Ghmc: జీహెచ్‌ఎంసీలో కంటోన్మెంట్‌ విలీన ప్రక్రియపై తొలి అడుగు..

Ghmc: జీహెచ్‌ఎంసీ కంటోన్మెంట్ విలీనంపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. విలీనంపై కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. రక్షణ శాఖ, రాష్ట్ర మున్సిపల్ సెక్రటరీ సహా 8 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతం విలీనానికి విధివిధానాలను ఈ కమిటీ రూపొందించనున్నట్లు స్పష్టం చేసింది.

  • Zee Media Bureau
  • Jan 5, 2023, 05:11 PM IST

Ghmc: జీహెచ్‌ఎంసీ కంటోన్మెంట్ విలీనంపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. విలీనంపై కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. రక్షణ శాఖ, రాష్ట్ర మున్సిపల్ సెక్రటరీ సహా 8 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతం విలీనానికి విధివిధానాలను ఈ కమిటీ రూపొందించనున్నట్లు స్పష్టం చేసింది. కాగా కంటోన్మెంట్ ను జీహెచ్ ఎంసీలో విలీనం చేయాలని రక్షణ మంత్రత్వ శాఖ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. విలీనం జరిగితే ఫ్లై ఓవర్, ఫుట్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం జరిగి ట్రాఫిక్ సమస్య తీరే అవకాశం ఉందని...రాష్ట్ర ప్రభుత్వం కొన్నేళ్లుగా కేంద్రానికి విన్నవిస్తున్న నేపథ్యంలో కమిటీ ఏర్పాటుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది.

 

Video ThumbnailPlay icon

Trending News