Bandi Sanjay on KCR : కేసీఆర్‌కు బండి సవాల్

Bandi Sanjay on KCR : తెలంగాణలో రోడ్ల దుస్థితి చూసి మాట్లాడాలని సీఎం కేసీఆర్‌కు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సవాల్ విసిరారు. ప్రజలంతా టీఆర్ఎస్ ప్రభుత్వంపై వ్యతిరేకతతో ఉన్నారని, మార్పు కోరుకుంటున్నారని సంజయ్ చెప్పుకొచ్చారు. బీజేపీ అధికారంలోకి వస్తే ప్రజలకు సేవ చేస్తామన్నారు. రాష్ట్ర జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించి ఆదుకుంటామన్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : May 11, 2022, 05:40 PM IST
  • ప్రజలంతా ఫ్రభుత్వంపై వ్యతిరేకతతో ఉన్నారన్న బండి సంజయ్
  • కేసీఆర్ రోడ్ల దుస్థితి చూసి మాట్లాడాలని సవాల్
  • బీజేపీ అధికారంలోకి వస్తే ప్రజలకు సేవ చేస్తామని హామీ
Bandi Sanjay on KCR : కేసీఆర్‌కు బండి సవాల్

Bandi Sanjay on KCR : తెలంగాణ బ్రహ్మాండంగా అభివృద్ధి చెందిందని, రోడ్లు బాగున్నయని చెబుతున్న సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్ సవాల్ చేశారు. రంగారెడ్డి జిల్లాలో ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా పాదయాత్ర చేస్తున్నారు సంజయ్. కాకునూరు నుండి కేశంపేట వరకు నడుచుకుంటూ రావాలని, అప్పుడే రోడ్లు ఎంత దరిద్రంగా ఉన్నాయో అర్ధమవుతుందని అన్నారు. 

"నేను పాదయాత్ర చేస్తుంటే... గుంతల రోడ్లే దర్శనమిచ్చాయి. ప్రజలకు తల ఎత్తి అభివాదం చేయలేని పరిస్థితి. ఏ గుంతలో పడతామో తెలియని విధంగా రోడ్లన్నీ గుంతలమయ్యాయి’’
-బండి సంజయ్ కుమార్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు

ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా 28వ రోజు పాదయాత్ర ప్రారంభించే ముందు కేశంపేట పాదయాత్ర శిబిరం వద్ద బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు.

పాలమూరు ప్రజలంతా ఒక్కటై... 27 రోజుల పాటు పాదయాత్రను విజయవంతం చేశారని.. నిన్ననే రంగారెడ్డి జిల్లాలో అడుగుపెట్టామని.. ఇక్కడి ప్రజల ఆదరణ చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని సంజయ్ అన్నారు. ప్రజల స్పందన చూస్తుంటే టిఆర్ఎస్ పార్టీపై ఎంత వ్యతిరేకంగా ఉన్నారో స్పష్టంగా అర్థం అవుతోందన్నారు సంజయ్. అనేక సమస్యలతో ప్రజలంతా సతమతమవుతున్నారని పేర్కొన్నారు. లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ ను పూర్తి చేస్తానని హామీ ఇచ్చిన కేసీఆర్ ఇప్పటివరకు దాన్ని పూర్తి చేయలేదన్నారు. కావాలనే ఈ ప్రాంతంలో వ్యవసాయం పట్ల కేసీఆర్ నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు.

నీళ్లిస్తే... వాళ్ళ రియల్ ఎస్టేట్ దందా నడవదనే కేసీఆర్ సర్కారు ఇక్కడి ప్రజలకు అన్యాయం చేస్తోందన్నారు. పంట పొలాలు ఎండి పోయి బీడు వారితే.. వాటిని రియల్ ఎస్టేట్ కోసం కొనుక్కుని, డబ్బులు దండుకోవాలని కుట్ర చేస్తున్నారని సంజయ్ ఆరోపించారు. రైతుల దగ్గర భూములను వేలకు కొని, కోట్లకు అమ్ముకోవాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు.

"ఇక్కడి రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయి. నన్ను మోకాళ్ల మీద నడవాలన్న వారికి సవాల్ చేస్తున్నా. కేసీఆర్ కు చేతనైతే కాకునూర్ నుంచి కేశంపేట్ వరకు మందు నడిచి రావాలి"
-బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు

స్థానికులకు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదని.. కేసీఆర్ మాత్రం తన ఇంటికి 5 ఉద్యోగాలిచ్చుకున్నడని సంజయ్ విరుచుకుపడ్డారు. కనీసం ఈ ప్రాంతంలో R.O.Bని ఇప్పటి వరకు పూర్తి చేయలేదన్నారు. విద్య, వైద్యం సహా అనేక రంగాల్లో ఇక్కడి ప్రజలు సమస్యలతో తల్లడిల్లుతున్నారని వాపోయారు.

ఇక్కడ గుంట జాగా కొనాలన్నా.. అమ్మాలన్నా పర్మిషన్ తీసుకోవడానికి వాళ్లకు పైసలు ఇవ్వాల్సిందేనని.. అన్ని వర్గాలను, అన్ని రంగాలను ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని బండి ఆరోపించారు. సీఎంవోకు రంగారెడ్డి జిల్లా నుంచి పొట్టు పొట్టు కమిషన్లు పోతున్నాయని.. అన్ని చోట్ల కేసీఆర్‌కు కమిషన్లేనని ఆరోపించారు బండి.

"ఇప్పటివరకు విలేఖరులకు కూడా న్యాయం చేయలేదు. విలేఖరులను చూస్తే బాధేస్తోంది. విలేఖరులకు ఇచ్చిన హెల్త్ కార్డులు పనిచేయవు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సంగతి అంతే. బీజేపీ ప్రభుత్వం వస్తే విలేకరులను ఆదుకుంటాం. వారి సమస్యలను పరిష్కరిస్తాం. మా నరేంద్ర మోడీ నేతృత్వంలో ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. వచ్చేది బీజేపీ ప్రభుత్వమే." -బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు

Aslo Read - 

Also Read - 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News