PAWAN KALYAN: పవన్‌కళ్యాణ్‌.. ఓ గేమ్‌ చేంజర్‌.. నెక్ట్స్‌ ఢిల్లీనేనా!

PAWAN KALYAN: జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ గేమ్‌ చేంజర్‌ అయ్యారా..! మహారాష్ట్రలో పవన్‌ కల్యాణ్‌ ప్రచారం కారణంగానే బీజేపీ అభ్యర్ధులు భారీ విజయాన్ని నమోదు చేశారా..! ఇకమీదట పవన్‌ కల్యాణ్‌ సేవలకు విస్తృతంగా వాడుకోవాలని కమలం పార్టీ యోచిస్తుందా..! త్వరలో పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. అక్కడ కూడా పవన్‌ సేవలను వాడుకోనేందుకు కమలం పార్టీ కసరత్తు చేస్తోందా..!

Written by - G Shekhar | Last Updated : Nov 26, 2024, 05:46 PM IST
PAWAN KALYAN: పవన్‌కళ్యాణ్‌..  ఓ గేమ్‌ చేంజర్‌.. నెక్ట్స్‌ ఢిల్లీనేనా!

PAWAN KALYAN:  మహారాష్ట్రలో ఎన్డీయే కూటమి తిరుగులేని విజయాన్ని నమోదు చేసింది. మరోసారి కమలం పార్టీ తమ అధికారాన్ని నిలబెట్టుకుంది. ఇక మహారాష్ట్రలో బీజేపీ విజయం వెనుక కీలకపాత్ర పోషించారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో 21 అసెంబ్లీ సీట్లు, రెండు లోక్‌ సభ  స్థానాల్లో  పోటీచేసి అన్ని చోట్ల సక్సెస్‌ అయ్యారు. అదే రిజల్స్‌ను మహారాష్ట్రలో సైతం రిపీట్‌ చేశారు పవన్ కల్యాణ్‌. అయితే ఇక్కడ ఓ చిన్న తేడా వుంది. ఏపీలో పోటీ చేసి గెలిస్తే… మహారాష్ట్రలో ప్రచారం చేసి గెలిచారు. ఆయన మహారాష్ట్రలో చేసిన  ప్రచారం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.  పవన్‌  ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ తరుపున రెండు రోజుల పాటు ప్రచారం ప్రచారం చేశారు. అక్కడ  రోడ్ షోలు, బహిరంగ సభలు నిర్వహించారు.  పూణే కంటోన్మెంట్, బల్లార్‌పూర్, డెగ్లూర్, షోలాపూర్, లాతూర్‌లల్లో పవన్ కల్యాణ్ ప్రచారం చేశారు. తెలుగు వాళ్లు పెద్ద సంఖ్యలో నివసించే వారి ఓట్లే లక్ష్యంగా ప్రచారం సాగింది. పవన్‌ ప్రచారం చేసిన నియోజవర్గాల్లోని బీజేపీ అభ్యర్ధులు అందరూ గెలిచి సక్సెస్‌ కొట్టారు.

ఇదిలా ఉంటే.. ఏపీలో పవన్ కల్యాణ్‌కు ప్రధానమోడీ అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రధాని మోడీ వచ్చినప్పుడల్లా ఆయ‌న ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు త‌గిన ఎలివేష‌న్లు ఇస్తుంటారు. గతంలో ప్రధాని మోడే స్వయంగా తుఫాన్ అంటూ పవన్‌ కల్యాణ్‌ను పొగడటంతోనే ఎంత క్రేజ్‌ ఉందో అర్థమవుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే ఫోన్ చేసి మరి మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి పంపించారని చెబుతారు. అందుకే ప‌వ‌న్ క్రేజ్‌ను నార్త్ లోనూ వాడుకోవాల‌న్నది మోడీ ఆలోచ‌న‌గా ఉన్నట్టు తెలుస్తోంది. మ‌హారాష్ట్ర ఎన్నిక‌ల్లో ప‌వ‌న్‌ను రంగంలోకి దించ‌డానికి కార‌ణం అదేనని చెబుతున్నారు. అయితే బీజేపీకి ప‌వ‌న్ ను బ్రాండ్ అండాసిడ‌ర్ గా మార్చే ప్రయ‌త్నంలో మోడీ ఓర‌కంగా స‌క్సెస్ అయ్యారు. త్వర‌లో రాబోయే ఎన్నిక‌ల్లో కూడా బీజేపీ త‌ర‌పున ప్రచారం కోసం ప‌వ‌న్ ని రంగంలోకి దింపే ఆలోచ‌న ఆయ‌న‌కు ఉందని తెలుస్తోంది. ఇప్పటికైతే మ‌హారాష్ట్ర ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ త‌న మానియా చూపించ‌గ‌లిగాడు. ఆంధ్రాలో ఎలాగైతే 100 శాతం స్ట్రయిక్ రేట్ తో జ‌న‌సేన‌ని గెలిపించాడో, అలానే మ‌హారాష్ట్రలోనూ తాను ప్రచారం చేసిన ప్రతీ చోటా బీజేపీ జెండా ఎగ‌రేసేలా చేశారని జనసైనికులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇక వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. అక్కడ కూడా పవన్‌ కల్యాణ్‌ను రంగంలోకి దింపాలని ప్రధాని మోడీ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. గత దశాబ్ధాకాలంగా ఢిల్లీ పీఠంపై కూర్చునేందుకు కమలం పార్టీ తెగ ప్రయత్నాలు చేస్తోంది. దేశమంతా బీజేపీ విజయం సాధిస్తున్నా.. ఢిల్లీలో పాగా వేయలేకపోతున్నామని బీజేపీ పెద్దలు తెగ మదనపడి పోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఓసారి పవన్ కల్యాణ్‌ను ప్రచారంలోకి దింపాలని యోచిస్తున్నారట. అంతేకాదు.. వచ్చే ఏడాది తమిళనాడులోనూ అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. అక్కడ సైతం పవన్ కల్యాణ్‌ను రంగంలోకి దింపేసి డీఎంకే పార్టీకి అధికారాన్ని దూరం చేయాలని భావిస్తున్నారట. తమిళనాడులో తెలుగు ఓటర్లు భారీగానే ఉన్నారు. వారిని ఆకట్టుకుంటే చాలు.. ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపించవచ్చని పార్టీ పెద్దలు అంచనా వేస్తున్నట్టు తెలుస్తోంది.

మొత్తంగా సనాతన ధర్మం పేరుతో యావత్ హిందూవులను తనవైపు తిప్పుకున్న పవన్‌ కల్యాణ్‌.. ఇటీవల తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలోనూ పెద్ద పోరాటమే చేశారు. పవన్‌ కల్యాణ్‌ పోరాటం కారణంగానే ఈ కేసు సుప్రీంకోర్టు చేరింది. త్వరలోనే సిట్ విచారణ పూర్తయ్యి.. నివేదిక రాబోతోంది. అయితే తిరుమల విషయంలో పవన్‌ పోరాట స్పూర్తి సైతం ఢిల్లీ పెద్దలను తెగ ఆకట్టుకుందని పార్టీ నేతలే అంటున్నారు. అందుకే కమలం పార్టీ పెద్దలు పవన్‌కల్యాన్‌కు సొంత పార్టీ లీడర్లకు కూడా ఇవ్వనంతా ప్రాధాన్యత ఇస్తున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీకి ప్యూచర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణే అన్న ప్రచారం సైతం జరుగుతోంది. చూడాలి మరి రానున్న రోజుల్లో పవన్‌ కల్యాణ్‌ సేవలను కమలం పార్టీ మరెంత విస్తృతం చేస్తుందో..!

Also Read: Adani Group Stocks: అదానీ గ్రూప్‌కు మరో బిగ్‌ షాక్‌...ఆ 7 కంపెనీలు ఏం చేశాయో తెలుసుకుంటే మైండ్ బ్లాక్!   

Also Read: Pawan Kalyan: ఎక్కడున్న తాటతీస్తాం..?.. రామ్ గోపాల్ వర్మ వివాదంపై సంచలన వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్..  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News