'కరోనా వైరస్'కు మందు ఇదిగో...!!

'కరోనా వైరస్' ప్రపంచ దేశాలను కుదిపేస్తున్న వేళ..  అన్ని దేశాలు ఈ పేరు వింటేనే గజగజా వణికిపోతున్నాయి. వేలకు వేల మంది కరోనా దెబ్బకు ప్రాణాలు  విడుస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ క్రమంలో  చాలా దేశాలు కరోనా వైరస్ బారి నుంచి తప్పించుకోవడానికి.. తమ ప్రజలను కాపాడడానికి అనేక  రకాల ప్రయత్నాలు చేస్తున్నాయి.

Last Updated : Apr 5, 2020, 02:01 PM IST
'కరోనా వైరస్'కు మందు ఇదిగో...!!

'కరోనా వైరస్' ప్రపంచ దేశాలను కుదిపేస్తున్న వేళ..  అన్ని దేశాలు ఈ పేరు వింటేనే గజగజా వణికిపోతున్నాయి. వేలకు వేల మంది కరోనా దెబ్బకు ప్రాణాలు  విడుస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ క్రమంలో  చాలా దేశాలు కరోనా వైరస్ బారి నుంచి తప్పించుకోవడానికి.. తమ ప్రజలను కాపాడడానికి అనేక  రకాల ప్రయత్నాలు చేస్తున్నాయి.

ముఖ్యంగా వైరస్ ఒకరి నుంచి ఒకరికి వ్యాపించకుండా  చర్యలు తీసుకుంటున్న పరిస్థితి చూస్తున్నాం. అంతే కాదు కరోనా పాజిటివ్ రోగులకు ప్రత్యేకంగా చికిత్సలు అందిస్తున్నారు. మరోవైపు 'కరోనా వైరస్'కు వ్యాక్సిన కనుగొనేందుకు.. మందు కనుగొనేందుకు పరిశోధకులు ప్రయత్నిస్తున్నారు.  ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో పరిశోధకులు నిరంతరం పని చేస్తున్నారు. అటు ఆస్ట్రేలియా పరిశోధకులు ఓ అద్భుత మందు ఉందని కనుగొన్నారు. 

గ్రిడ్ వైఫల్యంలో అర్ధం లేదు..!!

ఆస్ట్రేలియా మెల్ బోర్న్ లోని మోనాష్ యూనివర్సిటీ ఆఫ్ బయోమెడిసన్ శాస్త్రవేత్తలు కరోనా వైరస్ మందు కోసం కొద్ది రోజులుగా పరిశోధనలు చేస్తున్నారు.  ఐతే ఐవర్ మెక్టిన్  అనే మందు కరోనా వైరస్ కట్టడికి బాగా ఉపయోగపడుతుందని వారు చెబుతున్నారు. ఇది ఇప్పటికే  మార్కెట్లో ఉందంటున్నారు. ఈ మెడిసిన్ వల్ల కరోనా వైరస్ 48   గంటల్లోనే చనిపోతుందని వారి అధ్యయనంలో వెల్లడైంది. నిజానికి  ఐవర్ మెక్టిన్ అనేది ఒక యాంటీ పారాసైటిక్ మెడిసిన్. 

మళ్లీ దీపావళి వచ్చేసింది..!!

ఐతే ఈ మందు ఇస్తే .. కణాల్లో కరోనా వైరస్ పెరుగుదల ఆగిపోతుందని నిర్దారణ అయిందంటున్నారు మోనాష్ యూనివర్శిటీ పరిశోధకులు. ఒక్క డోస్ ఇచ్చిన వెంటనే శరీరంలోని వైరల్ RNAను తొలగించడం మొదలు పెడుతుందని చెబుతున్నారు. 

FDA ఆమోదించిన ఈ మందు చాలా వైరస్ లను నాశనం చేయగలదని మోనాష్ యూనివర్శిటీ పరిశోధకులు తెలిపారు. హెచ్ఐవీ, డెంగ్యూ, ఇన్ఫ్లూయేంజా, జికా వైరస్ లకు ఇది వ్యతిరేకంగా పని చేస్తుందని చెబుతున్నారు.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News