హైదరాబాద్‌లో అగ్నికి ఆహుతైన ప్రింటింగ్ ప్రెస్

మంటల్లో పూర్తిగా కాలిబూడిదైన ప్రింటింగ్ ప్రెస్ గోడౌన్ 

Last Updated : Feb 15, 2018, 03:39 PM IST
హైదరాబాద్‌లో అగ్నికి ఆహుతైన ప్రింటింగ్ ప్రెస్

హైదరాబాద్: నాంపల్లిలోని ఓ ప్రింటింగ్ ప్రెస్‌లో గురువారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. తిరుమల ప్రింటింగ్ ప్రెస్‌లో సంభవించిన ఈ అగ్ని ప్రమాదంలో ప్రింటింగ్ ప్రెస్ గోడౌన్ పూర్తిగా దగ్ధమైపోయింది. 

ఈ అగ్ని ప్రమాదం గురించి అగ్నిమాపక శాఖ సిబ్బంది మాట్లాడుతూ.. ఉదయం 7:35 గంటలకు అగ్ని ప్రమాదం గురించి తమకు సమాచారం అందిందని, వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని మంటల్ని ఆర్పే పనిలో నిమగ్నమయ్యామని తెలిపారు. ఐదు ఫైర్ ఇంజిన్లు నిరంతరంగా పనిచేసినప్పటికీ మంటల్ని పూర్తిగా ఆర్పేందుకు దాదాపు 3 గంటల సమయం పట్టింది కానీ అప్పటికే గోడౌన్ మంటల్లో పూర్తిగా తగలబడి పోయిందని అన్నారు. 

Trending News