Kishan Reddy: ఢిల్లీ నడిబొడ్డున తెలంగాణ పరువు తీశారు.. ఎమ్మెల్సీ కవితపై కిషన్ రెడ్డి ఫైర్

Kishan Reddy Fires On BRS MLC Kalvakuntla Kavitha: మద్యం స్కామ్‌లో చిక్కుకుని ఢిల్లీ నడిబొడ్డున తెలంగాణ పరువు తీశారని కిషన్ రెడ్డి విమర్శించారు. అక్రమంగా వ్యాపారం చేసి తల దించుకునేలా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా రిజర్వేషన్ల గురించి అడిగే నైతిక హక్కు ఉందా..? అని ప్రశ్నించారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 9, 2023, 05:06 PM IST
Kishan Reddy: ఢిల్లీ నడిబొడ్డున తెలంగాణ పరువు తీశారు.. ఎమ్మెల్సీ కవితపై కిషన్ రెడ్డి ఫైర్

Kishan Reddy Fires On BRS MLC Kalvakuntla Kavitha: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. కల్వకుంట్ల కుటుంబం ప్రతినిధులు దశల వారీగా ప్రెస్‌మీట్లు పెడుతూ.. తాము నీతి మంతులమని  చెప్పుకుంటున్నారని అన్నారు. తెలంగాణ సమాజం ఢిల్లీలో మద్యం వ్యాపారం చేయమని చెప్పిందా..? అని ప్రశ్నించారు. తెలంగాణ ఆడబిడ్డలు మద్యం వ్యాపారం చేయమని అడిగారా..? అని నిలదీశారు. ఢిల్లీ నడిబొడ్డున తెలంగాణ పరువు తీశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడంపై కిషన్ రెడ్డి ఢిల్లీలో ప్రెస్‌మీట్ నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'అక్రమంగా వ్యాపారం చేసి తల దించుకునేలా చేశారు. లిక్కర్ వ్యాపారంలో ఎక్కడా కూడా రాజకీయ నాయకురాలి పేరు కనబడలేదు. తెలంగాణలో మద్యం వ్యాపారం ద్వారా.. ప్రజలను అనారోగ్యానికి గురి చేస్తున్నారు. మద్యాన్ని ప్రధాన అదాయంగా పెట్టుకున్నారు. అన్నాచెల్లెలు ఇద్దరు అబద్దాలు మాట్లాడారు. మహిళా రిజ్వేషన్ల కోసం ధర్నా చేస్తున్నందుకు ఈడీ నోటీసులు ఇచ్చారని చెబుతున్నా.. మహిళా రిజర్వేషన్ల గురించి అడిగే నైతిక హక్కు ఉందా..? మీ ఇంటి పార్టీ అయిన మజ్లిస్ పార్టీని మహిళా బిల్లు కోసం ఒప్పిస్తారా..?

మహిళా బిల్లును పార్లమెంట్‌లో ఎస్పీ, ఆర్జేడీ కదా అడ్డుకుంది. మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు కాబట్టే దృష్టి మరల్చేందుకు కొత్త నాటకానికి కల్వకుంట్ల కుటుంబం తెర లేపింది. 
సానుభూతి కోసం చేస్తున్న డ్రామా ఇది. రాజ్యసభకు ఒక్క మహిళా ఎంపీని కూడా పంపని బీఆర్ఎస్‌కు రిజర్వేన్లపై మాట్లాడే హక్కు ఉందా..? ఆర్థిక మంత్రిగా తెలుగు ఆడబిడ్డకు మంత్రి వర్గంలో అవకాశం ఇచ్చారు. ఏకాభిప్రాయం వస్తే మహిళల హక్కులు కాపాడాలన్నది మా అభిప్రాయం..' అని అన్నారు.

ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులకు ఒక చట్టం.. సామాన్యులకు ఒక చట్టం ఉంటుందా..? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఈడీ ఎవరిని పిలుస్తోంది.. ఏం చేస్తుందనేది తమకు తెలియదన్నారు.
కల్వకుంట్ల కుటుంబానికి ఉన్న సంపద సరిపోదని.. వ్యాపారం చేయమని తెలంగాణ సమాజం చెప్పిందా..? అని అడిగారు. అక్రమ వ్యాపారానికి తెలంగాణ సమాజానికి ఎలా లింక్ పెడతారని నిలదీశారు. నీతి వంతులు అయితే ఎందుకు భుజాలు తడుముకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Also Read: MLC Kavitha: ప్రెస్‌మీట్ లైవ్‌లోనే ఎమ్మెల్సీ కవితకు షాకిచ్చిన ఢిల్లీ పోలీసులు  

Also Read: Minister KTR: మోదీ సర్కార్ చేతిలో ఈడీ కీలు బొమ్మ.. సీబీఐ తోలు బొమ్మ: మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.TwitterFacebook 

Trending News