తనపై వచ్చిన ఫన్నీ ట్రోల్స్, ఫొటోలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా చాలా హుందాగా స్పందించారు. అయితే ఆమె ట్వీట్‌పై స్పందించిన సాయిధరమ్ తేజ్‌ను ట్రోల్ చేస్తున్నారు.
భారత పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బస చేసేందుకు భారత ప్రభుత్వం ఢిల్లీలోని సర్దార్ పటేల్ మార్గ్‌లో ఉన్న ఐటిసి మౌర్య హోటల్లో సూట్ ఏర్పాటు చేసింది. ది గ్రాండ్ ప్రెసిడెన్షియల్ సూట్ లేదా చాణక్య సూట్ పేరుతో పిలుచుకునే ఈ సూట్ ప్రత్యేకతలు ఏంటి ? ఇప్పటివరకు ఎంత మంది అమెరికా అధ్యక్షులు ఈ సూట్లో బస చేశారు ? అమెరికా అధ్యక్షుడు బస కోసం ఏర్పాటు చేసిన ఈ సూట్ కోసం రోజుకు ఎంత ఖర్చు అవుద్ది ? ఐటిసి మౌర్య హోట్లలోని ఎన్నో అంతస్తులో ఈ సూట్ ఉందనే వివరాలు తెలియాలంటే ఈ డీటేల్ట్ స్టోరీ వీడియో చూడాల్సిందే.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనలో ఆయన సతీమణి మెలానియా ట్రంప్, కుమార్తె ఇవాంకా ట్రంప్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మెలానియ, ఇవాంక ఎక్కడికెళ్తే.. అక్కడ వాళ్లను చూసేందుకు స్థానికులు ఆసక్తి ప్రదర్శించారు. ఇంతకీ డొనాల్డ్ ట్రంప్ జీవితంలోకి వచ్చిన మెలానియ ట్రంప్ ఎవరు ? ఎప్పుడు, ఎలా ట్రంప్ జీవితంలో ఆమె ఓ భాగమయ్యారు ? సవతి తల్లి అయిన మెలానియా ట్రంప్‌కి, కూతురు ఇవాంకా ట్రంప్‌కి మధ్య ఎలాంటి సంబంధం ఉంది ? ఇవాంక ట్రంప్ ప్రత్యేకతలు ఏంటి ? ఎందుకు ఇవాంకకు అంత భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ? నలుగురు పిల్లల తల్లి అయిన ఇవాంక గ్లామర్ సీక్రెట్ ఏంటనే అనేక సందేహాలకు సమాధానమే ఈ సింగిల్ వీడియో. ఇంకెందుకు ఆలస్యం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన సతీమణి మెలానియా ట్రంప్, కూతురు ఇవాంక ట్రంప్, అల్లుడు జేర్డ్ కుష్నర్ తాజ్ మహల్‌ను పర్యటించి ఆ చారిత్రక కట్టడం గురించి అడిగి తెలుసుకున్నారు. తాజ్ మహల్‌ను ఎవరు నిర్మించారు, తాజ్ మహల్ డిజైనర్ ఎవరు ? తాజ్ మహల్ నిర్మాణంలో ఎంత మంది పాల్గొన్నారు లాంటి ప్రశ్నలను అడగకుండా ఉండలేకపోయారు. తన పిల్లలను తీసుకువచ్చుంటే వాళ్లు కూడా తాజ్ మహల్ అందాలను చూసుండే వాళ్లని.. కానీ వాళ్లను తీసుకురాకపోవడం వల్ల వాళ్లు ఆ ఛాన్స్ మిస్ అయ్యారని ఇవాంక ట్రంప్ చెప్పినట్టుగా వారికి గైడ్‌గా వ్యవహరించిన వాళ్లు చెబుతున్నారు. డొనాల్డ్ ట్రంప్ తాజ్ మహల్ పర్యటన విశేషాలకు సంబంధించిన మరింత సమాచారం
