MP Santhosh Kumar Tweets Lion video: సింహం.. అందమైన కూనలు, ఎంపీ సంతోష్ ట్వీట్ వైరల్

MP Santhosh Kumar Posted Lions Video: మదర్స్ డే రోజు ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. పకృతిలో అవధులు లేని తల్లిప్రేమను తెలియజేస్తూ చేసిన ఆ ట్వీట్ అందరి హృదయాలను ఆకట్టుకుంటోంది. ఏ జీవిలోనైనా కల్మషం లేనిది  తల్లి ప్రేమే అంటూ నెటిజన్లు ఆ పోస్టును లైక్ చేస్తున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : May 8, 2022, 08:08 PM IST
  • మదర్స్ డే సందర్భంగా ఎంపీ సంతోష్ స్పెషల్‌ ట్వీట్
    గిర్‌ నేషనల్ పార్క్ ఫోటోలను షేర్ చేసన సంతోష్‌కుమార్
MP Santhosh Kumar Tweets Lion video: సింహం.. అందమైన కూనలు, ఎంపీ సంతోష్ ట్వీట్ వైరల్

MP Santhosh Kumar Posted Lions Video: ప్రకృతి ప్రేమికుడు ఎంపీ సంతోష్‌కుమార్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. పర్యావరణానికి సంబంధించి ప్రజలను చైతన్యం చేసే ప్రయత్నం చేస్తుంటారు.  ఇటీవల గిర్ నేషనల్ పార్క్‌లో స్టడీ టూర్ నిర్వహించిన పార్లమెంటరీ బృందంలో సభ్యులు సంతోష్‌కుమార్. ఈ సందర్భంగా ఆ అభయారణ్యంలోని అందాలను తన కెమరాలో బంధించారు. అందులోంచి కొన్ని ఫోటోలను మదర్స్‌డే రోజున ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఇప్పుడీ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. 

గిర్‌ నేషనల్ పార్క్‌లో సింహం కూనలు తమ తల్లితో ఆడుకుంటున్న అద్భుత దృశ్యాలను ట్విట్టర్‌లో షేర్ చేశారు ఎంపీ సంతోష్‌కుమార్. నేషనల్ పార్క్ లో లోకాన్ని మైమరచిపోయి సింహం తన పిల్లలను ప్రేమగా నిమురుతున్న ఫోటోలను తన కెమరాలో బంధించారు. మదర్స్ డే సందర్భంగా ఈ ఫోటోలను ట్విట్టర్ లో పంచుకున్నారు. అడవిలో గడిపేకంటే సంతోషకరమైన సమయం మరొకటి ఉండదన్నారు. గిర్ నేషనల్ పార్క్ లో సింహం ఫ్యామిలీని చూడటం చాలా అద్భుతంగా అనిపించిందన్నారు. సింహంపిల్లలు తమ తల్లితో సరదాగా గడుపుతున్న దృశ్యాలు చూసి తనను తాను మైమరచిపోయినట్లు తెలిపారు. ఏ కూనలైనా తమ తల్లి ప్రేమను పొందడానికి ఇష్టపడతాయన్నారు. సంతోష్‌కుమార్ చేసిన ట్వీట్‌ను నెటిజన్లు విపరీతంగా లైక్ చేస్తున్నారు. సృష్టిలో అత్యంత తీయనైన తల్లి ప్రేమకు ఏ జీవీ అతీతం కాదంటూ కామెంట్లు, రీట్వీట్లు చేస్తున్నారు. 

 

గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్ ద్వారా అందరికీ సుపరిచితంగా మారారు ఎంపీ సంతోష్‌కుమార్. గత కొన్నేళ్లుగా గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ ను ఉద్యమంలా నిర్వహిస్తున్నారు. పలువురు సెలబ్రెటీలతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు ఇందులో భాగస్వామ్యమయ్యారు. కీసర ఫారెస్ట్‌ను కూడా దత్తత తీసుకున్న ఎంపీ సంతోష్‌కుమార్ అక్కడ పచ్చదనాన్ని పెంచేందుకు ఎంతో కృషిచేస్తున్నారు. 

also read: Startup Policies: మధ్యాహ్నం కునుకు తీయొచ్చు.. అన్‌లిమిటెడ్ లీవ్స్ తీసుకోవచ్చు.. ఈ స్టార్టప్స్‌ ఉద్యోగులకు స్వర్గధామమే..

also read: Keerthy Suresh Pics: కోహినూర్ వజ్రంలా మెరిసిపోతున్న కీర్తి సురేష్.. ఆ అందం ముందు అన్ని దిగదుడుపే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.
 

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x