Telangana SSC Results 2024: పదో తరగతి పరీక్షల వాల్యుయేషన్ ఏప్రిల్ 3 నుంచి, ఫలితాలు ఎప్పుడంటే

Telangana SSC Results 2024: తెలంగాణలో పదో తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. మరో రెండ్రోజుల్లో పూర్తి కాగానే వాల్యుయేషన్ ప్రక్రియ ప్రారంభమౌతుంది. గత ఏడాది కంటే ఈసారి త్వరగా ఫలితాలు వెల్లడి కావచ్చని తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 31, 2024, 10:57 PM IST
Telangana SSC Results 2024: పదో తరగతి పరీక్షల వాల్యుయేషన్ ఏప్రిల్ 3 నుంచి, ఫలితాలు ఎప్పుడంటే

Telangana SSC Results 2024: పదో తరగతి పరీక్షా ఫలితాలను త్వరలో విడుదల చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. మరో రెండ్రోజుల్లో తెలంగాణలో పదో తరగతి పరీక్షలు పూర్తి కానున్నాయి. ఏప్రిల్ 3 నుంచి పరీక్ష పత్రాల వాల్యుయేషన్ జరుగుతుంది. ఈసారి ఫలితాలు గతంతో పోలిస్తే కాస్త ముందుగా విడుదల కావచ్చు. 

మార్చ్ 18వ తేదీన ప్రారంభమైన తెలంగాణ పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ 2 వరకూ జరగనున్నాయి. తెలంగాణలో 5.08 లక్షలమంది విద్యార్ధులు పరీక్షలు రాస్తున్నారు. వీరిలో బాలురు 2,57,952 మంది కాగా, బాలికలు 2,50,433 మంది ఉన్నారు. మొత్తం 2,676 పరీక్షా కేంద్రాలు ఏర్పాటయ్యాయి. ఏప్రిల్ 2న పరీక్షలు ముగిశాక, ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 11 వరకూ పరీక్ష పత్రాల వాల్యుయేషన్ ఉంటుంది. 11 జిల్లాల్లోని 19 కేంద్రాల్లో పరీక్షా పత్రాల మూల్యాంకనానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. కేవలం 9 రోజుల్లో వాల్యుయేషన్ ప్రక్రియ పూర్తి చేసేందుకు తగిన ప్రణాళిక సిద్ధం చేసింది. గత ఏడాది పదో తరగతి పరీక్ష ఫలితాలు ఏప్రిల్ 3 నుంచి ప్రారంభమై ఏప్రిల్ 13 వరకూ జరిగాయి. మే 10వ తేదీన అంటే దాదాపు నెలరోజుల తరువాతే ఫలితాలు వెల్లడయ్యాయి. కానీ ఈసారి మార్చ్ 18న ప్రారంభమయ్యాయి. ఈసారి పరీక్ష ఫలితాలను ఏప్రిల్ ముూడో వారంలో విడుదల చేయవచ్చని తెలుస్తోంది. 

తెలంగాణ పదో తరగతి పరీక్ష ఫలితాలను తెలంగాణ ఎస్ఎస్‌సి అధికారిక వెబ్‌సైట్ https://bse.telangana.gov.in/ ఓపెన్ చేసి మీ హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ నమోదు చేసి తెలుసుకోవచ్చు. 

Also read:: AP TET & DSC Exams: టెట్ ఫలితాలు, డీఎస్సీ నిర్వహణకు ఈసీ అనుమతి లభించేనా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

FacebookTwitterసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

Trending News