Third Wave Fear: ఇండియాలో కరోనా మహమ్మారి తగ్గుతుంటే బ్రిటన్‌లో కేసులు పెరుగుతున్నాయి. మరోవైపు కరోనా థర్ద్‌వేవ్ భయం పొంచి ఉండటంతో లాక్‌డౌన్ తొలగిస్తారా లేదా అనేది సందేహాస్పదంగా మారింది.
బ్రిటన్ దేశాన్ని ఇప్పుడు డెల్టా వేరియంట్ (Delta Variant) కేసులు భయపెడుతున్నాయి. వారం రోజుల వ్యవధిలో 33 వేల 630కు పెరిగాయి. డెల్టా వేరియంట్ కేసుల సంఖ్య దేశంలో ఇప్పుడు 75 వేల 953కు చేరింది. ప్రస్తుతం దేశంలో నమోదవుతున్న కేసుల్లో 99 శాతం డెల్టా వేరియంట్‌కు సంబంధించినవే. యూకేలో వేరియంట్ ఆఫ్ కన్సెర్న్ కేసుల్ని పర్యవేక్షిస్తున్న పబ్లిక్ హెల్త్ ఇంగ్లండ్ ప్రకారం ఆల్ఫా వీఓసీతో పోలిస్తే...డెల్టాతో ఆసుపత్రి పాలయ్యేవారే ఎక్కువ. దేశంలో ఇచ్చిన కోవిడ్ వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నవారికి డెల్టా వేరియంట్ తో ముప్పు గణనీయంగా తగ్గిందని తేలింది. జూన్ 14 నాటికి డెల్టా వేరియంట్ కారణంగా దేశంలో 806 మంది ఆసుపత్రి పాలయ్యారు. డెల్టా వేరియంట్ కారణంగా మరణాలు ఎక్కువగా లేకపోయినా..కొత్త వేరియంట్లు వచ్చిన తరువాత సహజంగానే మరణాలు రేటు నెమ్మదిగా పెరుగుతుందని పబ్లిక్ హెల్త్ ఇంగ్లండ్ తెలిపింది.కోవిడ్ వ్యాక్సిన్(Covid Vaccine) తీసుకున్నవారిలో కరోనా వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని అధ్యయనాలు వెల్లడించాయి. యూకేలో థర్డ్‌వేవ్‌కు కారణంగా ఉన్న డెల్టా వేరియంట్ భయంతో లాక్‌డౌన్‌ను (Lockdown) పూర్తిగా తొలగించేందుకు ప్రభుత్వం వెనుకంజ వేస్తోంది.
Also read: Global COVID-19 Death Toll: ప్రపంచ వ్యాప్తంగా 40 లక్షలు దాటిన కరోనా మరణాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook