NTR Health University: హెల్త్‌ వర్సిటీ పేరు మార్పుపై టీడీపీ నేతల ఆందోళనలు

NTR Health university name change: ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పుపై ఏపీ అసెంబ్లీలో రగడ చోటు చేసుకుంది. ఐదో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన వెంటనే స్పీకర్ తమ్మినేని సీతారం ప్రశ్నోత్తరాలు చేపట్టారు. అయితే ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్సిటీ పేరు ఎలా మారుస్తారని టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు. స్పీకర్ పోడియం వద్ద నిరసన చేపట్టారు.

  • Zee Media Bureau
  • Sep 22, 2022, 01:48 AM IST

TDP protests in AP Assembly: స్పీకర్‌ పోడియంను చుట్టుముట్టిన టీడీపీ సభ్యులు... ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరు మార్చొద్దంటూ నినాదాలు చేశారు. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పుపై బిల్లు పెట్టినప్పుడు అభిప్రాయం చెప్పాలని స్పీకర్ తెలిపారు. అయినప్పటికీ టీడీపీ సభ్యులు తమ నిరసనను కొనసాగించారు. సభలో ఆందోళనకు దిగిన టీడీపీ సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు.

Video ThumbnailPlay icon

Trending News