క్లబ్ మస్తీ పబ్ బాగోతం బయటపడటంతో హైదరాబాద్ పోలీసుల వైఫల్యం మరోసారి బహిర్గతమైంది. జూబ్లీహిల్స్ పబ్ వ్యవహారంలో పెద్ద రచ్చ సాగుతున్నా పబ్ లపై పోలీసులు నిఘా పెట్టలేదంటే.. వాళ్లు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో అర్థమవుతోంది. పోలీసులు, స్థానిక ప్రజా ప్రతినిధుల అండదండలతోనే పబ్ లు ఇష్టారాజ్యంగా నడుస్తున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి.

READ ALSO: Gangrape: బాలిక గ్యాంగ్ రేప్ ఘటనలో గంటకో ట్విస్ట్.. నిందితుల్లో హోంమంత్రి మనవడు? క్లారిటీ ఇచ్చిన డీసీపీ...  

READ ALSO: MLC Anantha Babu: జైల్లో తోటి ఖైదీపై దాడి చేసిన ఎమ్మెల్సీ అనంత బాబు...?  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

 

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x