Minister KTR: ఎప్పుడు వచ్చినం కాదు.. బుల్లెట్ దిగిందా..? లేదా..?: మంత్రి కేటీఆర్

KTR Speech at BRS Public Meeting in Kamareddy: కామారెడ్డిలో సీఎం కేసీఆర్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రి కేటీఆర్‌ను పిలుపునిచ్చారు. సరికొత్త చరిత్రకు కామారెడ్డి వేదిక కాబోతోందన్నారు. సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ విజయం సాధించి.. సరికొత్త చరిత్ర సృష్టించబోతున్నారని జోస్యం చెప్పారు.  

Written by - Ashok Krindinti | Last Updated : Oct 7, 2023, 07:22 PM IST
Minister KTR: ఎప్పుడు వచ్చినం కాదు.. బుల్లెట్ దిగిందా..? లేదా..?: మంత్రి కేటీఆర్

KTR Speech at BRS Public Meeting in Kamareddy: సీఎం కేసీఆర్ కామారెడ్డిలో పోటీ చేస్తుండడంతో ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. కేసీఆర్ పోటీతో దృష్టి అంతా కామారెడ్డి మీదే ఉందన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఇండోర్ స్టేడియానికి శంకుస్థాపన కేటీఆర్.. చేసిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవర్‌ఫుల్ స్పీచ్ ఇచ్చారు. కేసీఆర్ పోటీ చేస్తే తమ నియోజకవర్గం బాగుపడుతుందని ఎమ్మెల్యే గంప గోవర్ధన్ భావించారని.. అందుకే ఆయన సీటు నుంచి కేసీఆర్‌కు త్యాగం చేశారని అన్నారు. కేసీఆర్‌కు సీటు ఇచ్చి.. తాను కార్యకర్తలా పనిచేస్తానని చెప్పారని గుర్తు చేసుకున్నారు. సరికొత్త చరిత్రకు కామారెడ్డి వేదిక కాబోతోందని.. తెలంగాణ చరిత్రపై చెరగని సంతకం కేసీఆర్‌ది అని అన్నారు. 60 ఏళ్లలో కాంగ్రెస్ చేయలేని పనులను కేవలం సీఎం కేసీఆర్ తొమ్మిదేళ్లలోనే  కొత్త తెలంగాణను దేశానికి పరిచయం చేశారని వ్యాఖ్యానించారు.

కామారెడ్డిలో కేసీఆర్‌పై పోటీ చేస్తే.. పేరు వస్తుందేమో కానీ డిపాజిట్ మాత్రం రాదన్నారు కేటీఆర్. ఇక్కడ పోటీ అంటే.. గొర్రె పొట్టేలును తీసుకుపోయి పోశమ్మ ముందు కట్టేసినట్టేనని అన్నారు. వచ్చే ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం సాధించి.. కేసీఆర్ దక్షిణ భారతదేశంలో రికార్డు సృష్టించబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. చరిత్రలో అత్యధిక మెజారిటీ ఇచ్చిన నియోజకవర్గంగా కామారెడ్డి రికార్డు నెలకొల్పాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ విజయం ఎప్పుడో ఖరారు అయిందని.. తేలాల్సింది మెజారిటీ మాత్రమేనన్నారు.  

ఎమ్మెల్యే సీట్ల విషయంలో ముదిరాజులకు కొంత అన్యాయం జరిగిన మాట వాస్తవమేనని కేటీఆర్ ఒప్పుకున్నారు. వచ్చే ఎమ్మెల్సీ, నామినేటడ్ పదవుల్లో సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. కామారెడ్డి నియోజకవర్గంలో గ్రామానికి ఓ మ్యానిఫెస్టో తయారు చేసుకోవాలని.. మీకు కావాల్సిన అందులో పెట్టాలని సూచించారు. అది తనకు అందజేయాలని.. కేసీఆర్‌ను భారీ మెజారిటీతో గెలిపించిన తరువాత నిధుల వరద పారించే బాధ్యత తీసుకుంటానని అన్నారు. కేసీఆర్ వస్తే.. కామారెడ్డి మరో నాలుగు రెట్లు పైకి ఎదుగుతుందన్నారు. 

కామారెడ్డిలో కేసీఆర్‎కు వచ్చే మెజారిటీ చూసి ప్రతిపక్షాల దిమ్మదిరిగి మైండ్ బ్లాంక్ కావాలని కేటీఆర్ అన్నారు. సినిమాలో చెప్పినట్లు.. ఎప్పుడు వచ్చినం కాదు.. బుల్లెట్ దిగిందా..? లేదా..? అన్నట్లు ఈ సారి రికార్డులు బద్దలు కొట్టాలన్నారు. కామారెడ్డికి ప్రత్యేక మ్యానిఫెస్టో పెడదామన్నారు. బీజేపీది ఒట్టి మేకప్ అయితే.. కాంగ్రెస్‎ది ప్యాకప్ అని ఎద్దేవా చేశారు. ఓటుకు నోటు దొంగ ఓ దిక్కు.. తెలంగాణ కోసం రాజీనామా చేయమంటే పారిపోయిన దొంగ ఓ దిక్కు ఉన్నారని సెటైర్లు వేశారు. రేవంత్ రెడ్డి ఎన్నికల్లో గెలిచే 10, 12 మందితో బీజేపీలో చేరడం ఖాయమని జోస్యం చెప్పారు.

Also Read: Osmania University: ఉస్మానియా వర్సిటీకి కేంద్రం గుడ్‌న్యూస్.. హాస్టళ్ల నిర్మాణానికి నిధులు విడుదల 

Also Read: Muktinath Cable Car Project: ముక్తినాథ్ కేబుల్ కార్ ప్రాజెక్ట్‌ పనుల్లో వేగం.. కీలక ఒప్పందానికి ఆమోదం  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News