గ్రిడ్ వైఫల్యంలో అర్ధం లేదు..!!

'కరోనా' మహమ్మారిని ఎదుర్కునేందుకు 130 కోట్ల మంది భారతీయులు కదం తొక్కాలని.. సామూహికంగా కరోనా పై పోరాటం సాగించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.

Last Updated : Apr 4, 2020, 06:05 PM IST
గ్రిడ్ వైఫల్యంలో అర్ధం లేదు..!!

'కరోనా' మహమ్మారిని ఎదుర్కునేందుకు 130 కోట్ల మంది భారతీయులు కదం తొక్కాలని.. సామూహికంగా కరోనా పై పోరాటం సాగించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.

ఇందులో భాగంగా అందరు ప్రజల భాగస్వామ్యాన్ని.. ఐకమత్యాన్ని చాటి చెప్పేందుకు ఏప్రిల్ 5న ఆదివారం నాడు రాత్రి 9 గంటల నుంచి 9 గంటల 9 నిముషాల వరకు లైట్లు ఆర్పేసి .. దీపపు కాంతులను వెలిగించాలని కోరారు. దేశవ్యాప్తంగా ఈ మహత్కార్యాన్ని అమలు చేసేందుకు అన్ని వర్గాల ప్రజలు సమాయత్తమవుతున్నారు. ఈ క్రమంలో ఓ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఒక్కసారిగా లైట్లు ఆర్పివేయడం.. 9 నిముషాల తర్వాత తిరిగి అన్నీ ఒకేసారి ఆన్ చేయడం వల్ల పవర్ గ్రిడ్ ఫెయిల్ అయ్యే అవకాశం ఉందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. గ్రిడ్ వైఫల్యం కారణంగా .. అన్ని ఎలక్ట్రానిక్ పరికరాలు దెబ్బతింటాయని ప్రచారం
చేస్తున్నారు. ఈ క్రమంలో అసలు ఏం జరుగుతుందనే ఆందోళన నెలకొంది. 

మరోవైపు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ స్పందించింది. ఏప్రిల్ 5 న రాత్రి 9  గంటల నుంచి 9 గంటల 9 నిముషాల వరకు విద్యుత్ లైట్లు ఆఫ్ చేయడం వల్ల గ్రిడ్ వైఫల్యం చెందుతుందని.. గ్రిడ్ సామర్థ్యం దెబ్బతింటుందనే వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది. వోల్టేజీ ఫ్లక్చువేషన్.. అంటే కరెంటు సరఫరాలో హెచ్చు తగ్గుల కారణంగా.. ఇంట్లోని ఎలక్ట్రానిక్ వస్తువులు పాడైపోతాయనే ప్రచారం అంతా నిజం కాదని వెల్లడించింది. ఇలాంటివన్నీ కేవలం భయాలుగానే కొట్టిపారేసింది.

ఏప్రిల్ 5న రాత్రి 9 గంటలకు వీధి దీపాలు ఆర్పివేయాలని లేదా.. ఇళ్లల్లోని ఎలక్ట్రానిక్ గృహోపకరణాలను ఆఫ్ చేయాలని సూచనలు ఇవ్వలేదని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది. ఇళ్లల్లోని ఎలక్ట్రానిక్ గృహోపకరణాలు అంటే టీవీ, ఫ్రిడ్జ్, ఏసీల్లాంటివి ఆపివేయాలని చెప్పలేదని తెలిపింది. వీధి దీపాలు, ఆస్పత్రుల్లోని లైట్లు.. అన్నీ ఆన్ లోనే ఉంటాయని తెలిపింది. పౌరుల భద్రత కోసం వీధి దీపాలు వెలిగించే  ఉంచుతారు కాబట్టి.. పవర్ గ్రిడ్ పై ఎలాంటి ప్రభావం పడదని వెల్లడించింది.

మరోవైపు విద్యుత్ రంగంలో నిపుణులు కూడా ఇదే అభిప్రాయాన్ని వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా ఎర్త్ అవర్  పాటించినప్పుడు విద్యుత్ లైట్లు ఆర్పివేసిన విధంగానే ఇప్పుడు కూడా జరుగుతుందన్నారు. దీని వల్ల పవర్ గ్రిడ్ వైఫల్యం చెందుతుందనేది కేవలం అపోహ మాత్రమేనని వెల్లడించారు. అంతే కాదు ఇళ్లల్లోని ఎలక్ట్రానిక్ గృహోపకరణాలు అన్నీ ఆఫ్ చేసి ఒక్కసారిగా ఆన్ చేసినప్పుడు మాత్రమే పవర్ గ్రిడ్ పై ప్రభావం చూపే అవకాశం ఉంటుందంటున్నారు. ప్రధాని మోదీ సూచన ప్రకారం ఏప్రిల్ 5న రాత్రి  9  గంటల   నుంచి 9 గంటల 9 నిముషాల వరకు విద్యుత్ దీపాలు ఆర్పివేసి కొవ్వొత్తులు, దీపాలతో సంఘీభావం తెలపవచ్చన్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

 

 

Trending News