MLC Anantha Babu: డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో అరెస్టయి ప్రస్తుతం రాజమంత్రి జైల్లో రిమాండు ఖైదీగా ఉన్న ఎమ్మెల్సీ అనంత బాబు జైల్లోనూ దుందుడుకుగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. తోటి ఖైదీ ఒకరిపై అనంత బాబు దాడి చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ మాటా మాటా పెరిగి కొట్టుకునేవరకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అనంత బాబు తోటి ఖైదీపై చేయి చేసుకున్నట్లు సమాచారం. జైలు సిబ్బంది వెంటనే అప్రమత్తమై గొడవ సమసిపోయేలా చేసినట్లు తెలుస్తోంది. అనంత బాబు దాడిలో తోటి ఖైదీకి పెద్దగా గాయాలేవీ తగల్లేదని సమాచారం.
సంచలనం రేపిన హత్య కేసు :
ఏపీలో సంచలనం రేకెత్తించిన సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంత బాబు నేరం అంగీకరించిన సంగతి తెలిసిందే. సుబ్రహ్మణ్యం రోడ్డు యాక్సిడెంట్‌లో చనిపోయాడని కట్టు కథ అల్లి అతని కుటుంబ సభ్యులను నమ్మించే ప్రయత్నం చేశాడు అనంత బాబు. కానీ పోలీసుల విచారణలో నేరం అంగీకరించక తప్పలేదు. వ్యక్తిగత వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నందుకే సుబ్రహ్మణ్యంను హత్య చేసినట్లు తెలిపాడు. తానొక్కడినే అతన్నిహత్య చేసినట్లు చెప్పాడు. అయితే ఆ వ్యక్తిగత వ్యవహారాలు ఏంటన్నది ఇప్పటికీ వెల్లడికాలేదు. నేరం అంగీకరించడంతో అనంత బాబును అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండుకు తరలించారు.
సుబ్రహ్మణ్యం భార్యకు ప్రభుత్వ ఉద్యోగం :
మృతుడు సుబ్రహ్మణ్యం భార్యకు ఆరోగ్య శాఖలో ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ విక్టర్ ప్రసాద్ ఆమెకు అపాయింట్‌మెంట్ లెటర్ అందించారు. సుబ్రహ్మణ్యం సోదరుడికి కాంట్రాక్ట్ ఉద్యోగం ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. మృతుడి భార్య, తల్లికి ఇంటి స్థలం కూడా కేటాయించారు. అందులో ప్రభుత్వమే ఇళ్లు నిర్మించి ఇవ్వనుంది. అలాగే, రూ.8 లక్షల ఆర్థిక సాయం కూడా ఇప్పటికే ప్రభుత్వం అందించింది.
Also Read: Pawan Kalyan Comments: వైసీపీ గ్రూప్ తగాదాల వల్లే కోనసీమ అల్లర్లు..పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు..!
Also Read: 7th Pay Commission: త్వరలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..డీఏ పెంపు ఎంతంటే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook