గజ్వేల్ లో కేసీఆర్ కు ప్రతికూలంగా మారిన అంశాలు ఇవే ...

ఓడలు మేడలు ..మేడలు ఓడలు అవుతాయని చెబుతుంటారు. ఈ సామెత కచ్చితంగా రాజకీయాలకు..రాజకీయ నేతలకు వర్తిస్తుంది.  మహామహులే ఏదో ఒక రోజు ఓటమి రుచి చూడాల్సి వచ్చింది. ఇందులో కేసీఆర్ కు మినహాయింపు ఉండదు కదా..

Last Updated : Nov 13, 2018, 05:25 PM IST
గజ్వేల్ లో కేసీఆర్ కు ప్రతికూలంగా మారిన అంశాలు ఇవే ...

తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల ఎన్నికలు ఒక ఎత్తయితే ఆపధార్మ ముఖ్యమంత్రి  కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్ ఎన్నికలు ఒక ఎత్తు. ఈ సారి గజ్వేల్ లో కేసీఆర్ కు ఓటమి తప్పదనే పుకార్లు వినిపిస్తున్న నేపధ్యంలో అందరి దృష్టి దీనిపై పడింది. గజ్వేలులో కేసీఆర్ పై  రాష్ట్ర స్థాయిలో పేరున్న గట్టి ప్రత్యర్ధి ఎవరైనా పోటీ చేస్తున్నారా ? అంటే అదీ లేదు.. స్థానికంగా మంచి పేరున్న ఓ సాధారణ నేతే బరిలో ఉన్నారు ... అయితే ఒంటి చేత్తో తెలంగాణలో అధికారం సాధించిన కేసీఆర్ కు ఎందుకు ఇంతటి గడ్డు పరిస్థితి ఏర్పడింది ?  అనే ప్రశ్న ఉత్పన్నమౌతుంది కదూ.. అయితే వివరాల్లోకి వెళ్లండి మీకే అర్థమౌతుంది

కనుసైగలతో శాసించిన నేతకు ఎందుకీ పరిస్థితి ?

ఒకే ఒక్క సెంటిమెంట్ అస్త్రంతో  తెలంగాణలో దశాబ్దాల తరపడి పాతుకుపోయిన కాంగ్రెస్, బీజేపీ , టీడీపీలను మట్టికరిపించి 2014 లో కేసీఆర్ నేతృత్వంలో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. కేసీఆర్  సొంత ఇమేజ్ తోనే ఈ స్థాయిలో మోజార్టీ దక్కిందనడంలో ఎలాంటి సందేహం లేదు. దీన్ని విమర్శకులు సైతం అంగీకరిస్తారు. అంతటి పేరు ప్రఖ్యాతలు ఉన్న కేసీఆర్ పై పోటీ చేసేందుకు చిన్న చితకా నేతలు ఎందుకు పోటీ పడుతున్నారు.. అసలు కేసీఆర్ కు తన నియోజకవర్గంలో ఎందుకు ఇలాంటి గడ్డుపరిస్థితి ఏర్పడింది అంటే... కర్నుడి చావుకు సవాలక్ష కారాణాలు ఉన్నట్లు కేసీఆర్ కు సొంత నియోజకవర్గంలో ప్రతికూల పరిస్థితి ఏర్పడటానికి అనేక కారణాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు ఒక్కసారి పరిశీలిద్దాం...

కేసీఆర్ కు ప్రతికూలంగా మారిన అంశాలు :

* గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించాలనే విమర్శలు 

* ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత కేసీఆర్ గజ్వేల్ లో అంతగా పర్యటించక పోవడం

* సొంత నియోజకవర్గ  ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండరనే విమర్శ

*  జనాలకు నిత్యం అందుబాటులో ఉంటారనే పేరున్న ఓంటేరు ప్రతాప్ రెడ్డి పోటీ చేయడం

*  కాంగ్రెస్, టీడీపీ అభ్యర్ధులు ఏకవడంతో ఆయా పార్టీల సాప్రదాయ ఓటింగ్ కేసీఆర్ కు మైనస్ పాయింట్

*  బద్ధశత్రువులుగా ఉన్న నర్సారెడ్డి, ప్రతాప్ రెడ్డి ఏకమవడం

*  కుల సమీకరణాలు కాంగ్రెస్ కు అనుకూలం ఉండటం

* స్వతంత్య అభ్యర్ధిగా గద్దర్ పోటీతో తెలంగాణ సెంటిమెంట్ ఓట్లు చీలే ప్రమాదం

గెలుపోటములపై ఉత్కంఠత..

కేసీఆర్ కు ప్రతికూల వాతావరణం నెలకొనడానికి అనేక కారణాలు ఉన్నప్పటికీ ఇవే ప్రధాన కారణాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ సవాళ్లను అధిగమిస్తే కానీ కేసీఆర్ కు ఇక్కడ విజయం దక్కని పరిస్థితి. కాగా రాజకీయల్లో ఎత్తుకు పైఎత్తులు వేడయంలో దిట్టగా పేరున్న కేసీఆర్ తన మందున్న సవాళ్లను  అధిగమించడం పెద్ద కష్టమేని కాదని టీఆర్ఎస్ వర్గాలు అభిప్రాయడుతున్నాయి. భిన్నాభిప్రాయాల నడుమ గజ్వేల్ గెలుపు ఓటములపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది.

 

 

Trending News