Kavitha Vs Arvind Dharmapuri : ఉచిత సలహాలు ఇవ్వటం పనిగా పెట్టుకోని అర్వింద్ టైంపాస్ చేస్తూ.. పసుపు రైతులను మభ్యపెడుతున్నారని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. అర్వింద్ ఏం చేస్తున్నడని ఆర్టీఐ రిపోర్టులు తీస్తే... స్పైస్ బోర్డు ద్వారా వచ్చిన బడ్జెట్ లెక్కలు బైటపడ్డయన్నరు కవిత. బాండ్ పేపర్ రాసిచ్చి మోసం చేసిందే కాక.. కనీసం ఆదుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు కవిత.
పేరుకే బండి సంజయ్ సంగ్రామ యాత్ర అని, తెలంగాణ ప్రజలకు నిజమైన సంరక్షకులు గులాబీ పార్టీ బిడ్డలేనన్నరు కవిత. ప్రజా సంగ్రామ యాత్రలో అబద్ధాలు చెప్పి పబ్బం గడుపుతున్నరని విమర్శించారు. పార్లమెంటులో నిర్మల సీతారామన్ హామీ ఇచ్చి మరీ తుంగలో తొక్కారని గుర్తు చేశారు కవిత. గడిచిన మూడేళ్లలో బీజేపీ నేతలు అనేక అబద్ధాలు మాట్లాడారని ఎద్దేవా చేశారు కవిత.
అబద్ధాలు చెప్పడం తప్ప భాజపా నేతలు ఇన్నాళ్లుగా చేసిందేమీ లేదన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. అనేక సందర్భాల్లో అర్వింద్ సహా బీజేపీ నేతలు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు. కుల మత చిచ్చుపెట్టి విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు కవిత. సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలిస్తమని మోసం చేశారు. గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు యథేచ్ఛగా పెంచారని విమర్శించారు. జిల్లా నుంచి అంతర్జాతీయ అంశాల వరకు అన్ని దశల్లో అబద్ధాలతో సర్కారు నడుపుతున్నారని కవిత ఆరోపించారు.
ధాన్యం కొనుగోలుకు కేంద్రం ముందుకు రాని సమయంలో తెలంగాణ సర్కారు... కొనుగోలుకు ముందుకొచ్చింది. ఉద్యోగాల నోటిఫికేషన్‌తో యువత, విద్యార్థులు ఉత్సాహంగా ఉన్నారు. మహిళలకు, అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న తెలంగాణ పల్లెలకు కొత్త వెలుగులు నింపుతూ కేసీఆర్ సర్కారు అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందిస్తోందన్నారు.
ఎంపీ అర్వింద్ మూడేళ్లుగా పదవిలో కొనసాగుతున్నారని... ఇంత సమయం ఇచ్చిన తర్వాత ఏం సాధించారో ప్రశ్నించాల్సిన అవసరం ఉందన్నారు కవిత. పదవీ కాలం ఇంకా రెండేళ్లు ఉందని.. పసుపుబోర్డు ఎప్పుడు తెస్తారో చెప్పాలని కవిత ప్రశ్నించారు. పసుపు బోర్డు విషయంలో నిజామాబాద్ ప్రజలకు స్పష్టమైన సమాధానం చెప్పాలని కవిత డిమాండ్ చేశారు. ఈ మూడేళ్లలో అర్వింద్ పార్లమెంట్‌లో పసుపు గురించి మాట్లాడనేలేదన్నారు. మద్దతు ధర ఇవ్వమని కూడా అడగలేదని.. దిల్లీలో పసుపు రైతుల ఆత్మగౌరవం తాకట్టు పెట్టారని అర్వింద్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బాండ్ పేపర్‌లో చెప్పినట్లు పసుపు బోర్డు పట్టుకొని రాకపోతే అడుగడుగునా నిలదీస్తామని హెచ్చరించారు కవిత. అసలు స్పైస్ బోర్డుతో పెద్దగా ఉపయోగం ఏమీ లేదని కవిత ధ్వజమెత్తారు.
రాహుల్ గాంధీ వరంగల్ పర్యటన పైనా స్పందించారు కవిత. రాహుల్ పార్లమెంటులో తెలంగాణ రైతుల పక్షాన మాట్లాడాలని అనేక సార్లు కోరినా పట్టించుకోని రాహుల్.. వరంగల్ వచ్చి ఏం చేస్తారని విమర్శించారు. ఓయూకు వచ్చి రాహుల్ ఏం చెప్పాలనుకుంటున్నారో అర్థం కావట్లేదన్నారు కవిత. సిద్ధాంతం లేని వాళ్లు రాద్దాంతం చేస్తే పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఎమ్మెల్సీ కవిత ఆరోపణలకు ఎంపీ అర్వింద్ సమాధానమిచ్చారు. వివరాలు... Kavitha Vs Arvind Dharmapuri : ఎమ్మెల్సీ కవితకు కౌంటర్ ఇచ్చిన అర్వింద్
Also Read : Kangana Ranaut Hot Pics: బాబోయ్ కంగనా రనౌత్.. ఎద అందాలు చూపిస్తూ చంపేస్తోందిగా!
Also Read : Vishwak Sen: అమ్మా.. నన్ను ఎవ్వడు ఏం పీకలేడు.. రాసిపెట్టుకో: విశ్వక్ సేన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook