ట్రంప్ కూతురు కళ్లన్నీ.. ఆ గాజులపైనే

  

Last Updated : Nov 11, 2017, 08:10 PM IST
ట్రంప్ కూతురు కళ్లన్నీ.. ఆ గాజులపైనే

ఈ నెలాఖారున హైదరాబాద్ నగరాన్ని సందర్శించడానికి  వస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా కళ్లన్నీ ఇప్పడు లాడ్ బజారులో దొరికే గాజులపైనే ఉన్నాయట. ఎవరో చెబితే వాటి గురించి తెలుసుకున్న ఆమె తన పర్యటనలో భాగంగా లాడ్ బజారును కూడా  సందర్శించే అవకాశం ఉందని పలువురు అమెరికా అధికారులు తెలిపారు. "గ్లోబల్ ఎంట్రప్రెన్యూర్‌షిప్ మీట్"లో పాల్గొనడానికి వస్తున్న ఆమె చార్మినార్, చౌమహల్లా ప్యాలెస్, ఫలక్ నామా ప్యాలెస్ కూడా సందర్శిస్తున్నారు. అయితే సెక్యూరిటీ క్లియరెన్సు బట్టి ఆమె ఇంకా ఏ ఏ ప్రాంతాలను సందర్శించాలని భావిస్తున్నారో ఇంకా పూర్తిగా తెలియరాలేదు. హైదరాబాద్‌లోని వెస్టిన్ హోటల్‌లో బస చేయనున్న ఆమె తెలంగాణ సీఎం కేసీఆర్ గోల్కొండ ఫోర్టులో అందించే విందుకు కూడా హాజరు కానున్నారని వినికిడి. అలాగే ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఇవాంకాకు ఫలక్ నామా ప్యాలెస్‌లో ప్రత్యేకంగా విందుకు ఆహ్వానిస్తున్నారు. 

Trending News