Chicken Price Pakistan: ఆల్‌టైం రికార్డు.. కేజీ చికెన్ ధర ఎంతో తెలిస్తే మైండ్ బ్లాక్ అవుతుంది!

2023 Chicken Meat Prices hits all time high in Pakistan. ప్రస్తుతం కరాచీలో కేజీ చికెన్ ధర ఏకంగా రూ. 720లుగా ఉంది. అదే సమయంలో కిలో కోడి ధర రూ. 490లుగా ఉంది.   

Written by - P Sampath Kumar | Last Updated : Feb 12, 2023, 09:32 PM IST
  • రికార్డు సృష్టించిన చికెన్ ధర
  • కేజీ చికెన్ ధర ఎంతో తెలిస్తే మైండ్ బ్లాక్
  • ఆందోళన వ్యక్తం చేస్తున్న చికెన్ ప్రియులు
Chicken Price Pakistan: ఆల్‌టైం రికార్డు.. కేజీ చికెన్ ధర ఎంతో తెలిస్తే మైండ్ బ్లాక్ అవుతుంది!

1 KG of Chicken Price in Karachi is Rs 720: దాయాది దేశం పాకిస్తాన్‌లో చికెన్ ధరలు (Chicken Price Pakistan 2023) ఆకాశాన్ని అంటాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా చికెన్ ధరలు భారీ ఎత్తున పెరిగాయి. ప్రస్తుతం కరాచీలో కేజీ చికెన్ ధర ఏకంగా రూ. 720లుగా ఉంది. అదే సమయంలో కిలో కోడి ధర రూ. 490లుగా ఉంది. పాకిస్తాన్ దేశ చరిత్రలోనే చికెన్ ధర ఇంతలా పెరగడం ఇదే తొలిసారి. చికెన్ ధరలు చూసి పాక్ ప్రజలు అల్లాడిపోతున్నారు. సామాన్య ప్రజలు అయితే చికెన్ ఊసే ఎత్తడం లేదని పాకిస్తాన్ స్థానిక మీడియా సమా టీవీ పేర్కొంది. 

పాకిస్తాన్‌లోని కరాచీ నగరం సహా రావల్పిండి, ఇస్లామాబాద్, లాహోర్‌ మరియు మరికొన్ని నగరాల్లో చికెన్ ధర ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకుంది. దేశంలోనే అత్యధిక జనాభా కలిగిన లాహోర్‌లో కిలో కోడి మాంసం ధర రూ. 550-600 మధ్య ఉంది. కొన్ని ప్రాంతాల్లో కిలో చికెన్ ధర రూ. 700-705గా కూడా ఉందట. పాక్ చరిత్రలో కనీవినీ ఎరుగుని ఈ చికెన్ ధరలు చూసి.. చికెన్ ప్రియులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధిక ధరల కారణంగా చికెన్‌ను తినలేకపోతున్నామని సామాన్యులు చెబుతున్నారు.

కోళ్ల ఫీడ్ కొరత కారణంగా అనేక పౌల్ట్రీ వ్యాపారాలు మూసివేయడం వల్ల ఈ ధరలు పెరిగాయని సమా టీవీ పేర్కొంది. ప్రభుత్వం ప్రస్తుతం ఫీడ్ కొరతకు గల కారణాలను పరిశోధిస్తోంది. పెరుగుతున్న ధరల వల్ల ప్రభావితమైన వినియోగదారులకు ఉపశమనం కలిగించే మార్గాలను అన్వేషిస్తోంది. పౌల్ట్రీ పరిశ్రమ పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థలో ఒక ముఖ్యమైన భాగం. పౌల్ట్రీ సరఫరాకు అంతరాయాలు ఏర్పడితే దేశ ఆహార భద్రత మరియు ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావం చూపుతుంది. అందుకే పౌల్ట్రీ ఉత్పత్తుల సరఫరాకు అంతరాయం లేకుండా, చికెన్ ధరలు స్థిరంగా ఉండేలా ప్రభుత్వం కృషి చేస్తోంది.

Also Read: IND vs AUS 3rd Test: భార‌త్, ఆస్ట్రేలియా మూడో టెస్టు వేదిక మార్పు.. వైజాగ్‌లో మూడో టెస్ట్!   

Also Read: IND vs AUS: తొలి టెస్టులో ఆస్ట్రేలియా దారుణ ఓటమి.. రంగంలోకి కొత్త స్పిన్నర్‌! డేవిడ్ వార్నర్‌పై వేటు  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News