Minister Harish Rao: బిజెపి పెట్టిన పార్టీలు బిజెపి వదిలిన బాణాలు ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాల్లో నడుస్తాయేమో కానీ తెలంగాణ గడ్డమీద పనిచేయవు అని బీజేపి అగ్రనేతలకు మంత్రి హరీశ్ స్పష్టం చేశారు.
Dharmapuri Aravind vs Kavitha: ఆ 50 మంది టిఆర్ఎస్ నాయకులని తనపైకి ఉసిగొల్పి ఇంటికి దాడికి పంపించింది టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితేనని అరవింద్ తన ఫిర్యాదు ద్వారా పోలీసుల దృష్టికి తీసుకొచ్చారు. తన ఇంటిపై దాడి ఘటనకు బాధ్యురాలైన కల్వకుంట్ల కవితపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాల్సిందిగా ధర్మపురి అరవింద్ బంజారాహిల్స్ పోలీసులకు విజ్ఞప్తి చేశారు.
Delhi Liquor Scam Case: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్‌కి చెందిన చార్టెడ్ అకౌంటెంట్‌కి సిబిఐ నోటీసులు జారీ చేసింది. సదరు చార్టెడ్ అకౌంటెంట్ మరెవరో కాదు.. రాబిన్ డిస్టిలరీస్ సంస్థలో చార్టెడ్ అకౌంటెంట్‌గా పనిచేస్తూ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సీఏగా సేవలు అందిస్తున్న గోరంట్ల బుచ్చిబాబే.
Kalvakuntla Kavitha: ధర్మపురిలో దసరా సంబరాలు, బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా హజరయ్యారు. ఎమ్మెల్సీ కవిత రాక సందర్భంగా ఆమెకు స్వాగతం పలికేందుకు ఇదే నియోజక వర్గానికి చెందిన ఆడ పడుచులు భారీ సంఖ్యలో బతుకమ్మలు, బోనాలతో తరలి వచ్చారు.
Kalvakuntla Kavitha on ED notice News: తాజాగా ఢిల్లీ మద్యం పాలసీలో అవినీతికి పాల్పడినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కవితకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీచేసినట్టుగా మీడియాలో కథనాలొచ్చాయి. ఎమ్మెల్సీ కవిత ఇంటిపై ఈడీ దాడులు చేయొచ్చనే వార్తలు కూడా వినిపించాయి.
Kavitha Vs Arvind Dharmapuri : నిజామాబాద్ నేతల మధ్య పసుపు బోర్డు ఏర్పాటుపై మరోసారి వార్ మొదలైంది. తాజాగా ఎంపీ ఆర్వింద్ మూడు సంవత్సరాలుగా అధికారంలో ఉండి ఏం చేశారో చెప్పాలని కవిత డిమాండ్ చేశారు. అర్వింద్ ఆ వెంటనే సమాధానంగా ఓ విడియో విడుదల చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.