Zee Telugu News: తగ్గేదెలా.. ఎన్ని నిర్భందాలు పెట్టినా జీ తెలుగు నిరుద్యోగుల పక్షం!.. తేల్చి చెప్పిన జీ తెలుగు ఎడిటర్..

Osmania University: ఉస్మానియాలో గత కొన్ని రోజులుగా నిరుద్యోగ  అభ్యర్థులు డీఎస్సీ ఎగ్జామ్ లు, గ్రూప్ ఎగ్జామ్ లు వాయిదా వేయాలని కూడా  తమ నిరసన చేపట్టారు. దీనిలో భాగంగా ఓయూలో జరుగుతున్న నిరసనలను కవర్ చేయడానికి వెళ్లిన జర్నలిస్టులు పట్ల పోలీసులు దారుణంగా ప్రవర్తించారు.

Written by - Inamdar Paresh | Last Updated : Jul 10, 2024, 05:59 PM IST
  • జీ రిపోర్టర్ పై పోలీసుల జులూం..
  • ఖండించిన రాజకీయా, మీడియా సంఘాలు..
Zee Telugu News: తగ్గేదెలా.. ఎన్ని నిర్భందాలు పెట్టినా జీ తెలుగు నిరుద్యోగుల  పక్షం!.. తేల్చి చెప్పిన జీ తెలుగు ఎడిటర్..

DSC and Groups Agitation in Osmania university: తెలంగాణలో కొన్నిరోజులుగా నిరుద్యోగులు నిరవధికంగా తమ నిరసన తెలియజేస్తున్నారు. డీఎస్సీ ఎగ్జామ్ లు, గ్రూప్ ఎగ్జామ్ లను వాయిదా వేయాలని కూడా తమ నిరసన తెలియజేస్తున్నారు. అంతే కాకుండా.. తెలంగాణలో కాంగ్రెస్  ఎన్నికలకు ముందు డీఎస్సీని, గ్రూప్స్ ఎగ్జామ్ లలో పోస్టుల సంఖ్యను పెంచుతామని హమీ ఇచ్చింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత, తాము ఇచ్చిన హమీని పట్టించుకోవట్లేదని నిరుద్యోగులు ఆందోళనలు చేపట్టారు. దీనిలో భాగంగా కొన్నిరోజుల నుంచి నిరుద్యోగులు తమ నిరసనలు తెలియజేస్తున్నారు. ఓయూలో నిరుద్యోగులు తమ రాజ్యంగం కల్పించిన హక్కులకు లోబడి నిరసనలు తెలియజేస్తున్నారు. దీనిలో భాగంగా.. నిరుద్యోగులు చేస్తున్న నిరసనలను , వారి గోడును కవర్ చేయడానికి వెళ్లిన రిపోర్టర్ లపైన పోలీసులు జులూం ప్రదర్శించారు. 

Read more: DSC Aspirants Protest: ఓయూలో హైటెన్షన్.. ఆందోళనకారుల వెంట పడి మరీ అరెస్టులు.. వీడియో వైరల్..

జీ తెలుగు రిపోర్టర్ పై పోలీసుల జబర్దస్తీ..

నిరుద్యోగుల గోడును, వారి సమస్యలను కవర్ చేయడానికి వెళ్లిన జీ తెలుగు మీడియా ప్రతినిధులపై పోలీసులు దారుణంగా ప్రవర్తించారు. అంతేకాకుండా... రిపోర్టర్ శ్రీచరణ్ ను గల్లా పట్టుకుని మరీ అక్కడున్న సీఐ గల్లా పట్టుకుని మరీ లాక్కెళ్లారు. తాను.. మీడియా ప్రతినిధినని, ఐడీ కార్డు చూపిస్తున్న కూడా.. పోలీసులు బలవంతంగా జీబ్ లో లాక్కెళ్లి కూర్చుండబెట్టారు. పోలీసు వాహనంలో కూడా బెదిరింపులకు గురిచేశారు. ఒక ఉగ్రవాది, నక్సలైట్, 144  సెక్షన్ ఉన్న ప్రదేశాల్లో వెళితే ఎలా ప్రవర్తిస్తారో.. ఆవిధంగా పోలీసులు దురుసుగా ప్రవర్తించారు.