అమెరికా అధ్యక్షుడు చేపట్టిన భారత పర్యటన పాకిస్తాన్‌ను షేక్ చేస్తుందా ? నమస్తే ట్రంప్ కార్యక్రమం వేదికపై నుంచి భారతీయులను అక్కున చేర్చుకునేలా అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రసంగం పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టిస్తుందా అంటే అవుననే అనిపిస్తోంది. భారత్‌లో తమకు అందిన ఆతిథ్యం, తమపై చూపిన అనురాగం ఎప్పటికీ మరువలేనిదని.. ఇకపై భారతీయులను అమెరికా ఎప్పటికీ మర్చిపోదు అని డొనాల్డ్ ట్రంప్ చేసిన అటు ప్రసంగం అమెరికన్లను, ఇటు భారతీయులను ఆకట్టుకునేలా ఉండగా.. పాకిస్తాన్‌కు మాత్రం కచ్చితంగా మింగుడుపడే అవకాశమే లేదు. అమెరికా-భారత్ మధ్య సంబంధాలు మరింత బలపడేలా ట్రంప్ ఏమన్నారో ఈ వీడియోలో మీరే
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు నమస్తే ట్రంప్ వేదికపై మైక్ అందుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. కన ప్రసంగం ఆరంభంలోనే మోదీకి తనదైన స్టైల్లో కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని మోదీని ఛాంపియన్‌గా, అమెరికాకు, తనకు నిజమైన స్నేహితుడిగా అభివర్ణించిన డొనాల్డ్ ట్రంప్.. తనను భారత్‌కి ఆహ్వానించి ఘన స్వాగతం పలికినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను 'నమస్తే ట్రంప్' వేదికపైకి స్వాగతం పలుకుతూ ప్రధాని మోదీ స్పీచ్ ఇచ్చారు. అంతకంటే ముందుగా నమస్తే ఈవెంట్‌కి హాజరైన వారిని ఉద్దేశించి 10 నిమిషాల పాటు ప్రసంగించిన ప్రధాని మోదీ.. డొనాల్డ్ ట్రంప్ ఉపన్యాసం తర్వాత ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరోసారి ప్రసంగిస్తానని అన్నారు.
వీడియో: ఎయిర్ పోర్ట్ నుంచి ప్రారంభమైన ప్రధాని మోదీ- డొనాల్డ్ ట్రంప్ రోడ్ షో, ప్రధాని నరేంద్ర మోదీ- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రోడ్ షో ప్రారంభమైంది.
అహ్మెదాబాద్ చేరుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కి భారత ప్రధాని నరేంద్ర మోదీ ఎదురెళ్లి ఘన స్వాగతం పలికారు. అమెరికా నుంచి ప్రత్యేక విమానంలో అహ్మెదాబాద్‌లోని సర్దార్ వల్లభభాయ్ పటేల్ విమానాశ్రయానికి చేరుకున్న డొనాల్డ్ ట్రంప్‌ని ఆత్మీయ ఆలింగనం చేసుకుని మిత్రుడికి సాదర స్వాగతం పలికారు. ట్రంప్ సతీమణి మెళానియా ట్రంప్‌కు చేయి చాయి షేక్ హ్యాండ్ ఇచ్చి భారత గడ్డపైకి స్వాగతించారు. అనంతరం విమానాశ్రయంలో ఆయన రాకకోసం వేచిచూస్తున్న భారత ప్రతినిధుల బృందాన్ని ప్రధాని మోదీ ఆయనకు పరిచయం చేస్తూ వెళ్లారు. అక్కడి నుంచి ట్రంప్ తన బీస్ట్ కారు ఎక్కి కూర్చోగా.. ప్రధాని మోదీ తన కాన్వాయ్‌లో రోడ్ షోగా బయల్దేరారు.
"అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సలహాదారుగా ఉన్న ఇవాంకా ట్రంప్ పాల్గొంటున్న సదస్సులో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉండగా.. అక్కడికి మోదీ వెళ్లవలసిన అవసరం ఏముంది?" అంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఆనంద్ శర్మ ప్రశ్నించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.