Yadadri EO: భట్టి విక్రమార్క వివాదంలో భారీ ట్విస్ట్‌.. యాదాద్రి ఈవోపై బదిలీ వేటు

Yadadri EO Transfer: బ్రహ్మోత్సవాల సందర్భంగా యాదాద్రి ఆలయ సందర్శనలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు జరిగిన అవమానంలో భారీ ట్విస్ట్‌ చోటుచేసుకుంది. ఆలయ ఈవోపై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Mar 14, 2024, 07:37 PM IST
Yadadri EO: భట్టి విక్రమార్క వివాదంలో భారీ ట్విస్ట్‌.. యాదాద్రి ఈవోపై బదిలీ వేటు

Yadadri Temple: యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు జరిగిన అవమానం ఘటనలో ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రొటోకాల్‌ వివాదంలో చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో ఆలయ పాలన అధికారి (ఈవో) రామకృష్ణారావును బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. యాదాద్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈవో ప్రొటోకాల్‌ పాటించలేదని ఆరోపణలతో దేవాదాయ ధర్మాదాయ శాఖ అతడిపై బదిలీ వేటు వేసింది. ఈవో బదిలీతో ఆరోజు భట్టికి జరిగింది అవమానమే కదా? అని బీఆర్‌ఎస్‌ పార్టీ నిలదీస్తోంది. కొత్త ఈవోగా ఎ. భాస్కర్‌ రావును ప్రభుత్వం నియమించింది.

Also Read: Sudha Murty Oath: సుధామూర్తికి ప్రత్యేక గౌరవం.. ఎట్టకేలకు రాజ్యసభ సభ్యురాలిగా ప్రమాణస్వీకారం

 

అసలేం జరిగింది?
యాదాద్రి బ్రహ్మోత్సవాలకు ఈనెల 11వ తేదీన ముఖ్యమంత్రితోపాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు హాజరయ్యారు. దర్శనం అనంతరం ఆశీర్వచనాల సమయంలో సీఎం, మంత్రులు పీటలపై కూర్చోగా వారి కాళ్ల వద్ద ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమాక్క కూర్చొని ఉండడం తీవ్ర వివాదస్పదమైంది. దీనిపై బీఆర్‌ఎస్‌ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కాంగ్రెస్‌ పాలనలో దళితులకు దక్కే గౌరవం ఇదా? అని ప్రశ్నించింది. రాజకీయంగా తీవ్ర వివాదాస్పదం కావడంతో భట్టి విక్రమార్క ఏదో వివరణ ఇచ్చి కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. కానీ అక్కడ జరిగిన విషయాన్ని ఎవరూ మరచిపోలేకపోతున్నారు.

Also Read: Sri Rama Navami: ఈసారి భద్రాచలంలో శ్రీరామనవమి ఉత్సవాలు జరుగుతాయా? లేదా?

నష్ట నివారణ చర్యలు
భట్టి ఘటనతో ఆలయ పాలకమండలి నష్ట నివారణ చర్యలు చేపట్టింది. ఈవోను బదిలీ చేయడంతోపాటు ఆలయ పాలకమండలి కొత్తగా కొన్ని పీటలు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. పాతవి 4 ఉండగా.. కొత్తగా 10 పీటలు కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇకపై వీవీఐపీలు వచ్చిన సందర్భంలో పీటల కొరత ఏర్పడకుండా ఈ చర్యలు చేపట్టినట్లు భక్తులు భావిస్తున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News