ఓయూ పీఎస్ కు తీసుకెళ్లి.. పోలీసులు దురుసుగా మాట్లాడారు. రిపోర్టర్ ఫోన్ లాక్కొని, వీడియో గ్రాఫర్ను వీడియో తీయోద్దని కూడా హుకుం జారీ చేశారు. పోలీసులతో పెట్టుకొవద్దని బెదిరించినట్లు తెలుస్తోంది. పోలీస్ పవర్ ఏంటో చూపిస్తామంటూ  బెదిరింపులకు గురిచేశారు. చాలా సేపు పోలీసు వాహనంలో ఎక్కించుకుని తిప్పుతూ, ఫోన్ లాక్కుని పోలీసులు సైకోయిజం చూపించారు. 

 ఖండించిన జీ తెలుగు న్యూస్ ఎడిటర్..

జీన్యూస్ రిపోర్టర్ శ్రీ చరణ్, వీడియో జర్నలిస్టులపై పోలీసుల జులుంను.. జీ న్యూస్ తెలుగు ఎడిటర్ భరత్ కుమార్ సీరియస్ గా స్పందించారు. విద్యార్థుల నిరసనలను కవర్ చేయడానికి వెళ్లిన రిపోర్టర్, వీడియో ప్రతినిధులపైన పోలీసులు ప్రవర్తించిన తీరు..  దారుణమన్నారు. పోలీసులు ఇలాంటి పనులు చేసి తమ మనోస్థైర్యాన్ని మాత్రం దెబ్బతీయలేరని, తాము రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తామని ఎడిటర్ భరత్ అన్నారు. గత కొన్నిరోజులుగా విద్యార్థులు నిరసనలను కవర్ చేస్తున్నామని  అందరి సమస్యలను ప్రజల ముందుంచడం తమ ప్రథమ కర్తవ్యమన్నారు.

అధికారపక్షమైన, ప్రతిపక్షమైన.. నిష్పాక్షికంగా తాము..  వార్తలను కవర్ చేస్తామని ఎడిటర్  తెల్చిచెప్పారు. తాము ఫోర్త్ ఎస్టేట్ గా.. సమాజంలో తమ వంతు బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తున్నామని అన్నారు. ఇలాంటి పనులు చేసి మీడియా గొంతు నొక్కేందుకు పోలీసులు ప్రయత్నాలు చేయోద్దని హితవు పలికారు. అంతేకాకుండా.. రిపోర్టర్ పై దురుసుగా ప్రవర్తించిన సీఐ రాజేందర్ ను వెంటనే  సస్పెండ్ చేయాలని కూడా డిమాండ్ చేశారు. ఉన్నతాధికారులు వీరిపై చర్యలు తీసుకుంటేనే.. కిందిస్థాయి అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించకుండా ఉంటారని కూడా ఎడిటర్ భరత్ స్పష్టంచేశారు. 

Read more: Rat in Chutney: చట్నీలో చిట్టెలుక ఎంత బాగా ఈత కొడుతుందో చూశారా..?.. వీడియో ఇదిగో..

రిపోర్టర్ పై దాడిని  ఖండించిన రాజకీయ, జర్నలిస్ట్ సంఘాలు..

జీ తెలుగు న్యూస్ శ్రీచరణ్ పై దాడి ఘటనను రాజకీయ, జర్నలిస్టు సంఘాలు ఖండించాయి. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎమ్మెల్యే హరిష్ రావు, కేటీఆర్, క్రాంతి కుమార్, ఆర్మూర్ ఎమ్మెల్యే  రాకేష్ రెడ్డి, జర్నలిస్ట్ క్రాంతికుమార్ లు, సీనియర్ జర్నలిస్టు దేవుల పల్లి అమర్ కూడా దీనిపై స్పందించారు.  ఘటనపై పోలీసుల తీరును తీవ్రంగా ఖండించారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News