Telangana Assembly Elections 2023: కాంగ్రెస్ సీనియర్ నాయకులు బిల్యా నాయక్‌తోపాటు పలువురు పలువురు నాయకులు బీఆర్ఎస్ గూటికి చేరుకున్నారు. వారికి మంత్రి కేటీఆర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికలను రేవంత్ రెడ్డి తనకు డబ్బులు సంపాదించే ఏటీఎంగా వాడుతున్నారని విమర్శించారు. ఓటుకు నోటు అంటూ కెమెరాలకు అడ్డంగా దొరికిన రేవంత్ రెడ్డి ఇప్పుడు.. నోటుకు సీటు.. రేటేంతా అంటూ మాట్లాడుతున్నాడని ఫైర్ అయ్యారు. ఫేక్ సర్వేల పేరుతో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందంటూ.. తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇది ఆ పార్టీకి కొత్త కాదు.. గతంలో కూడా ఇలాంటి సర్వేలతో పిచ్చి ప్రయత్నాలు చేసి చిత్తుగా ఓడిపోయిన చరిత్ర కాంగ్రెస్‌కుందన్నారు.
"ఓడిపోతే రాజకీయాల నుంచి వైదొలుగుతాం.. గడ్డాలు గీసుకోమంటూ సవాలు చేసిన పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, మాజీ పీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డిలు మాట తప్పారు. 60 ఏళ్లు అధికారంలో ఉన్నా కరెంటు ఇవ్వలేని సన్నాసులమని కాంగ్రెస్ ఓటు అడుగుతుం.. 60 ఏళ్లు అధికారంలో ఉన్న తాగునీటి ఇబ్బందులు తీర్చలేని చేతగాని వాళ్ళమంటూ ఓటు అడుగుతారా.. 24 గంటల కరెంటు రైతులకు ఇవ్వలేని ఆలోచన మాకు రాలేదని ఓటు అడుగుతారా.. కాంగ్రెస్‌కి ఓటు ఎందుకు వేయ్యాలో చెప్పాలి. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఆ పార్టీ నేతలు ఎదిగారు కానీ ప్రజలకు చేసింది ఏమీ లేదు. ప్రజలకు ఏం చేయని కాంగ్రెస్ పార్టీని మరోసారి ఎందుకు గెలిపించాలి..?
కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి మన వేలుతో మన కండ్లని పొడుచుకోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం.. కాంగ్రెస్ పార్టీ జమానాలో ఉన్న కరెంటు కోతలు వ్యవసాయ సంక్షోభం, రైతు ఆత్మహత్యలు, తాగునీటి కొరత వంటి దుర్భర పరిస్థితిలో మళ్లీ కావాలా..? రేవంత్ రెడ్డి అన్న మూడు గంటల కరెంట్ కావాలా.. లేదా 24 గంటల ఉచిత విద్యుత్తు కావాలా తెలంగాణ రైతులు ఆలోచించుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో మా ప్రభుత్వం దాదాపు అన్ని దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించింది. ఒకవైపు స్కీములు తెచ్చిన బీఆర్ఎస్ ఉంది.. మరోవైపు స్కాములు తెచ్చిన కాంగ్రెస్ ఉంది. ఒకవైపు కారు ఉంది.. మరొకవైపు బేకార్ గాళ్లు ఉన్నారు. ఎవరికి ఓటు వేయాలో ప్రజలు ఆలోచించుకోవాలి.." అని మంత్రి కేటీఆర్ కోరారు.
కేసీఆర్ పదేళ్ల కాలంలో రాష్ట్రాన్ని నెంబర్ వన్ స్థానంలో ఉంచారని.. మరోసారి సీఎం అయితే రాష్ట్రంలోని బడుగు, బలహీన వర్గాలు మరింత అభివృద్ధి చెందుతారన్న విశ్వాసం ప్రజల్లో కనిపిస్తుందన్నారు. ఇప్పటిదాకా 33 నియోజకవర్గాల్లో తిరిగినా.. తనకు ఎక్కడ కూడా ప్రభుత్వ వ్యతిరేకత కనిపించలేదని చెప్పారు. ఒక్క దేవరకొండలోనే 600 కోట్లతో ఐదు లిఫ్టి ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు నడుస్తున్నాయని.. ఈ ప్రాజెక్టులు పూర్తిచేసి రానున్న ప్రభుత్వంలో దేవరకొండ ప్రజలకు సాగునీరు అందించి వారి రుణం తీర్చుకుంటామన్నారు. అమిత్ షా ప్రజలను తప్పుదోవ పట్టించేలా అబద్ధాలు మాట్లాడినందుకు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
Also Read: Minor Sisters Killed: ప్రియుడితో రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన అక్క.. చెల్లెళ్లు చూశారని దారుణం..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి