Revanth Reddy: నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ప్రశ్నించడానికి నిరసనగా వరుసగా మూడవరోజు తెలంగాణ కాంగ్రెస్ నేతలు దీక్ష చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి కేంద్ర సర్కార్ పై నిప్పులు చెరిగారు. ప్రశ్నించే నేతలను మోడీ సర్కార్ టార్గెట్ చేసిందన్న రేవంత్ రెడ్డి.. ఏఐసీసీ కార్యాలయంలోకి పోలీసులు బలవంతంగా చొరబడటం దారుణమన్నారు. పోలీసుల దాడిలో సీనియర్ నేతలు చిదంబరం, కేసీ వేణుగోపాల్ కు గాయాలయ్యాయని చెప్పారు. ముఖ్యమంత్రులు అనికూడా చూడకుండా అశోక్ గెహ్లాట్, బూపేష్ భాగల్ పై పోలీసులు దురుసుగా వ్యవహరించారని మండిపడ్డారు. ఢిల్లీలో పోలీసుల దమనకాండకు నిరసనగా మోడీ, అమిత్ షాకు వ్యతిరేకంగా ఢిల్లీ నుంచి గల్లీ వరకు నిరసన చర్యలు చేపడుతున్నామని తెలిపారు.
గురువారం రాజ్ భవన్ ముట్టడిస్తామని, శుక్రవారం జిల్లా కేంద్రాల్లోని కేంద్ర ప్రభుత్వ సంస్థల ముందు నిరసనలు చేస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష లు నెరవేర్చిన సోనియాగాంధీని అవమనిస్తున్న మోడీ చర్యలు తెలంగాణ ప్రజలకు అవమానకరమన్నారు. గాంధీ కుటుంబాన్ని దేశాన్ని విడదీసి చూడలేమన్నారు..రాష్ట్రపతి, ప్రధాని పదవులను త్యాగం చేసిన కుటుంబం సోనియాది అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టబోయే నిరసనల్లో కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా పాల్గొనాలని రేవంత్ రెడ్డి పిలుపిచ్చారు .
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పైనా విరుచుకుపడ్డారు రేవంత్ రెడ్డి. మోడీ చేతిలో కేసీఆర్ కీలు బొమ్మ అన్నారు. మోడీ ఆడించినట్టు ఆడడం కేసీఆర్ విధి అన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ కి సమాన దూరం అని ఎన్నికలకు దూరంగా ఉండి బీజేపీ ని గెలించడమే కేసీఆర్ లక్ష్యమన్నారు. బీజేపీ దగ్గర కేసీఆర్ సుపారీ తీసుకున్నాడని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ నైతిక విలువలు లేని బజారు నేత అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి. కేసీఆర్ సొంతంగా రాష్ట్రపతి అభ్యర్థిని పెడతాడా...? అని ప్రశ్నించారు. మమత బెనర్జీ సమావేశానికి ఎందుకు వెళ్లలేదని నిలదీశారు. నరేంద్ర మోడీ పాల్పడ్డ ప్రతి అనాగరిక చర్యలో కేసీఆర్ భాగస్వామ్యం ఉందని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
Read Also: BCCI IPL Rights: అత్యంత ఖరీదుగా మారిన ఐపీఎల్ మీడియా హక్కుల వేలం, ఒక మ్యాచ్ ఎంతంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook