T Congress: టీ కాంగ్రెస్‌ మహిళా చీఫ్‌ పదవి.. ఆమెకే కన్‌ఫర్మ్‌

CM Revanth Reddy: తెలంగాణ కాంగ్రెస్‌లో కొలువుల జాతర నడుస్తోంది. రేపోమాపో ఆరుగురు కొత్త మంత్రులు రాబోతున్నారు. వీటితో పాటు.. నామినేటేడ్‌ పోస్టులను భర్తీ చేస్తామని అంటున్నారు. అంతేకాదు కొత్తగా మహిళా చీఫ్‌ను కూడా నియమిస్తారని చెబుతున్నారు. అయితే మహిళా చీఫ్ రేసులో ఉన్న నేతలెవరు..! సునీతారావునే కంటిన్యూ చేస్తారా.. లేదంటే కొత్త ముఖానికి అవకాశం కల్పిస్తారా..!

Written by - G Shekhar | Last Updated : Nov 26, 2024, 06:16 PM IST
T Congress: టీ కాంగ్రెస్‌ మహిళా చీఫ్‌ పదవి.. ఆమెకే కన్‌ఫర్మ్‌

CM Revanth Reddy: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతోంది. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటయ్యి ఏడాది పూర్తయిన సందర్బంగా విజయోత్సవ సభలను సర్కార్ నిర్వహిస్తోంది. అంతేకాదు.. ఇన్నాళ్లు పార్టీ కోసం కృషి చేస్తున్న నేతలకు పదవులు సైతం ఇచ్చేందుకు సర్కార్‌ రెడీ అయ్యింది. ఇప్పటికే 37 మంది నేతలకు నామినేటెడ్‌ పోస్టులను కేటాయించారు. రేపోమాపో మరో 50 నుంచి 100 నేతలకు నామినేటేడ్‌ పోస్టులు కేటాయిస్తారని చెబుతున్నారు. అటు పార్టీకి కూడా కొత్త ప్రెసిడెండ్‌ వచ్చారు. చాలారోజుల తర్వాత పార్టీకి కొత్త చీఫ్‌గా మహేష్‌ కుమార్‌ గౌడ్‌ను నియమించారు. అయితే పార్టీ చీఫ్‌ పదవి చేపట్టడమే ఆలస్యం.. పార్టీలో అన్ని పదవులను భర్తీ చేయాలని టీపీసీసీ చీఫ్‌ నిర్ణయించారు. ఈ నేపథ్యంలో కొత్తగా మహిళా కాంగ్రెస్‌ చీఫ్‌ పదవి ఎవరికి ఇస్తారనేది కీలకంగా మారింది.

ప్రస్తుతం రాష్ట్ర మహిళా చీఫ్‌గా సునీతా రావు ఉన్నారు. ఆమె పదవి కాలం పూర్తయి దాదాపు 5 నెలలు దాటింది. అయినప్పటికీ ఆమెనే కంటిన్యూ అవుతున్నారు. అయితే పార్టీకి కొత్త ప్రెసిడెంట్‌ వస్తారని చాలారోజులుగా ప్రచారం జరిగింది. కానీ.. కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా పార్టీ ప్రెసిడెంట్‌ నియామకంపై టీపీసీసీ ఫోకస్ పెట్టడంతో మహిళా నేతలు కూడా అలర్ట్ అయినట్టు తెలుస్తోంది. ఇప్పటికే కొందరు నేతలు మహిళా చీఫ్‌ పదవిని దక్కించుకునేందుకు ఢిల్లీలో లాబీయింగ్ కూడా చేస్తున్నట్టు సమాచారం. అటు సునీతారావు కూడా తనను మరోసారి కంటిన్యూ చేయాలని చెప్పినట్లు తెలుస్తోంది. తాను పార్టీ అధ్యక్షురాలిగా ఉన్న సమయంలో అనేక పోరాటాలు చేసినట్టు గుర్తు చేస్తున్నారు. అంతేకాదు తనపై దాదాపు 10కి పైగా కేసులు కూడా ఉన్నట్టు ఆమె చెబుతున్నారట. పార్టీ కష్టకాలంలో ఎన్నొ ఒడిదుడుకులు ఎదుర్కొన్న తనకు మళ్లీ చాన్స్ ఇవ్వాలని కోరుతున్నారట. ఒకవేళ నామినేటెడ్‌ పోస్టు ఇవ్వని పక్షంలో నామినేటెడ్‌ పోస్టు అయినా ఇవ్వాలని పార్టీ పెద్దలను కోరినట్టు సమాచారం. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహల్‌ అసెంబ్లీ టికెట్ ఇచ్చినా.. సునీతారావు గెలవలేక పోయారని మరికొందరు నేతలు గుర్తు చేస్తున్నట్టు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే గద్వాల కాంగ్రెస్ ఇంచార్జ్‌, మాజీ జడ్పీ చైర్మన్ సరితా తిరుపతయ్య కూడా తనకు ఓ అవకాశం ఇవ్వాలని కోరుతున్నారట. అయితే సరితా తిరుపతయ్యది సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా కావడం, బీసీ సామాజికరవర్గానికి చెందిన నేత కావడంతో అధిష్టానం పెద్దలు ఆమె పేరును పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో జోగులాంబ గద్వాల నుంచి పోటీచేసిన సరితా తిరుపతయ్య సిట్టింగ్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి చేతిలో స్వల్ప ఓట్ల తేడాతో విజయం సాధించారు. మొన్నటివరకు నామినేటేడ్‌ పోస్టుకోసం ప్రయత్నించినా సరితా.. మహిళా చీఫ్ పదవి ఇస్తే పార్టీని ముందుకు నడిస్తానని చెప్పినట్టు తెలిసింది. హైకమాండ్ పెద్దలు కూడా సరితా అయితేనే పార్టీకి మరింత లాభం జరుగుతుందని భావిస్తున్నారట. మరోవైపు ఓసీ లీడర్లు కూడా పార్టీ చీఫ్ పదవి  రేసులో ముందున్నారట. ఓసీలకు అవకాశం కల్పిస్తే బడంగ్‌ పేట మేయర్‌ పారిజాత నరిసింహారెడ్డి తన పేరును పరిశీలించాలని కోరుతున్నట్టు సమాచారం..

మరోవైపు ఈ ముగ్గురు నేతలే కాదు.. మరికొందరు లీడర్లు కూడా తమ పేరును పరిశీలించాలని హైకమాండ్‌ను కోరుతున్నట్టు గాంధీభవన్ వర్గాలు అంటున్నాయి. అయితే మహిళా చీఫ్‌ విషయంలో మాత్రం పార్టీ పెద్దలు ఆచీతూచీ అడుగులు వేస్తున్నట్టు సమచారం. త్వరలోనే రాష్ట్రంలో స్థానిక సంస్థలు ఎన్నికలు జరగబోతున్నాయి. వీటితో పాటు గ్రేటర్ హైదరాబాద్‌లోనూ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ సమయంలో మహిళా ఓటర్లు కీలకమని అధికార పార్టీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో సరైనా నేతకే మహిళా చీఫ్‌ పదవిని ఇస్తే.. పార్టీకి మరింత బూస్ట్‌ అవుతుందని పార్టీ పెద్దల ఆలోచనగా ఉందట. ఏదీఏమైనా పార్టీ మహిళా చీఫ్‌ ఎంపికలో గొడవలకు తావులేకుండా.. అందరి సలహాలు, సూచనలే మేరకే సదరు నేతలను ప్రకటించే అవకాశం ఉందని గాంధీ భవన్ వర్గాలు అంటున్నాయి.!

Also Read: CM REVANTH REDDY: రేవంత్ స్పీడ్‌.. సొంత పార్టీ లీడర్లకు బ్రేక్‌!

Also Read:  PAWAN KALYAN: పవన్‌కళ్యాణ్‌.. ఓ గేమ్‌ చేంజర్‌.. నెక్ట్స్‌ ఢిల్లీనేనా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x