Kavitha Vs Arvind Dharmapuri : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై తీవ్ర విమర్శలు చేశారు నిజామాబాద్ ఎంపీ అర్వింద్. నిజామాబాద్ పసుపు రైతుల సమస్యలపై మాట్లాడుతున్న కవితకు జగిత్యాల, అదిలాబాద్, నిర్మల్, వరంగల్ తదితర ప్రాంతాల్లో పసుపు రైతులు ఉన్న విషయం తెలియదా అని ప్రశ్నించారు బీజేపీ నిజామాబాద్ ఎంపీ అర్వింద్.
కవిత పోయిన సంవత్సరం వివరాలు అడిగినప్పుడు.. ఎనిమిది నెలల క్రితం అక్టోబరులోనే స్పైస్ బోర్డు ఆమెకు జవాబిచ్చిందని గుర్తు చేశారు. ఆమెకు సమాధనం ఇచ్చిన తర్వాత రెండు సార్లు బడ్జెట్ వచ్చిందన్నారు అర్వింద్. ఇప్పటి వరకు స్పైస్ బోర్డు ఆరు కోట్లు కేటాయించిందన్నారు. ఆమెకు సమాధానం ఇచ్చిన సమయంలో కోటిన్నర కేటాయించినట్లు తెలిపారని... కావాలంటే మరోసారి అడగొచ్చని ఇప్పుడు ఆరు కోట్లు కేటాయింపులకు సంబంధించిన వివరాలు ఇస్తారన్నారు అర్వింద్.
కవిత ఎంపీగా ఉన్న సమయంలో పసుపు రైతుల కోసం తెచ్చింది 13బాయిలర్లేనన్నారు అర్వింద్. వీటితోపాటు 3 పాలిషర్లు మాత్రమే తెచ్చిన కవిత టార్పాలిన్లు ఒక్కటంటే ఒక్కటి కూడా తెప్పించలేదన్నారు.
2019 నుంచి తాను ఎంపీ అయ్యాక 4 కోట్ల 22 లక్షల 90వేలు విలువ చేసే 108బాయిలర్లు, 209 పాలిషర్లు, 7240 టార్పాలిన్లు తెప్పించామన్నారు అర్వింద్. వీటితోపాటు కోటి రూపాయల వరకు ఖర్చు పెట్టి పసుపు టెస్టింగ్ మెషిన్‌లు, ఎగుమతుల వ్యాపారులతో సమావేశాలు నిర్వహించేందుకు కృషి చేసి రైతులకోసం పనిచేశానన్నారు అర్వింద్.
కేసీఆర్ ప్రభుత్వం రాక ముందు కార్లలో తిరిగిన చరిత్ర నిజామాబాద్ పసుపు రైతులదని, ఇప్పుడు పసుపు రైతులు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో అందరికీ తెలుసన్నారు. త్వరలోనే ప్రజలు అన్నింటికీ సమాధానం చెప్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఎంపీ అర్వింద్.
Also Read - Kavitha Vs Arvind Dharmapuri : ఎంపీ అర్వింద్‌పై కవిత ఫైర్.. అర్వింద్ సమాధానం ఏంటంటే..
Also Read - Kangana Ranaut Hot Pics: బాబోయ్ కంగనా రనౌత్.. ఎద అందాలు చూపిస్తూ చంపేస్తోందిగా!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook